breaking news
birhth day
-
‘రాములమ్మ’కి మహేశ్ బర్త్‌డే విషెష్
సాక్షి, హైదరాబాద్ : లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పుట్టిన రోజు నేడు(జూన్ 24). ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ‘రాములమ్మ’కు శుభాకాంక్షలు తెలియజేశారు. సూపర్ స్టార్ మహేశ్‌బాబు సైతం విజయశాంతికి బర్త్ డే విషెస్ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే విజయశాంతి గారు. ఎల్లప్పుడూ ఆరోగ్యం, సంతోషం మీ వెంటే ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ సూపర్‌స్టార్ మహేశ్ ట్విటర్ ద్వారా విజయశాంతికి పుట్టినరోజు అభినందనలు తెలిపారు. దీనికి ఆమె 'థ్యాంక్యూ సూపర్ స్టార్ మహేశ్‌బాబు గారు' అని రిప్లై ఇచ్చారు. అలాగే ‘సరిలేరు నీకెవ్వరు’ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా విజయశాంతికి బర్త్ డే విషెష్ తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే విజయశాంతి గారు.. మీరు నటించే సినిమాకు మీరే అతి పెద్ద ఆస్తి, బలం. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి మీరు అందించిన కృషి మాటల్లో వర్ణించలేను' అని ట్వీట్ చేశారు. (చదవండి : మహేశ్‌తో 'జనగణమన' నా డ్రీమ్) 90వ దశకంలో అగ్రతారలందరితో నటించి లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్నారు విజయశాంతి. తనదైన నటనతో గ్లామర్ సినిమాలే కాదు, మహిళా ప్రధాన చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. అప్పటి హీరోలకు ధీటుగా యాక్షన్ సినిమాల్లోనూ, విప్లవాత్మక చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి, కొద్ది కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలా కాలం తర్వాత సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా చేసిన‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ తర్వాత విజయశాంతికి భారీగానే ఆఫర్లు వచ్చాయట. కానీ విజయశాంతి వేటిని అంగీకరించలేదని తెలుస్తోంది. -
అమరవీరుల త్యాగాల ఫలమే తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖ ర్రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి ఆమెను కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. పూ ర్తి ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం గడపాలని ఆకాంక్షించారు. అలాగే.. ముఖ్యమంత్రి కేసీ ఆర్కు గవర్నర్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టిన తేదీ, రాష్ట్ర అవతరణ దినోత్సవం ఒకటే రోజు కావడం ఆనందంగా ఉందని గవర్నర్ అన్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య రాష్ట్ర అవతరణకు సంబం ధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. భార త స్వాతంత్య్రం తర్వాత అంత సుదీర్ఘ కాలం జరిగిన ఉద్యమంగా తెలంగాణ రాష్ట్ర పోరాటం చరిత్రలో నిలుస్తుందని తమిళిసై అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారని కేసీఆర్ చెప్పారు. వారి త్యాగ ఫలితమే ఈ రాష్ట్రమన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా అమరులకు ని వాళులు అర్పించిన తర్వాతే పతాకావిష్కరణ చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి వెంట రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, కేఆర్ సురేశ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సో మేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్రావు, మేయర్ బొంతు రా మ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, నాగేందర్, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
గోదావరి సీమపై ముళ్ళపూడి సంతకం
ముళ్లపూడి వెంకటరమణ.. ఈ పేరు తెలియని ఆంధ్రుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఈ పేరు స్ఫురణకు వచ్చిన వెంటనే బుడుగు గుర్తొస్తాడు.. ఆ వెంటనే ఆయన కలం నుంచి జనించిన పాత్రలు ఇంకొన్ని కళ్లముందు కదలాడతాయి. ఆ పాత్రల నైజాలు గుర్తొచ్చి పెదవులపై చిరునవ్వు కదలాడని పాఠకులు ఉండరనేది నిర్వివాదాంశం. సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పు గోదావరి) : ముళ్లపూడి వెంకటరమణ 1931లో ధవళేశ్వరంలో జన్మించారు. ఊహ తెలిసీ తెలియని వయసులోనే తండ్రిని కోల్పోయారాయన. ధవళేశ్వరం ఆనకట్టలో తండ్రి క్యాష్ కీపర్. తండ్రి గతించాక, ఉదరపోషణార్థం తల్లి ధవళేశ్వరం నుంచి మద్రాసు మహానగరానికి మకాం మార్చారు. అక్కడ ఒక ఇంటిలో మెట్ల కింద చిన్న గదిలో అద్దెకు నివాసం ఏర్పాటుచేసుకున్నారు. తల్లి విస్తరాకులు (అడ్డాకులు) కుట్టి కిరాణా దుకాణానికి అమ్మిన రోజులు, ప్రింటింగ్ ప్రెస్‌లో కంపోజింగ్ చేసిన రోజులు ఉన్నాయి. ‘మా అమ్మ నాకు జన్మరీత్యా అమ్మ. జీవితం రీత్యా ఫ్రెండు, గురువు, భయం లేకుండా బతకడం నేర్పిన గురువు, తెచ్చుటలో కన్నా, ఇచ్చుటలో ఉన్నహాయిని చూపిన దైవం’ అని తన స్వీయచరిత్ర కోతికొమ్మచ్చిలో రాసుకున్నారు రమణ. మద్రాసు వెళ్లాక, మధ్యలో రెండేళ్లు రాజమహేంద్రవరం, ఇన్నీసుపేటలోని వీరేశలింగం ఆస్తిక పాఠశాలలో సెకెండ్ ఫారం, థర్డు ఫారం (ఆధునిక పరిభాషలో 7, 8 తరగతులు) చదివినా, తుది శ్వాస వదిలేవరకు ముళ్లపూడి కావేరి నీళ్లనే సేవించారు. అయితే, ఆయన ధ్యాస, శ్వాస, యాస గోదావరి మాండలికమే. ఆయన రచనల్లో కనిపించే బుడుగు, సీగాన పెసూనాంబ, రెండు జెళ్లసీత, అప్పారావు, లావుపాటి పక్కింటి పిన్నిగారి మొగుడు (అంటే మొగుడు లావని కాదు, పిన్నగారే లావు).. అందరూ గోదావరి మాండలికమే మాట్లాడారు. సినిమాల్లో ఆమ్యామ్యా రామలింగాలు, ‘తీతా’లు (తీసేసిన తాసిల్దార్లు) అచ్చంగా ఇక్కడి మనుషులే! గోదావరి ‘మా ఫిలిం స్టూడియో’ అని ప్రకటించుకున్న ముళ్లపూడి నేస్తం బాపుతో కలసి తీసిన సినిమాలు అన్నీ ఆ గోదారమ్మ ఒడిలోనే పురుడు పోసుకున్నాయి. సినీ రచన చేయడానికి గోదావరిపై లాంచి మాట్లాడుకుని, భద్రాద్రి రాముడి దర్శనం చేసుకోవడానికి వెడుతూ ఆ రచన పూర్తి చేసేవారు. పాత్రికేయుడిగా ఉద్యోగపర్వం ప్రారంభం ఎస్సెస్సెల్సీ వరకు చదివిన రమణ నాటి అగ్రశ్రేణి పత్రిక ఆంధ్రపత్రికలో సబ్ ఎడిటర్‌గా ఉద్యోగరంగ ప్రవేశం చేశారు. ఆయనలో రచయిత అదే సమయంలో కన్ను తెరిచాడు. వందలాది కథలు, రాజకీయ భేతాళ పంచవింశతి లాంటి రాజకీయ వ్యంగ్యాస్త్రాల రచనలు, విక్రమార్కుడి మార్కు సింహాసనం వంటి సినీరంగ ధోరణులపై విసుర్లు, ఋణానందలహరితో అప్పారావు పాత్రను పరిచయం చేయడం, చిచ్చరపిడుగులాంటి బుడుగు రచన.. అన్నీ ఈ దశలోనే జరిగాయి. సినీరంగానికి మలుపు.. ఆంధ్రపత్రికలో సినిమా వార్తలు రాస్తున్న సమయంలో రమణ సమీక్షలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. అక్కినేని వంటి అగ్రనటులు, ఆత్రేయ వంటి రచయితలు, నాగిరెడ్డి చక్రపాణి వంటి నిర్మాతలు రమణ సినీ సమీక్షలను ఆసక్తికరంగా చదివేవారు. సినీ నిర్మాత డీబీ నారాయణ తాను తీస్తున్న దాగుడు మూతలు సినిమాకు రచన చేయమని ముళ్లపూడిని కోరారు. చాలాకాలం తప్పించుకు తిరిగిన రమణ ఎట్టకేలకు అంగీకరించారు. అయితే, దాగుడుమూతలు షూటింగ్ కారణాంతరాల వల్ల లేటు కావడంతో, డూండీ ఎన్టీ రామారావుతో నిర్మించిన రక్త సంబంధం ఆయనకు మొదటి సినీ రచన అయింది. రెండో సినిమా కూడా ఎనీఆ్టర్ నటించిన గుడిగంటలు, మూడో సినిమా అక్కినేని నటించిన క్లాసిక్ మూగమనసులు.. మూడూ సూపర్ హిట్ సినిమాలే కావడంతో రమణ సినీ జీవితం ఊపందుకుంది. సొంతంగా సినిమాలు కూడా నిర్మించారు. సాక్షి, బంగారుపిచుక, బుద్ధిమంతుడు, అందాలరాముడు, గోరంతదీపం, ముత్యాలముగ్గు, సీతాకల్యాణం, సంపూర్ణ రామాయణం, పెళ్ళి పుస్తకం.. కొన్ని హిట్లు మరికొన్ని ఫట్లు అయినా, రెంటినీ సమానంగా భావించే స్థితప్రజ్ఞుడు ఆయన.. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కోరికపై విద్యార్థులకు వీడియో పాఠాలు తీశారు. రామాయణాన్ని అమితంగా ప్రేమించే రమణ చివరి రచన కూడా శ్రీరామరాజ్యం కావడం, ఆయన జీవితకాల నేస్తం బాపు తుది క్షణంలో ఆయన పక్కనే ఉండడం చెప్పుకో తగ్గ అంశాలు. 2011 ఫిబ్రవరి 24న చెన్నయ్‌లో రమణ కన్ను మూశారు. పుట్టిన గడ్డతో రమణ చివరివరకు ఎందరో ప్రముఖులతో అనుబంధాలు పంచుకున్నారు. మచ్చుకు కొందరి అంతరంగాలు పరికిద్దామా.. ముళ్లపూడి వెంకట రమణ చదువుకున్న పాఠశాలలో, ఆయన 88వ జయంత్యుత్సవం శుక్రవారం ఉదయం 10 గంటలకు కళాగౌతమి, తెలుగు సారస్వత పరిషత్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈనాటికీ బాపు, రమణల కుటుంబాలతో అనుబంధాలు ‘హాస్యమందు అరుణ– అందె వేసిన కరుణ–బుడుగు వెంకట రమణ–ఓ కూనలమ్మా! అని ఆరుద్ర రమణని గురించి తన కవితలో పేర్కొన్నారు. బాపు, రమణలతో నాకు పరిచయం కలగడం, వారి కుటుంబాలతో నేటికీ సంబంధ బాంధవ్యాలు ఉండడం నా అదృష్టంగా భావిస్తాను. ఓ సారి ఆయన పుట్టినరోజుకు శుభాకాంక్షలు గీసి పంపితే, ఆయన జవాబు రాస్తూ, బాపు సంతకం కూడా ఆయనే చేసి, ఆథరైజ్డు ఫోర్జరీ అని రాశారు! అన్నట్టు ఋణానందలహరిలో ఆయన కథానాయకుడి పేరు (అప్పారావు), నా పేరు ఒక్కటే కావడం ఆదో విచిత్రం! – ఎంవీ అప్పారావు (సురేఖ) కార్టూనిస్టు నన్ను ‘కందుల హాయీ’ అనే వారు. బాపు అనారోగ్యానికి వైద్య నిమిత్తం ముళ్లపూడి రాజమహేంద్రవరం వచ్చారు. ఆయనకు సుమారు రెండు దశాబ్దాలుగా షుగరు వ్యాధి ఉండేది. సహవైద్యులు నా పేరు సూచించారు. మా ఇద్దరి మధ్య కేవలం డాక్టరు, పేషంట్ల సంబంధంగా ఉండేది కాదు. నాకు ఆయన పుస్తకాలు పంపేవారు. ఫోనులో తరచూ మాట్లాడుకునేవాళ్లం. ఓ సారి నా మీద ఇలా కవిత రాసి పంపారు.. ‘మందొద్దంటూ చాల, ప–సందులు మింగించి, నన్ను సరిజేసి, తిరిగీ మందును పసందును చేసిన కందుల ‘శ్రీహాయిగార్కి’ వందన శతముల్’ – రమణ (మే 2006) ఎప్పుడైనా విమానాశ్రయానికి ఆయన్ను తీసుకురావడానికి వెడితే, ఆయన ఓ మూల కుర్చీలో కూర్చుని ఉండేవారు. బాపులాగా నాకు కూడా ‘జనగండం’ ఉందని చమత్కరించేవారు. – డాక్టర్ కందుల సాయి, డయాబెటిక్ కేర్, రాజమహేంద్రవరం -
కరుణ ఇంట పండగ కళ
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి ఇంటికి పండగ కళ వచ్చింది. శుక్రవారం కరుణానిధి పుట్టినరోజు కావడమే దీనికి కారణం. ఆయన ఈ రోజు 94వ ఏట అడుగుపెట్టారు. కరుణానిధి కుటుంబ సభ్యులతో పాటు డీఎంకే నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కరుణకు శుభాకాంక్షలు చెప్పేందుకు డీఎంకే సీనియర్ నేతలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయన ఇంటికి క్యూ కట్టారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి కరుణ నివాసం సందడిగా మారింది. కరుణానిధి పార్టీ సీనియర్ నేతలు, కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేశారు. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే ఓటమి చవిచూడగా, అన్నాడీఎంకే విజయం సాధించిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే చీఫ్ జయలలిత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి రికార్డు సృష్టించగా, అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన డీఎంకే ప్రతిపక్షానికి పరిమితమైంది. కాగా ఈ ఎన్నికల్లో డీఎంకే గట్టి పోటీనివ్వడంతో పాటు బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. కరుణానిధి కుటుంబం, డీఎంకే శ్రేణులు ఈ ఓటమి తాలుకూ ప్రభావాన్ని మరిచి సంతోషంగా పెద్దాయన జన్మదిన వేడుకలు చేసుకున్నారు.