breaking news
Bengaluru-Delhi
-
ఢిల్లీలో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
వరుసగా ఎయిరిండియా విమానాల్లో చోటుచేసుకుంటోన్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. గురువారం ఒక్క రోజే రెండు ఎయిరిండియా విమానాలకు భారీ ప్రమాదం తప్పింది. తొలుత ఢిల్లీ నుంచి వచ్చిన విమానం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుండగా దాని తోక భాగం రన్‌వేను బలంగా తాకింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో విమానంలో 186 మంది ఉన్నారు.అనంతరం బెంగళూరు నుంచి ఢిల్లీ వస్తున్న మరో ఎయిరిండియా విమానం గురువారం సాయంత్రం ఢిల్లీఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం రన్‌వేకు సమీపిస్తున్న సమయంలో, ఒక ఇంజిన్‌లో మంటలు వచ్చినట్లు కాక్‌పిట్ సిబ్బందికి అలర్ట్ వచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆ సిగ్నల్‌ను క్రాస్ చెక్ చేసుకోగా, ఇంజిన్‌లో మంటలు రావడం నిజమేనని నిర్ధారణ అయింది.పైలట్లు వెంటనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను అప్రమత్తం చేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. తక్షణమే అత్యవసర నియమావళిని (SOP) అమలు చేస్తూ విమానాన్ని రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో విమానంలో ఉన్న ఉన్న ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ఆగిన తర్వాత ప్రయాణికులను ఎమర్జెన్సీ విండో ద్వారా కిందకు దించారు. ఈ ఘటనపై డీజీసీఏ (DGCA) పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. -
స్పైస్ జెట్ విమానానికి తప్పిన ముప్పు
న్యూఢిల్లీ: స్పైస్ జెట్ విమానానికి శుక్రవారం భారీ ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లిన స్పైస్ జెట్ ఫ్లైట్ 136కు హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కారణంగా సమస్య తలెత్తింది. దీంతో.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సిబ్బంది చాకచక్యంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై స్పందించిన స్పైస్‌జెట్ సంస్థ.. హైడ్రాలిక్ ఫ్లూయిడ్‌ను కోల్పోవడం మూలంగా విమానానికి ల్యాండింగ్ సమస్య తలెత్తిందని వెల్లడించింది. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని పేర్కొంది.


