breaking news
bike roll
-
బైక్ బోల్తా.. యువకుడి మృతి
కొడంగల్: బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వకారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఇందనూర్ గేట్ వద్ద సోమవారం వెలుగుచూసింది. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనం పై వెళ్తుండగా.. ఒక్కసారిగా అదుపుతప్పి బైక్ బోల్తా కొట్టంది. ఈప్రమాదంలో శివనాయక్(21) మృతిచెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్తానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
బైక్ బోల్తా: ఇద్దరి మృతి
నందిగామ: కృష్ణా జిలా చందర్లపాడు సమీపంలో ఓ బైక్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మేడి యోహాను, మేడి బాబు నందిగామలో పచారీ సరుకులు కొనుగోలు చేసి ద్విచక్ర వాహనంపై చందర్లపాడుకు వెళుతున్నారు. ఈ క్రమంలో అధిక వేగంతో వెళుతూ కిలోమీటర్ రాయిని ఢీకొన్నారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా యోహాను సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన బాబును నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు.