Biological activity
-
ప్రమాదం బారిన జీవవైవిధ్యం
సృష్టిలోని అన్ని జీవరాశులలో ఏ ఒక్కటీ అధికం కాదు, ఏదీ అల్పం కాదు. అన్నీ సమానమే. అవన్నీ ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. మనిషి తన అవసరాలకు ప్రకృతిపై ఆధారపడతాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం ముందుకు సాగదు. దీనిని గమనించిన నిపుణులు, శాస్త్రవేత్తలు జీవవైవిధ్య చక్రం సక్రమంగా సాగేలా చూడాలని ఎన్నోఏళ్లుగా మొరపెట్టుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఐక్యరాజ్యసమితి ప్రతీఏటా మే 22న అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవాన్ని(International Day for Biological Diversity) నిర్వహిస్తూ వస్తోంది.దెబ్బతీస్తున్న జీవనశైలిప్రస్తుతం భూమిపై ఉన్న కోట్లాది జాతుల వైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామంగా చెబుతారు. మనిషి జీవనశైలి కారణంగా పర్యావరణంలో కాలుష్యం(Pollution) వ్యాపించి, భూగోళం వేడెక్కిపోతున్నది. ఫలితంగా జీవవైవిధ్యం దెబ్బతింటోంది. పర్యవసానంగా పలు జీవజాతులు అంతరించిపోతున్నాయి. ప్రపంచంలో గల 12 మహా జీవవైవిధ్య ప్రాంతాలలో భారతదేశం ఒకటి. ఇక్కడ ఒకనాడు సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతుజాతులు ఉండేవి. వివిధ కారణాలతో అనేక జీవాలు కనుమరుగవుతున్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50 శాతానికి పైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటివనరులు అంతరించిపోయాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్లను స్వార్థ ప్రయోజనాల కోసం ఎండగట్టారు. అరణ్యాలలోని వన్యప్రాణుల్ని వేటాడి అంతమొందిస్తున్నారు.అక్కడ జీవవైవిధ్యం పదిలంవ్యవసాయంలో రసాయనిక ఎరువులు, కీటకనాశనుల వినియోగానికి ప్రాధాన్యత పెరిగింది. దీంతో నేలను, దానిపై నివసించే విలువైన జీవసంపదను కోల్పోవాల్సి పరిస్థితి ఏర్పడింది. అత్యధిక కీటక నాశనులను ఉత్పత్తి చేసే దేశంగా భారత్ గుర్తింపు పొందింది. అయితే దేశంలో ఆదివాసులు అధికంగా ఉన్నచోట జీవవైవిధ్యం పదిలంగా ఉందని చెప్పుకోవచ్చు. మన దేశంలో 53 మిలియన్లకు మించిన ఆదివాసులు నివసిస్తున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్‌లో 80 శాతానికి మించిన రీతిలో గిరిజనులున్నారు. దీంతో అక్కడ జన్యువైవిధ్యం ఎక్కువగా ఉంది. మరోవైపు ఇటీవలి కాలంలో అనుసరిస్తున్న జన్యుమార్పిడి విధానం జీవవైవిధ్యాన్ని దెబ్బ తీస్తోంది. వీటిని రూపొందించి, ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.మానవ మనుగడ ప్రశ్నార్థకంవైవిధ్యమే సృష్టి లక్షణం అంటారు స్వామి వివేకానంద. చెరువులో ఉండే కీటకాలను తిని కప్ప, కప్పను తిని పాము, పామును తిని గద్ద జీవిస్తుంది. గద్ద మరణించాక దానిని వివిధ క్రిములు తిని భూమిలో కలిపేస్తాయి. అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టులా సాగుతుంది. వీటిలో ఏ ఒక్క ప్రాణి అంతరించినా, మిగతా అన్నిటి మీదా ప్రభావం పడుతుంది. దీనికి మనిషి అడ్డుపడితే అది వినాశనానికి దారి తీస్తుంది. భూమిపై ఏ ఒక్క జీవి అంతరించినా, మానవ మనుగడ(Human survival) ప్రశ్నార్థకమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా వేలాది జీవరాశులు అంతరించిపోతున్నాయి. అయితే వాతావరణ సమతుల్యానికి, పర్యావరణ పరిరక్షణకు జీవరాశులను కాపాడుకోవడం అత్యవసరం. అందుకే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇది కూడా చదవండి: నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్న రైల్వే స్టేషన్లు ఇవే.. -
కన్నతల్లి ఆచూకీకై పరితపిస్తున్న స్వీడిష్ యువతి!
కొందరూ తల్లులు పేదరికం, దారుణమైన కుటుంబ పరిస్థితులు వంటి కారణాల రీత్యా చారిటీ సంస్థల వద్ద లేదా దత్తత కింద తమ పిల్లలను ఇచ్చేయడం జరుగుతుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్లై.. తమను పెంచిన వాళ్లు అసలైన తల్లిదండ్రులు కాదని తెలిస్తే.. ఆ బాధ మాములుగా ఉండదు. అక్కడ నుంచి మొదలవుతాయి తమ తల్లిదండ్రులు ఎవరూ, ఎక్కడ ఉంటారనే ఆలోచనలు. వాళ్లు అసలు బతికే ఉన్నారా? ఒకవేళ బతికే ఉంటే ఒక్కసారి వాళ్లను తమ కళ్లతో చూసుకోవాలనే ఆరాటం, ఆత్రం మాటలకందని విధంగా ఉంటాయి. అలాంటి భావోద్వేగపు కథ ఈ స్విడిష్ యువతి గాథ! అసలేం జరిగిందంటే..స్వీడన్‌కి చెందిన 41 ఏళ్ల ప్యాట్రిసియా ఎరిక్సన్ ఫిబ్రవరి 1983లో నాగాపూర్‌లోని డాగా హాస్పిటల్లో జన్మించింది. ఒక ఏడాది తర్వాత స్వీడిష్ దంపతులు ఆమెను దత్తత తీసుకున్నారు. తనన పెంచి పెద్ద చేసిన తల్లి తన కన్నతల్లి కాదని తెలుసుకుని భావోద్వేగానికి గురవ్వుతుంది. అయినప్పటికీ ఇన్నేళ్లు తనను ఎంతో ప్రేమగా పెంచిన పెంపుడు తల్లి పట్ల అపారమైన కృజ్ఞత ఉన్నప్పటికీ ఒక్కసారి తన తల్లిని తనవితీరా చూడాలని కోరుకుంటుంది. అందుకోసం ఆమె తన తల్లి ఎక్కడ ఉండేది అనే దిశగా ఆమె ఆచూకీకై వెతకడం ప్రారంభించింది. అలా ఆమె తన తల్లిని వెతుక్కుంటూ నాగ్‌పూర్‌కి చేరుకుంది. అక్కడ తన తల్లి ఆచూకీకి సంబంధించిన వివరాలు, ఆధారాలు సేకరించడం మొదలు పెట్టింది. ఆ భావోద్వేగపూరిత అన్వేషణలో ఎరిక్సన్కి అంజలా పవార్ అనే న్యాయవాది సాయం అందిస్తున్నారు. ఇలా జీవ సంబంధమైన తల్లుల కోసం వేరే దేశ యువతలు భారతదేశానికి వచ్చి కోరడం అనేది తొలిసారి కాదు. ఇంతకుమునుపు స్విస్ మహిళ విద్యా ఫిలిప్పన్ కూడా ముంబైలో తన జీవసంబంధమైన తల్లి కోసం ఒక దశాబ్దంగా వెతుకుతూ ఉంది. అయితే ఆ కేసులో ఆమె తల్లి చిరునామా, ప్రస్తుతం ఉనికిలో లేకపోవడమే ఆ యువతి ప్రధాన సవాలుగా మారింది. దీంతో ఆమె తల్లి ఎక్కడకు వెళ్లి ఉంటుందనేది చిక్కముడి వీడని మిస్టరీలా మారిపోయింది. #WATCH | Nagpur, Maharashtra: Swedish National Patricia Eriksson comes to Nagpur to search for her biological mother. She says, "The kids in school started to explain that they have their mother's hair and father's nose. Then I realised I couldn't do the same... From a child's… pic.twitter.com/bcyXL4se6o — ANI (@ANI) April 3, 2024 (చదవండి: హెయిర్ స్ట్రైయిట్‌నింగ్ చేయించుకుంటున్నారా? వైద్యులు వార్నింగ్) -
మొగసాల
టూకీగా ప్రపంచ చరిత్ర మొత్తంగా చూస్తే అప్పటి ప్రపంచం - పువ్వులు లేని చెట్లూ, పక్షులు లేని అడవులూ, గొంతులు లేని కీటకాలతో అతి నిశ్శబ్దమైన తరగతి గది వంటిది. అత్యంత పురాతనమైన శిలల్లో జీవపదార్థం గోచరించకపోవడానికి కారణం ఆ కాలానికి జీవపదార్థం ఏర్పడకపోవడమైనా కావచ్చు, లేదా అప్పటి జీవపదార్థం అతి సూక్ష్మమైందీ, అవశేషాలు మిగల్చలేనంత సున్నితమైనదీ అయ్యుండొచ్చు. ఈ పొర వయస్సు దాదాపు 500 కోట్ల సంవత్సరాలు. జీవపదార్థం దొరకని కారణంగా వీటిని ‘ఎజోయిక్’ శిలలు అన్నారు. జీవచర్య వల్ల ఏర్పడే గ్రాఫైటు, ఐరన్ ఆక్సైడు వంటి పదార్థాలు వాటిల్లో ఉన్న కారణంగా ఆ పేరును కొందరు శాస్త్రజ్ఞులు ఆమోదించలేదు. వాళ్ళు దాన్ని ‘ఆర్కిజోయిక్’ శిలలు - అంటే, అత్యంత ప్రాథమిక జీవశిలలు- అన్నారు. జీవుల ఉనికికి తిరుగులేని ఆనవాళ్ళు దొరికిన రెండవ పొరను ‘ప్రొటోజోయిక్’ శిలలు అన్నారు. ఈ యుగం సుమారు 200 కోట్ల సంవత్సరాలకు ముందు మొదలై 150 కోట్ల సంవత్సరాలదాకా కొనసాగింది. జంతుజాతికి సంబంధించిన ‘రేడియోలేరియా’, వృక్షజాతికి మూలమైన ‘ఆల్గే’ వంటి ఏకకణజీవుల ఆనవాళ్ళు ఈ శిలల్లో దొరకడమేగాక, పూడు మీద ప్రాకే సూక్ష్మజంతువుల జాడలు కూడా కనిపించాయి. తరువాతి కాలంలోని జీవులతో పోలిస్తే, ఈ దశలో జీవుల విస్తృతిగానీ, వైవిధ్యం (వెరైటీ)గానీ మందకొడిగా కనిపిస్తుంది. బహుశా, భూగోళం మీద నిలదొక్కుకునేందుకు జీవపదార్థం చేసిన 150 కోట్ల సంవత్సరాల సుదీర్ఘ సంఘర్షణ చరిత్ర అందులో దాగుందోయేమో! 50 కోట్ల సంవత్సరాల నాడు మొదలై సుమారు 28 కోట్ల సంవత్సరాలు కొనసాగిన మూడవయుగం పొరలను ‘ప్యాలియోజోయిక్’ పొర- అంటే, ‘పురాతన జీవం’ పొర- అంటారు. భూమి వాతావరణం జీవరాశుల మనుగడకు మరింత అనుకూలంగా మారడం మూలంగానో ఏమో, జీవుల విస్తరణ ఈ యుగంలో ఒకమోస్తరుగా పెరిగింది. వివరణ కోసం ఈ యుగాన్ని ఏడు శకాలుగా విభజించారు కానీ, అంత విస్తారమైన వివరణతో మనకు పనిలేదు గనక, దీన్ని రెండు ఘట్టాలుగా చర్చించుకుందాం. శిలలు అడుగుపొర తొలిఘట్టానిది. ఈ దశలో పూడుమీద పాకే ‘ట్రైలోబేట్’ తదితర రెక్కలు లేని పురుగులూ, గవ్వచేపలూ, పీతలూ పుట్టుకొచ్చాయి. అవయవ నిర్మాణంలో బాగా ముందంజ వేసిన ‘సముద్రపు తేలు’ వాటిల్లో ఉంది. ఆ తేలుజాతిలో కొన్నిరకాలు తొమ్మిది అడుగుల పొడవుదాకా పెరిగాయి. జంతుసామ్రాజ్యం నుండి స్పష్టంగా విడిపోయి, నీటిమీద తేలాడే ‘పాచి’ వంటి వృక్షజాతులు ఆవిర్భవించాయి. పోగుకు పోగు ముడివేసుకుని సముద్రం మీద గడ్డిపోచల్లా తేలే జంతువులు తయారయ్యాయి. అయితే, ఈ జంతువుల్లో ఏవొక్కదానికి వెన్నెముక ఏర్పడలేదు. వృక్షజాతిలో కూడా కాండానికి గట్టిదనం సమకూర్చే ‘నార’ (ఫైబర్) ఏర్పడలేదు. ఆ కాలంలో నివసించిన జంతువులైనా మొక్కలైనా నిరంతరం నీటిని ఎడబాయకుండా బతకవలసిందే తప్ప, ఒడ్డున నిలిచే సామర్థ్యం సంపాదించుకోలేదు. కొత్తరకాలు పుట్టుకురావడం, మయం (సైజు) పెరగడం మినహాయిస్తే, ముందటి యుగంతో పోలిస్తే చురుకుదనంలో చెప్పుకోదగ్గ మార్పు ఈ జీవుల్లో కనిపించదు. వేగంగా పారాడగలిగిన పురుగూ లేదు, చలాకీగా ఈదగలిగిన చేపా లేదు. జీవులన్నీ నీటిని వదలని కారణంగా, ఆనాటి నేల ఒక నిప్పచ్చర ప్రదేశం. అప్పటి సముద్రాల్లో ఉన్నవి ఇప్పటి సముద్రాల్లోలాగా ఉప్పునీళ్ళు కాదనే సంగతి మరికొంతకాలం గడిచేదాకా మనం గుర్తుంచుకోవాలి. రెండవ ఘట్టంలో కొల్లలు కొల్లలుగా వెన్నెముక గల చేపరకాలూ, నీటిలోపలా బయటా మనగలిగే కప్పవంటి ఉభయచరాలూ, తండోప తండాలుగా నేలమీద తిరిగే పలురకాల రెక్కల పురుగులూ రూపం తీసుకున్నాయి. వృక్షజాతులు చిత్తడినేలలకు పాకి అరణ్యాలుగా విస్తరించడం మొదలెట్టాయి. వాటి కాండంలో నారపోగులు ఏర్పడి, అవి నిటారుగా, దృఢంగా నిలబడేందుకు వీలు కలిగించాయి. అయితే, ఆ చెట్లన్నీ ‘ఫెర్న్’ జాతికి చెందిన అధమస్థాయివే తప్ప, ఇప్పటి చెట్లలాగా పువ్వులు పూచేవీ ఆకులు రాల్చేవీగావు. వాటిల్లో కొన్ని రకాల పెరుగుదల ఇప్పటి వృక్షాల పరిమాణానికి ఏమాత్రం తీసిపోదు. ఈనాటి గనుల్లో బొగ్గుగా దొరుకుతున్న సరుకంతా వాటిదేనంటే, ఆ చెట్లు ఎంత పెద్దవిగా ఉండేవో ఊహించుకోవచ్చు. ఈ యుగం ముగిసేముందు రెప్టైల్స్ (సరీసృపాలు) ఉనికిలోకి వచ్చాయి. శ్వాస ద్వారా ప్రాణవాయువును గ్రహించే ఊపిరితిత్తులను సంతరించుకుని, ఇవి నేలను ఆశ్రయించిన జంతువులు. పొట్టమీద ప్రాకేవే కాకుండా నాలుగు కాళ్ళమీద నడిచే ‘తొండ’ వంటి రెప్టైల్స్ కూడా అదే సమయంలో కనిపిస్తాయి. మొత్తంగా చూస్తే అప్పటి ప్రపంచం - పువ్వులు లేని చెట్లూ, పక్షులు లేని అడవులూ, గొంతులు లేని కీటకాలతో అతి నిశ్శబ్దమైన తరగతి గది వంటిది. కనీసం కుందేలు పరిమాణంలోవుండే జంతువైనా నేలమీద కనిపించదు. సముద్రతీరాలవెంట, పరిమితంగా విస్తరించిన ప్రాణం మినహాయిస్తే, మిగతా నేలంతా అప్పటికీ నిప్పచ్చరమే. ప్రాణుల ప్రాపకంలో నిమగ్నమై, భూగోళం స్థితిగతుల గురించిన చర్చ మధ్యలో వదిలేశాం. ప్యాలియోజోయిక్ యుగం ముగిసేదాకా కూడా భూగోళం సంసారం ఒరగడ్డంగానే సాగింది. ఎక్కడో పేలిపోయిన నక్షత్రాల ముక్కలు వందలమైళ్ళ విస్తీర్ణం కలిగిన నిప్పుకణాలుగా భూమిని ఢీకొని, ప్రళయ భయంకరమైన ఉపద్రవాలు కలిగించేవి. వాటి ఆగడానికి జీవరాసిలో తొంభైశాతానికి పైగా నశించేది. ఎక్కడబడితే అక్కడ లావా ఉప్పొంగి, కొత్త నేలలకు మాతృత్వం నెరిపే ప్రక్రియలోకూడా జీవులకు ప్రమాదం ఎదురయ్యేది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న బొగ్గుగనుల నిక్షేపాలు ఆనాడు భూగోళాన్ని అతలాకుతలం చేసిన భూకంపాల ప్రసాదమే. ఇలాంటి అవాంతరాలన్నిటినీ ఎదిగొచ్చింది. ఆ ఎదుగుదల ప్రస్థానంలో నాలుగవ అంచెను సూచించేవి ‘మీసోజోయిక్’ శిలలు, ఐదవ అంచెకు ప్రాతినిధ్యం వహించేవి ‘సీనోజోయిక్’ శిలలు. వాటిని గురించి ముందు ముందు తెలుసుకుందాం. రచన: ఎం.వి.రమణారెడ్డి