breaking news
bhimarao
-
కలెక్టర్ వీపు బద్దలు కొడతాం!
సంతబొమ్మాళి : రాష్ట్రంలో టీడీపీ నేతల ఆగడాలు అంతులేకుండాపోతోంది. అధికారం ఉండగానే వీలైనంత మేర దండుకునేందుకు చెలరేగిపోతున్నారు. ఇందుకోసం ఉన్నతాధికారులను సైతం ఖాతరు చేయడంలేదు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ వారిని బెంబేలెత్తిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో చేపల కట్టు వేలంపాట విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు జీరు బీమారావు అధికారం అండతో పేట్రేగిపోయారు. కలెక్టర్, ఆర్డీఓపై పరుష వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ వీపులు బద్దలు కొడతామంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు.సాక్షాత్తు పోలీసుస్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకోవడం టీడీపీ బరితెగింపునకు నిదర్శనం. వివరాలివీ.. మండలంలోని మూలపేట గ్రామంలో చేపల కట్టు వేలం పాట, ఇతర విషయాల్లో రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో వారు నౌపడ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. అక్కడ టెక్కలి రూరల్ సీఐ శ్రీనివాసరావు, నౌపడ ఎస్ఐ నారాయణస్వామి సమక్షంలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. ఊరికి, తమకు సంబంధంలేదని వైఎస్సార్సీపీ సర్పంచ్ జీరు బాబూరావు అంటున్నారని రేపు ఏం జరిగినా మీరు జోక్యం చేసుకోవద్దని భీమారావు పోలీసులను హెచ్చరించారు. సర్పంచ్ బాబూరావు లెక్కలు చెప్పాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో.. మూలపేట పోర్టు నిర్మాణం నిమిత్తం గ్రామాన్ని ఖాళీ చేయించే ప్రస్తావన వచ్చింది. దీంతో.. సర్పంచ్ ప్రతి విషయంలో కలగజేసుకుంటున్నాడని, పోర్టు నిర్మాణ నిమిత్తం మూలపేట గ్రామాన్ని ఖాళీ చేయించడానికి కలెక్టర్ వస్తే ఆయన వీపు బద్దలుకొడతామని పోలీసుల సమక్షంలో భీమారావు పరుషంగా మాట్లాడారు. ‘మేం మారం.. మా ఊరు వదలం.. పరిహారం డబ్బులు ఎవరికి ఇచ్చారని ఇళ్లు ఖాళీ చేయమంటున్నారు’ అంటూ రెచ్చిపోయారు.పోర్టు ఆర్ అండ్ ఆర్ కాలనీలో 580 కుటుంబాలకు లాటరీ తీయకుండా.. ‘వాడెవడు 80 మందికి లాటరీ తీశాడం’టూ ఆర్డీఓపై విరుచుకుపడ్డారు. ‘గ్రామాన్ని ఖాళీ చేయడమేమిటి? అంతా మీ ఇష్టమా? ఇళ్లు, డబ్బులు ఎవరికిచ్చారం’టూ ప్రశ్నించారు. ‘పోలీస్‌స్టేషన్‌కు ఈరోజు 200 మంది వచ్చాం.. రేపు రెండువేల మందితో వస్తాం.. లెక్కలు చెప్పకపోతే చంపేస్తాం.. మీరు మాత్రం కేసు కట్టకండి’ అని పోలీసులను భీమారావు హెచ్చరించారు. ఇలా టీడీపీ నేతల తీరుతో మధ్యాహ్నం వరకు పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు.. సర్పంచ్ బాబూరావు శనివారం లెక్కలు చెప్తారని పోలీసులు నచ్చజెప్పడంతో అంతా అక్కడి నుంచి నిష్క్రమించారు. -
వర్గీకరణ కాదు.. రిజర్వేషన్ శాతాన్ని పెంచండి
మాలమహానాడు రాష్ట్ర పొలిట్ బ్యూరో కన్వీనర్ భీమారావు అమలాపురం టౌన్ : వర్గీకరణతో దళితుల మధ్య విభజన కాదు.. రిజర్వేషన్ల శాతాన్ని 15 నుంచి 23 శాతానికి పెంచాలని మాల మహానాడు రాష్ట్ర పొలిట్ బ్యూరో కన్వీనర్ ఎంఏకే భీమారావు అన్నారు. స్థానిక ఎన్టీఆర్ మార్‌్గలో ఆదివారం జరిగిన కోనసీమ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశానికి భీమారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర కార్యదర్శి పినిపే రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ఇటీవల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడి మాలమాదిగల మధ్య మరోసారి చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించిన తీరుపై చర్చించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎస్సీల జనాభా 23 శాతం ఉన్నందున రిజర్వేష¯ŒS శాతాన్ని విధిగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని భీమారావు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగం కనుమరుగవుతున్న క్రమంలో ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని... ఆ దిశగా ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ ఆలోచించాలని సూచించారు. వర్గీకరణను అడ్డుకునేందుకు మాల మహానాడు ఉద్యమాన్ని మరోసారి ఉధృతం చేయనుందని, త్వరలోనే కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ ఇళ్లను ముట్టడిస్తామని భీమారావు స్పష్టం చేశారు. దళిత నాయకులు దేవరపల్లి శాంతికుమార్, అయితాబత్తుల సుభాషిణి, పులపకూర ఏడుకొండలు, జగడం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.