breaking news
bilingual
-
ఆచార్యులలో మేటి!
తెలుగు భాషా సాహిత్యాలతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు ఆచార్య జి.ఎన్. రెడ్డి. ఆయన చిత్తూరు జిల్లాలోని ‘మహా సముద్రం’లో పుట్టారు. తెలుగు ఆచార్యులకు ఏనాడూ రాని వైస్– ఛాన్స్లర్ పదవి ఆయనతో 1984లో మొదలయ్యింది. శ్రీ వేంకటే శ్వర విశ్వ విద్యాలయానికి వైస్–ఛాన్స్‌లర్‌గా బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించి అందరి మన్ననలను అందుకొన్నారు.ఆయన గొప్ప నిఘంటుకారుడు. నిఘంటు నిర్మాణంతో పాటు నామ విజ్ఞానం, భాషా సాహి త్యాలలో అందెవేసిన చేయి. తెలుగు–తెలుగు నిఘంటువులు, ఇంగ్లీష్–తెలుగు ద్విభాషా నిఘంటువు, కుమ్మరం, వడ్రంగం మాండలిక వృత్తి పద కోశాలు, తెలుగు పర్యాయ పద నిఘంటువులు ఆయనకు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. మహాభారతం శల్య సౌప్తిక స్త్రీ పర్వాలకు రచించిన పీఠిక, భగవద్గీతకు రాసిన పీఠిక, బ్రౌన్ గ్రంథాలకు రచించిన పీఠికలు ఎంతో విశ్లేషణాత్మకమైనవి.వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బంగోరె సహకారంతో సి.పి.బ్రౌన్ ప్రాజెక్టును చేపట్టారు. తద్వారా బ్రౌనుకు సంబంధించిన స్వీయ సాహితీ జీవిత చరిత్రల మీద అనేక పుస్తకాలను వెలుగులోకి తెచ్చారు. వాటిలో బ్రౌన్ లేఖలు, బ్రౌన్ కడప జాబులు, ఆంధ్ర గీర్వాణ ఛందము వంటి అమూల్యమైన గ్రంథాలు ఉన్నాయి. అలాగే జి.ఎన్. రెడ్డి భాషా విజ్ఞాన పరిచయం, ద్రావిడ భాషా విజ్ఞా్ఞనం, తన జీవిత చరిత్ర అయిన ‘జి.ఎన్. రెడ్డి జీవితరేఖలు’ కూడా రాశారు. జానపదులు చెప్పుకొనే పొడుపు కథలను సేకరించి ‘పొదుపు కథలు’ అనే గ్రంథాన్ని కూడా ప్రచురించారు.1962–64 మధ్య అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో లెక్చ రర్‌గా పని చేసి అక్కడి విద్యార్థుల కోసం కూడా వాచకాలను రాశారు. చికాగో యూనివర్సిటీలో కూడా లింగ్విస్టిక్స్ పాఠాలు బోధించారు. కల్చరల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రావ్‌ు కింద 1974లో బల్గేరియా, 1981లో మలేషియా, 1983లో బ్రిటన్ వంటి ఎన్నో దేశాల్లో పర్యటించారు. బ్రిటన్ గ్రంథాలయంలోని అరుదైన పుస్త కాలను మెక్రో ఫిల్మ్‌ల ద్వారా ఎస్వీయూ తెలుగు అధ్యయన శాఖకు అందించారు. ఆయన విస్కాన్సిన్ యూనివర్సిటీలో పని చేసేటప్పుడు చేకూరి రామా రావు, భద్రిరాజు కృష్ణమూర్తి లాంటి ఉద్దండ భాషావేత్తలతో కలిసి ఒకే ఇంటిలో ఉండేవారు. ప్రసిద్ధ భాషావేత్త గెరాల్డ్ కెల్లీతో కూడా స్నేహం చేశారు. తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన ఆయన సాహితీ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారు.– ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి, ఫౌండర్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ (నేడు ఆచార్య జి.ఎన్. రెడ్డి వర్ధంతి) -
ప్రభుదేవాతో పోటీపడి మరీ డ్యాన్సులు
-
రెండు భాషలు మాట్లాడే పిల్లలు చురుగ్గా ఉంటారట!
న్యూయార్క్ రెండు భాషలు మాట్లాడే పిల్లలు సమస్యలను పరిష్కరించడంలో మంచి నేర్పును కలిగి ఉంటారని ఓ అధ్యయనంలో తేలింది. కుంటుంబంలో అనేక భాషలు మాట్లాటడం వల్ల పిల్లల మెదడు చురుకుగా పనిచేస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది ఒకటి కంటేఎక్కువ భావలు మాట్లాడే పిల్లలు బలమైన మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారని, వేగంగా స్పందిస్తారని వాషింగ్టన్ యూనివర్శిటీకి కి చెందిన పరిశోధకులు తేల్చారు. ఈ క్రమంలో వారి మెదడు చురుకుగా పని చేస్తుందని చెప్పారు. మెదడు పనితీరు పై చేసిన అధ్యయనంలో ఈ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 11 నెలల మాటలు నేర్చే సమయంలోనే వారి మెదడు లో ఈ మార్పులు చో్టుచేసుకుంటాయని యూనివర్సిటీకి చెందిన నాజా ఫర్జాన్ రెమిరెజ్ పేర్కొన్నారు. ఇంగ్లీష్-మాత్రమే పిల్లలు తో పోలిస్తే స్పానిష్-ఆంగ్ల భాష మాట్టాడే పిల్లల్లో బలమైన మెదడు స్పందనలు ధ్వనులను తాము గుర్తించామన్నారు ఒకే భాష మాట్లాడే కుంటుంబంలో కంటే ఎక్కువ భాషలు మాట్లాడే పిల్లలు ఇతర విషయాలను తొందరగా నేర్చుకుంటారన్నారు. కొత్త విషయాలను వీరు వేగంగా గ్రహించ గల్గుతారని మరో శాస్త్రవేత్త కౌల్ చెప్పారు. అదే ఒక భాష మాట్లాడే కుంటుంబంలోని పిల్లలు భావాలు 6 నెలల వయస్సులోనే కుంచించుకు పోతాయన్నారు. 11 నెలల వయసు పసి ప్రాయంలో శిశువు మెదడు చుట్టుపక్కల వాతావరణంలో మాట్లాడే ఒకటి రెండు భాషలను నేర్చకునే సామర్థ్యం సమానంగా ఉంటుందని ఫెర్జాన్ రమేజ్ తెలిపారు. చిన్న పిల్లల్లో బహుళ భాషలు నేర్చుకునే సామర్ధ్యం మాత్రమే కాకుండా, అతి చిన్న వయసులోనే ఈ ప్రక్రియ ప్రారంభించడానికి సరైన సమయమని తమ పరిశోధనలో తేలిందని ఆమె చెప్పారు. ఈ పరిశోధనలో మాగ్నెట్ ఎన్సెఫలోగ్రఫీ(ఎమ్ఈజీ) సాయంతో మెదడు స్పందనలు, నరాల పనితీరును తాము పరిశీలించామన్నారు. ఇంగ్లీష్, ఇంగ్లీష్, స్పానిష్ మాట్లడే వివిధ కుంటుంబాల్లోని 11నెలలు వయస్సుగల పిల్లలపై ఈ పరిశోధనను నిర్వహించామని తెలిపారు. డెవలప్ మెంటల్ సైన్సెస్ అనే జర్నల్ లో పరిశోధనా పత్రం పబ్లిష్ అయింది. -
మెదడు బాగా పనిచేయాలంటే..
న్యూ ఢిల్లీ: మెదడు క్రియాశీలకంగా పనిచేయాలంటే ఒకటి కంటే ఎక్కువ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాలని చెబుతున్నారు పరిశోధకులు. ఇలా ఎక్కువ భాషలను నేర్చుకోవడం, ఉపయోగించడం వలన వృత్తి పరంగానే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతోందని జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్.. భారతీయులపై జరిపిన పరిశోధనలో నిర్థారించింది. ఎక్కువ భాషల్లో ప్రావీణ్యం ఉన్నవారు ఒక భాష నుండి ఇంకో భాషలోకి తమ మెదళ్లను సందర్భానుసారం ట్యూన్ చేసుకొని ఉపయోగించడం మూలంగా మెదడు నిర్మాణాత్మకంగా బాగా అభివృద్ధి చెందుతోందని పరిశోధకులు పేర్కొన్నారు. ఒకే భాషలో ప్రావీణ్యం ఉన్నవారితో పోల్చితే.. ఒకటి కంటే ఎక్కువ భాషలు ఉపయోగించేవారు మానసిక సంబంధమైన వ్యాధులకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నయని పరిశీలనలో తేలింది. దేశంలో మెదడు సంబంధిత రుగ్మతలతో బాధ పడేవారి సంఖ్య 40 లక్షలకు పైగా ఉందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 2030 నాటికి రెట్టింపయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


