breaking news
bomb joke
-
ప్రగతి భవన్ కు బాంబు బెదిరింపు నిందితుడు అరెస్ట్
-
బాంబు బెదిరింపు..ఆగంతకుడి అరెస్ట్
జగిత్యాల : జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేట్ పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. నిందితుడు కరీంనగర్‌లోని ఓ జిలేబీ షాప్‌లో పనిచేసే గోపిగా గుర్తించామని జిల్లా ఎస్పీ అనంతర శర్మ తెలిపారు. అతని పై చట్ట ప్రకారం చర్యలు చేపడుతామని వెల్లడించారు. పోలీసుల తనఖీలో ఎటువంటి బాంబులు కనపడలేదని, దీని గురించి ఆందోళన చెందాల్సి అవసరం లేదని చెప్పారు. -
స్కూళ్లకు బాంబు బెదిరింపు
జగిత్యాల : రెండు ప్రైవేటు స్కూళ్లలో బాంబులు పెట్టామని ఓ ఆంగతకుడు ఫోన్ చేసి జగిత్యాల పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు జగిత్యాలలోని ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులను బయటికి పంపించి తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్ సిబ్బందిని హుటాహుటిన రప్పించి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉదంతంతో స్కూలు సిబ్బంది, తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. పోలీసులు దీనికి సంబంధించిన వివరాలు బయటికి తెలియనివ్వడంలేదు. ఇప్పటి దాకా చుక్కారామయ్య, గౌతమి మోడల్ స్కూళ్లలో తనిఖీలు చేపడతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బాంబు ఉందంటూ జోక్.. మోడల్ అరెస్ట్
ముంబై: తన స్నేహితురాలి దగ్గర బాంబు ఉందని అబద్ధం చెప్పి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు అనవసరంగా అధికారులను కంగారు పెట్టి, విమానం ఆలస్యంగా బయల్దేరడానికి కారణమైన ఓ మోడల్‌ను భద్రత సిబ్బంది ఆరెస్ట్ చేసింది. ఆమెకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. గురువారం రాత్రి కంచన్ ఠాకూర్ (27) అనే మోడల్ తన ముగ్గురు స్నేహితులతో కలసి ఎయిరిండియా విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చింది. ఆమె బోర్డింగ్ గేట్ దాటిన తర్వాత విమాన భద్రత సిబ్బంది దగ్గరకు వెళ్లి తన స్నేహితురాలి హ్యాండ్ బ్యాగ్‌లో బాంబు ఉందని, జాగ్రత్తగా తనిఖీ చేయాలని కోరింది. దీంతో అక్కడున్నవారు భయపడిపోయారు. భద్రత సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్, విమానాశ్రయ అధికారులకు తెలియజేశారు. సీఐఎస్ఎఫ్ అధికారులు వెంటనే వచ్చి మోడల్, ఆమె స్నేహితులను ప్రశ్నించారు. నలుగురిని, వారి లగేజీని వదిలి వెళ్లాల్సిందిగా ఎయిరిండియా సిబ్బందికి సూచించారు. దీంతో కంగారు పడిపోయిన మోడల్ తాను జోక్ చేశానని, స్నేహితురాలి బ్యాగ్‌లో బాంబు లేదని చెప్పింది. ఈ దశలో సీఐఎస్ఎఫ్ సిబ్బందికి, మోడల్‌కు వాగ్వాదం జరిగింది. మోడల్‌తో పాటు ఆమె స్నేహితులను వదిలేసి గంట ఆలస్యంగా విమానం బయల్దేరింది. షెడ్యూల్ సమయం ప్రకారం రాత్రి 9 గంటలకు బయల్దేరాల్సిన ఉండగా, 10 గంటలకు వెళ్లింది. పోలీసులు మోడల్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తర్వాత ఆమె బెయిల్‌పై విడుదలైంది. ముంబై విడిచి వెళ్లవద్దంటూ మోడల్‌ను, ఆమె స్నేహితులను అధికారులు ఆదేశించారు. మోడల్ స్నేహితురాలు ఒకరు అనారోగ్యంతో ఉన్న బాధపడుతున్న తల్లిని చూసేందుకు వెళ్లాల్సివుంది.