breaking news
Book house
-
లైఫంత లైబ్రరీ
‘చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ మంచి పుస్తకాన్ని కొనుక్కో’ అన్న కందుకూరి వీరేశలింగం మాటను నిజం చేశాడు కర్ణాటక, హరెలహళ్లికి చెందిన అంకే గౌడ. ఇప్పుడతని వయసు 75 ఏళ్లు. పుస్తకాలను కొని చదివి, భద్రం చేసే పనిని తన 20వ ఏట మొదలుపెట్టాడు. ఇప్పటివరకు పోగైన రెండు కోట్ల పుస్తకాలతో ‘బుక్ మానే (బుక్ హౌజ్)’ పేరుతో ఓ గ్రంథాలయాన్నే ఏర్పాటు చేసి.. దాన్నే తన నివాసంగా మలచుకున్నాడు. కండక్టర్.. బుక్ కలెక్టర్అంకే గౌడ్ ఓ వైపు కన్నడ సాహిత్యంలో పీజీ చదువుతూనే మరో వైపు బస్ కండక్టర్‌గా ఉద్యోగంలో చేరాడు. చిన్నప్పటి నుంచీ పుస్తకం పఠనం మీద ఆసక్తి మెండు. దానికి కాలేజీలో తన ్ర΄÷ఫెసర్ అనంతరాము ప్రభావం, స్ఫూర్తీ తోడవడంతో పుస్తకాలను కొనడమూ మొదలుపెట్టాడు. కండక్టర్‌గా తనకొచ్చే జీతంలో ము΄్పావుభాగం పుస్తకాల కొనుగోలు మీదే వెచ్చించేవాడు. పెళ్లయి, పిల్లాడు పుట్టి బాధ్యతలు పెరిగినా ఇంటి ఖర్చులను తగ్గించుకునేవాడు కానీ పుస్తకాల బడ్జెట్లో కోత పెట్టేవాడు కాదు. అతని ఆ ఆసక్తిని, అలవాటును సహధర్మచారిణి విజయలక్ష్మి గౌరవించి.. ఉన్నదాంట్లోనే ΄÷దుపుగా సంసారం చేయసాగింది. చివరకు తనకు నచ్చిన, లోకం మెచ్చిన పుస్తకాలను కొనడానికి అంకే గౌడ .. మైసూరులోని తమ ఇంటిని అమ్మినా మారుమాట్లాడకుండా భర్తను అనుసరించింది ఆమె. ప్రస్తుతం ‘బుక్ మానే’లోనే ఓ మూల ఆ కుటుంబం నివాసముంటోంది. అందరికీ ఉచితం1832 నాటి రాతప్రతులు సహా దేశ, విదేశీ భాషలన్నిటిలోని అరుదైన సాహిత్యం అంకే గౌడ ‘బుక్ మానే’లో కనిపిస్తుంది. సైన్స్, టెక్నాలజీ, మైథాలజీ, ఫిలాసఫీలకు సంబంధించిన పుస్తకాలూ దొరుకుతాయి. ఈ లైబ్రరీకి ఎవరైనా వెళ్లి కావల్సిన పుస్తకాలను ప్రశాంతంగా చదువుకోవచ్చు. ప్రవేశ రుసుము కానీ, పుస్తకానికి అద్దె కానీ లేదు. పూర్తిగా ఉచితం. బడి పిల్లలు, రీసెర్చ్ స్కాలర్స్, సివిల్ సర్వీస్‌కి ప్రిపేర్ అవుతున్నవాళ్లు, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు ఈ లైబ్రరీకి రెగ్యులర్ విజిటర్స్. పర్యాటకుల గురించైతే విడిగా చెప్పక్కర్లేదు. ఎక్కడెక్కడి నుంచో ‘బుక్ మానే’ను చూడ్డానికి వస్తూంటారు. ‘పుస్తక పఠనం మీద ఆసక్తి, జ్ఞానతృష్ణ ఉన్న ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వచ్చి తమకు కావల్సింది చదువుకోగలిగేలా ఈ లైబ్రరీని మలచాలి.. ఓ నాలెడ్జ్ హబ్‌గా మార్చాలన్నదే నా కల, భవిష్యత్ లక్ష్యం’ అంటాడు అంకే గౌడ. -
కొత్త పుస్తకాలు
బాల్యం నుంచి స్వేచ్ఛ ప్రచురణ : ప్రజాశక్తి బుక్‌హౌస్ రచన : జాన్హోల్ట్ కాలిఫోర్నియాలో ఓ స్కూల్ టీచర్ రచనకు తెలుగు అనువాదం ఈ పుస్తకం పేజీలు: 218, వెల : వంద రూపాయలు ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్ - తెలంగాణ ఎమ్హెచ్ మక్దూం భవన్, ప్లాట్ నం. 20/1, అజామాబాద్, ఆర్టీసీ కల్యాణమండపం దగ్గర, హైదరాబాద్- 20 ఫోన్: 040-27660013 ఇతర బ్రాంచ్‌లు... హైదరాబాద్‌లో చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి (ఎస్.వి.కె), ఇ.సి.ఐ.ఎల్. నల్లగొండ, హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, ఒంగోలు నా వాళ్లు ఇది 27 కథల సంకలనం రచన: డాక్టర్ కె.వి. లక్ష్మీరాఘవ ప్రచురణ: జయంతి పబ్లికేషన్స్ పేజీలు:174, వెల: వంద రూపాయలు ప్రతులకు: డాక్టర్ కె.వి. లక్ష్మీరాఘవ, 3-99, అప్పాగారి స్ట్రీట్, కురబలకోట, చిత్తూరు జిల్లా- 517 350 ఫోన్: 08571 28067, 94401 24700 సంచార స్రవంతి సంచార, గిరిజన తెగల దుర్భర జీవిత గాథలు రచన: డాక్టర్ వీఎన్వీకే శాస్త్రి పేజీలు : 238, వెల: రూ. 150 ప్రతులకు: డాక్టర్ వీఎన్వీకే శాస్త్రి, 510, గ్రీన్ బ్లాక్, మై హోమ్ రెయిన్బో అపార్ట్మెంట్, టోలిచౌకి, హైదరాబాద్- 500 008. ఫోన్: 040 23567357 మరియు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాల్లో...