breaking news
Batukamma Festival celebrations
-
బంగారు బతుకమ్మ.
-
ఆఫీసుల్లో బతుకమ్మ
పండుగ వేళ ఉద్యోగినులకు వెసులుబాటు 23 నుంచి అక్టోబర్ 2 వరకు మధ్యాహ్నం 2 వరకే ఆఫీసులు సచివాలయ ఉద్యోగినులకు ఐదు లక్షలు మంజూరు సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వోద్యోగినులకు సమయపాలన నుంచి సర్కార్ వెసులుబాటు కల్పించింది. తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాల్లో బతుకమ్మ పండుగను మహిళలంతా ఘనంగా నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇందుకు వీలుగా ఈ నెల 23 నుంచి అక్టోబరు 2 వరకు మహిళా ఉద్యోగులు మధ్యాహ్నం రెండుగంటల వరకే పనిచేసే విధంగా మినహాయింపు ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు. మంగళవారం సచివాలయం మహిళా ఉద్యోగుల సంఘం ప్రతి నిధులు సీఎంతో సమావేశమయ్యారు. సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బతుకమ్మలు ఆడుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పండుగ వాతావరణం కనిపించాలన్నారు. ఇందుకోసం సచివాలయ మహిళా ఉద్యోగులకు రూ. 5 లక్షలను మంజూ రు చేశారు. ప్రతిజిల్లాలో బతుకమ్మ పండుగ నిర్వహణకు కలెక్టర్లకు ఇచ్చిన రూ. పదిలక్షల్లో రూ. లక్ష మహిళా ఉద్యోగులకు కేటాయించాలని ఆదేశించారు. మహిళా ఉద్యోగులను పండుగకు సమాయత్తం చేసేందుకు సచివాలయ మహిళా ఉద్యోగినులను 5 బృందాలుగా చేసి రెండేసి జిల్లాలకు ఒక బృందాన్ని పంపుతామన్నారు. బతుకమ్మ పండుగను పర్యవేక్షించే బాధ్యతలను సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్కు అప్పగించారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షురాలు జూపాక సుభద్ర, ప్రధాన కార్యదర్శి అరుణ శ్రీ, ఉపాధ్యక్షురాలు లలితాకుమారి తదితరులు పాల్గొన్నారు.


