breaking news
Bijuminan
-
ఓటీటీలోకి వచ్చేసిన 'పోలీస్ డ్రామా' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
రణం, ఖతర్నాక్ వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు బిజుమీనన్ హీరోగా నటించిన 'తుండు' చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రంలో అయ్యప్పన్ నాయర్ పాత్రలో కనిపించిన ఆయన టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ చిత్రం తెలుగులో కూడా భీమ్లా నాయక్‌గా రీమేక్ అయిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో భారీ అంచనాలతో విడుదలైన 'తుండు' సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. రియాస్ షెరీఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి కామెడీతో పాటు ప్రేక్షకులను కట్టిపడేసే పోలీస్ డ్రామా ఉంటుంది. కొన్నిసార్లు గుండె బరువెక్కిన సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో ఉన్నాయి. ఉన్నియ ప్రసాద్, షైన్ టామ్ చాకో, బిజు మీనన్‌లతో సహా పలువురు ప్రతిభావంతులైన తారాగణం ఇందులో ఉంది. ఫిబ్రవరి 16, 2024న థియేటర్లలో విడుదలైన 'తుండు' మలయాళంలో మాత్రమే రిలీజ్ అయింది. తాజాగా మార్చి 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం, తెలుగు కన్నడతో సహా పలు భాషల్లో అందుబాటులో ఉంది. సినిమా మొత్తం ఒక కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందాలనే కాంక్షతో ఉన్న కానిస్టేబుల్ చాలా నిజాయితీగా పనిచేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆయనకు ఊహించని సవాళ్లు ఎదరవుతాయి. దీంతో పలు సమస్యలలో చిక్కుకుంటాడు. దీంతో ఆయన జీవితంలో ఊహించని మలుపులు తిరుగుతాయి. కథలో మంచి గ్రిప్పింగ్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. కానీ పోలీసు డ్రామా చిత్రాలను ఇష్టపడే వారికి మాత్రం ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. ఈ వీకెండ్లో తుండు సినిమా ఖచ్చితంగా కాలక్షేపం ఇస్తుందని చెప్పవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో అన్ని భాషలలో తుండు చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. -
విభిన్న నేపథ్యంతో...
‘‘ఇప్పటివరకూ రక రకాల నేపథ్యాలతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో ఎవరూ ఊహించని నేపథ్యం కనిపించి, ఆశ్చర్యానికి గురి చేస్తుంది’’ అని నిర్మాత బొడ్డు దేవికిరణ్ చెప్పారు. శ్వేతామీనన్, బిజుమీనన్, సునీల్‌శెట్టి ముఖ్యతారలుగా జాతీయ ఉత్తమ దర్శకుడు బ్లెస్సీ దర్శకత్వంలో తమిళం, మలయాళంలో రూపొందిన చిత్రం తెలుగులో ‘మల్లెతీగ’గా అనువాదమైంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని సమర్పకులు బొడ్డు చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఈ చిత్రానికి పాటలు: ఛత్రపతి శ్రీనివాస్, మాటలు: నౌండ్ల శ్రీనివాస్.