బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
బైక్ బోల్తా.. యువకుడి మృతి
Jan 2 2017 12:33 PM | Updated on Aug 1 2018 2:31 PM
కొడంగల్: బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వకారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఇందనూర్ గేట్ వద్ద సోమవారం వెలుగుచూసింది. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనం పై వెళ్తుండగా.. ఒక్కసారిగా అదుపుతప్పి బైక్ బోల్తా కొట్టంది. ఈప్రమాదంలో శివనాయక్(21) మృతిచెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్తానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
Advertisement


