ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
వడోదర వేదికగా నవంబర్ 26 నుంచి ఇంగ్లండ్‌తో మొదలుకానున్న ఐదు మ్యాచ్‌ల టీ20I సిరీస్ కోసం బీసీసీఐ శుక్రవారం భారత మహిళల అండర్-19 జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు వికెట్ కీపర్ భవికా అహిరే సారథ్యం వహించనుంది. బౌలింగ్ ఆల్‌రౌండర్ అనాది తగ్దే వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యింది. 2027 ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా మన అమ్మాయిలకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లకు వడోదర వేదిక కానుండగా, మిగిలిన మూడు మ్యాచ్‌లకు సూరత్ ఆతిథ్యమివ్వనుంది. నవంబర్ 26న తొలి టీ20, 28న రెండో టీ20, డిసెంబర్ 1న మూడో టీ20,3న నాలుగో టీ20, 6న చివరి టీ20 జరగనుంది.మ్యాచ్‌ల షెడ్యూల్ వివరాలు..👉తొలి టీ20- నవంబర్ 26, వడోదర👉రెండో టీ20- నవంబర్ 28, వడోదర👉మూడో టీ20- డిసెంబర్ 1న, సూరత్👉నాలుగో టీ20- డిసెంబర్ 3న, సూరత్👉ఐదో టీ20- డిసెంబర్ 6న, సూరత్భారత అండర్-19 మహిళల జట్టు:భవికా అహిరే (కెప్టెన్, వికెట్ కీపర్), ఇరా జాదవ్, నిధి మహ్తో, పూర్వా సివాచ్, మెహెక్ నర్వాసే, మైత్రి మనియార్, ఈశ్వరి అవ్సరే, దీయా యాదవ్, శ్రేయ ఎస్. చవాన్ (వికెట్ కీపర్), సమైరా రావ్ఘవ్, కుమారి పాలక్, ఉమా కాష్వీ, అచ్సా పర్మార్, అనాది తగ్డే (వైస్ కెప్టెన్), పాలక్ సింగ్.ఇదీ చదవండి: ఇంగ్లండ్‌పై ఆల్‌రౌండ్ షో.. చరిత్ర సృష్టించిన ఆసీస్ ఆల్‌రౌండర్AUS vs ENG: ఇంగ్లండ్ సరికొత్త చరిత్ర.. టీమిండియా రికార్డ్ బ్రేక్