breaking news
bhadrachalam temple EO
-
Bhadrachalam: భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవిపై భూకబ్జా దారుల దాడి
సాక్షి,భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయ ఈవో రమాదేవిపై దాడి జరిగింది. భద్రాచలం రామాలయంకు చెందిన భూములు పురుషోత్తపట్నంలో కబ్జాకి గురవుతున్నాయి.ఈ క్రమంలో స్వామివారి భూముల కబ్జాపై సమాచారం అందుకున్న ఈవో రమాదేవి మంగళవారం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆక్రమణకు గురవుతున్న భూముల్ని భూకబ్జాదారుల నుంచి కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భూకబ్జా దారులు ఈవో రమాదేవిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆలయ ఈవో స్పృహ కోల్పోయారు. అప్రమత్తమైన స్థానికులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కాగా, భద్రాచలం రామాలయంకు చెందిన భూములు కబ్జా వ్యవహారంలో గత కొద్దిరోజులుగా ఆక్రమణదారులకి, దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వివాదం కొనసాగుతోంది. ఆక్రమణ దారులు స్వామి వారి భూముల్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేయగా.. వాటి నిర్మాణాలు జరగకుండా దేవాదాయ శాఖ సిబ్బంది అడ్డుకుంది. -
తిరుపతిలా ఇక్కడ తొక్కిసలాట జరగనివ్వం
-
భద్రాద్రి ఈఓగా కృష్ణవేణి
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిణి(ఈఓ)గా కృష్ణవేణి నియమితులయ్యారు. దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారిణిగా పనిచేస్తున్న కృష్ణవేణికి భద్రాద్రి ఆలయ ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో రీజనల్ జాయింట్ కమిషనర్ హోదాలో విజిలెన్స్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న కృష్ణవేణి.. అడిషనల్ కమిషనర్ ఉద్యోగోన్నతి రేసులో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఈఓగా రెండేళ్ల పాటు పనిచేసిన ఆమె, తన సర్వీసులో ఎక్కువ కాలం దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలోనే పనిచేశారు. మరో రెండు మూడు రోజుల్లో భద్రాద్రి ఆలయ ఈఓగా ఇక్కడ అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఈఓగా పనిచేస్తున్న ప్రభాకర శ్రీనివాస్‌ను తన మాతృశాఖ(రెవెన్యూ)కు పంపిస్తూ ఈనెల 20న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. మరో మూడు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్న ఆయన.. ఇక్కడే పని చేసేందుకు మొగ్గు చూపుతూ, తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. రూ.100 కోట్లతో ఆలయాభివృద్ధి పనులకు తన హయాంలో శిలాఫలకం వేయించాలనే పట్టుదలతో తన సర్వీసును మరికొంతకాలం పొడిగించుకునేందుకు కూడా తన సన్నిహితుల ద్వారా ఒక దశలో ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించినట్లు ప్రచారం జరిగింది. ఈ తరుణంలోనే శ్రీనివాస్‌ను మాతృశాఖకు పంపించటం, మరో అధికారిణికి ఇక్కడ ఈఓగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం దేవాదాయశాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
రాములోరి పెళ్లికి ఏర్పాట్లు ఇలాగేనా..!
దేవస్థానం ఈఓకు మంత్రి తుమ్మల క్లాస్ సరెండర్ చేయాలంటూ ఆదేశం భద్రాచలం : భద్రాచలం దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. శ్రీరామనవమికి చేస్తున్న ఏర్పాట్లపై మంగళవారం ఆయన జిల్లా అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామి వారి పెళ్లి వేడుక జరిగే మిథిలా ప్రాంగణాన్ని పరిశీలించారు. కల్యాణ మండపం వద్ద పందిళ్లను సరిగా వేయకపోవడాన్ని గుర్తించారు. ఆయన దీనిపై ఈఓ జ్యోతిని వివరణ కోరారు. ఆ పనులు చేసే కాంట్రాక్టర్ ఎవరంటూ పిలిపించి అతడిని మందలించారు. ‘‘ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రాములోరి పెళ్లికి ఏర్పాట్లు చేసేది ఇలాగేనా..? నీకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవా..? నువ్వు ఉద్యోగం చేయడానికేవచ్చావా తల్లీ... పుష్కరాల నుంచీ చెబుతున్నా... నీ పద్ధతి మార్చుకోవా..నీకు చెప్పిందేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి అంటూ ఈఓ జ్యోతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది మిథిలా ప్రాంగణమా అనుకున్నారా..? పందుల గుడిసెలు అనుకున్నావా..? రామయ్యకు ఎంత ప్రతిష్ట ఉందో తెలిసి కూడా ఇలా ఏర్పాట్లు చేయటం సరైంది కాదన్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేదానిపై మీరు అసలు తిరుగుతున్నారా..అంటూ’’ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ గారూ వీరిద్దరినీ సరెండర్ చేయండి అంటూ దేవస్థానం ఈఓ జ్యోతితో పాటు డీఈపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరి వల్ల కాదుకానీ,ఈ రెండు రోజులు భద్రాచలంలోనే ఉండి మీరే ఏర్పాట్లన్నీ చూసుకోవాలని కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు సూచించారు. మిథిలా స్టేడియం ప్రాంగణంలో పందిళ్లు సరిగా వేయలేదని, గాలీ,వెలుతురు వచ్చేలా తగిన రీతిలో అమర్చాలన్నారు. శ్రీసీతారాముల వారి పెళ్లి వేడుకల ఏర్పాట్లు చూసేందుకని వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేవస్థానం అధికారులను, అందులోనూ ఈఓ జ్యోతిపైనే తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలను వ్యక్తం చేయటం సర్వత్రా చర్చకు దారితీసింది. ఉత్సవాలకు మరో రెండు రోజులు గడువు ఉందనగా, ఈ పరిణామాలు చోటుచేసుకోవటంతో జిల్లా అధికారుల్లో దీనిపైనే చర్చసాగుతోంది.