breaking news
batteries problem
-
జాగ్రత్తలు ఈవీ.. పేలిపోతున్న వాహనాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగం దేశంలో వేగంగా పెరుగుతోంది. పర్యావరణహిత ప్రయాణ సాధనాలుగా పేర్కొంటున్న నేపథ్యంలో ప్రజలు వీటి వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే అక్కడక్కడా ఈ ఈవీ వాహనాల బ్యాటరీలు పేలిపోతుండటం తెలిసిందే. ముఖ్యంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 40ని–45ని డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నప్పుడు ఇవి కాలిపోవడం, కొన్ని సందర్భాల్లో వాహనదారులు గాయపడటం లాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీ వాహనాల్లో బ్యాటరీ సమస్యలు, వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకసారి చూద్దాం.పరిమితికి మించి వేడెక్కినప్పుడు.. ఈవీలలో సాధారణంగా లిథియం–అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తారు. ఇవి అత్యధిక శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ తీవ్రమైన ఉష్ణోగ్రతల సమయంలో రసాయనిక మార్పుల వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా లిథియం–అయాన్ బ్యాటరీ ప్యాక్‌లో వేలాది చిన్న సెల్స్ ఉంటాయి. చార్జింగ్, డిశ్చార్జింగ్ సమయంలో ఇవి వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఒక సెల్ పరిమితికి మించి వేడెక్కినప్పుడు, ఆ వేడి పక్కన ఉన్న సెల్స్‌కు వేగంగా వ్యాపిస్తుంది. క్షణాల్లో బ్యాటరీ ప్యాక్ పేలిపోయి మంటలు వ్యాపిస్తాయి. చల్లని వాతావరణం లేకపోవడం..విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అనేక లిథియం–అయాన్ సెల్స్ (ప్రధానంగా నికెల్ మాంగనీస్ కోబాల్ట్) చల్లని వాతావరణానికి అనుకూలంగా రూపొందుతాయి. అయితే భారత్‌లో వేసవి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ. అధిక బాహ్య ఉష్ణోగ్రతలకు.. వాహనం నడిపినప్పుడు, ఫాస్ట్ చార్జింగ్ చేసినప్పుడు ఉత్పత్తి అయ్యే అంతర్గత వేడి తోడై బ్యాటరీ త్వరగా ప్రమాద స్థాయికి చేరుకుంటుంది. బీఎంఎస్ వైఫల్యంబ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (బీఎంఎస్) అనేది బ్యాటరీకి మెదడు లాంటిది. ఇది ప్రతి సెల్ వోల్టేజ్, కరెంట్, ఉష్ణోగ్రతలను పర్యవేక్షిస్తుంది. తక్కువ నాణ్యత గల సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ కలిగిన బీఎంఎస్.. సెల్స్ వేడెక్కుతున్నప్పుడు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంలో విఫలమైతే షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకుంటాయి.మన దేశంలో భద్రతా చర్యలుకేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి త్వ శాఖ బ్యాటరీ భద్రతను పటిష్టం చేయడానికి ఏఐఎస్–156, ఏఐఎస్–038 నిబంధనలకు సవరణలు తీసుకువచ్చింది. వాటి ప్రకారం.. ⇒ ప్రతి బ్యాటరీ సెల్‌ను బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) నిబంధనల ప్రకారం సునిశితంగా పరీక్షించాలి. ⇒ ప్రతి బీఎంఎస్ తప్పనిసరిగా ఓవర్–చార్జ్, ఓవర్–డిశ్చార్జ్, ఓవర్–టెంపరేచర్, ఓవర్ కరెంట్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉండాలి. ⇒ ఒక సెల్ కాలిపోయినా, ఆ మంటలు పక్క సెల్‌కు వ్యాపించకుండా ఉండేలా బ్యాటరీ డిజైన్ ఉండాలి. వాహనదారులు సురక్షితంగా బయటపడటానికి కనీసం 5 నిమిషాల సమయం లభించేలా ఉండాలి. ⇒ బ్యాటరీలో అధిక వేడి సంభవించినప్పుడు డ్రైవర్‌ను అప్రమత్తం చేసేందుకు డిస్ప్లేలో హెచ్చరిక, బీప్ సౌండ్ రావాలి. ⇒ బ్యాటరీ ప్యాక్ తప్పనిసరిగా ఐపీ67 రేటింగ్ కలిగి ఉండాలి. దీనివల్ల ధూళి, వరద నీటిలో మునిగినా షార్ట్ సర్క్యూట్ కాదు.కస్టమర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఎలక్ట్రిక్ వాహనదారులు కొన్ని ప్రాథమిక నియమాలను పాటించడం ద్వారా బ్యాటరీ ప్రమాదాలను దాదాపు 99 శాతం నివారించవచ్చు. ⇒ వాహనంతో పాటు కంపెనీ ఇచ్చిన లేదా ధ్రువీకరించిన చార్జర్లనే వాడాలి. ⇒ సుదీర్ఘ ప్రయాణం తర్వాత బ్యాటరీ కనీసం 30–45 నిమిషాలు చల్లబడిన తర్వాతే చార్జింగ్కు పెట్టాలి. ⇒ రాత్రంతా చార్జింగ్ పెట్టి వదిలేయడం ప్రమాదకరం. 100% చార్జ్ అయిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. ⇒ ఎండాకాలంలో వాహనాన్ని వీలైనంత వరకు చెట్లు ఇతర నీడ ప్రాంతాల్లో పార్క్ చేయాలి. ⇒ బ్యాటరీ ప్యాక్ చుట్టూ గాలి ఆడేలా చూసుకోవాలి. ముఖ్యంగా డిటాచబుల్ బ్యాటరీలను ఇంట్లో చార్జ్ చేసేటప్పుడు బెడ్రూమ్లు లేదా సులభంగా మంటలు అంటుకునే వస్తువుల (ఎల్పీజీ సిలిండర్లు) దగ్గర పెట్టకూడదు. ⇒ బ్యాటరీ చార్జ్ అవుతున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు రసాయనాల వాసన, పొగ వచ్చినా, అసాధారణ శబ్దాలు విని్పస్తున్నా, బ్యాటరీ ప్యాక్ ఉబ్బినట్లు అనిపించినా వాహనాన్ని నిలిపివేసి టెస్టింగ్‌కు తరలించాలి. -
ఐఫోన్ 8, 8 ప్లస్ బ్యాటరీలో లోపాలు
-
నోట్ 7 పేలుడుకు అసలు కారణమిదే!
సియోల్ : శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గెలాక్సీ నోట్ 7 ఆ కంపెనీ కొంపమొచ్చింది. బ్యాటరీ పేలుళ్లతో ఒక్కసారిగా దాని పేరు, పత్రిష్ట, మరోవైపు నుంచి లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. రీకాల్ చేసి కొత్త ఫోన్లు మార్కెట్లోకి తీసుకొచ్చినా పేలుళ్ల సమస్య మాత్రం ఆ కంపెనీని వీడలేదు. దీంతో మొత్తానికే గెలాక్సీ నోట్7 అమ్మకాలు, ఉత్పత్తి నిలిపివేసి అసలు కారణమేమిటా? అని శోధించడం ప్రారంభించింది. ఎట్టకేలకు ఈ పేలుళ్ల కారణాన్ని శాంసంగ్ పట్టేసిందట. గెలాక్సీ నోట్7 ఫోన్లకు సరిపడ పరిమాణంలో లేని బ్యాటరీలను ఫిక్స్ చేయడం వల్లనే అవి ఓవర్‌హీట్ అయి పేలుతున్నాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ శుక్రవారం రిపోర్టు చేసింది. సోమవారం రోజు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను దక్షిణ కొరియా దిగ్గజం ప్రజల ముందుకు తీసుకురానుంది. ఈ నేపథ్యంలో సంబంధిత వర్గాల సమాచారం మేరకు శాంసంగ్ కనుగొన్న కారణాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించేసింది. కంపెనీకి సమస్య తీసుకొచ్చిన బ్యాటరీల పరిమాణం సరిగ్గా లేదని, దీనివల్ల అవి ఓవర్‌హీట్ అవుతున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కంపెనీ తీసుకొచ్చిన ఈ నోట్7 డివైజ్‌లు పేలుళ్ల బారిన పడి, వినియోగదారులకు చిరాకు తెప్పించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో కంపెనీ నోట్7 ఫోన్లను రీకాల్ చేయడం ప్రారంభించింది. 2.5 మిలియన్ యూనిట్లను రీకాల్ చేస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. రీప్లేస్మెంట్లో కొత్త ఫోన్లను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ శాంసంగ్‌ను పేలుళ్ల సమస్య వదలేదు. ఈ నేపథ్యంలో మొత్తానికే నోట్7ను ఆపివేస్తే బాగుంటుందని శాంసంగ్ నిర్ణయించింది. పేలుళ్ల బ్యాటరీలను కంపెనీకి బ్యాటరీల సప్లయర్‌గా ఉన్న ఓ సంస్థ సరఫరా చేస్తుందని శాంసంగ్ చెబుతోంది. తమ తప్పేమి లేదంటూ వాదిస్తోంది. కానీ ఆ సప్లయర్ పేరును మాత్రం శాంసంగ్ వెల్లడించడం లేదు. అయితే ఆ కంపెనీ ఈ దక్షిణ కొరియా దిగ్గజానికి చెందినదేనని, శాంసంగ్ ఎస్డీఐగా పలువురు పేర్కొంటున్నారు. ఈ కంపెనీ శాంసంగ్‌కు అవసరమైన బ్యాటరీలను రూపొందిస్తోంది. సంస్థకు చెందిన మొత్తం ఉత్పత్తిని పూర్తిగా సంస్కరిస్తుందని, మరో సమస్య తలెత్తకుండా క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్‌ను సంస్కరించనున్నామని శాంసంగ్ వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే.


