breaking news
bathukammakunta
-
అంబర్‌పేట బతుకమ్మ కుంట ప్రారంభించిన సీఎం రేవంత్
హైదరాబాద్: అంబర్ పేట బతుకమ్మ కుంటను సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం(సెప్టెంబర్ 28వ తేదీ) ప్రారంభించారు. పాడు పడ్డ చెరువును ఏడున్నర కోట్ల రూపాయిలతో పునరద్ధరించింది హైడ్రా. ఈ మేరకు బతుకుమ్మ కుంటలో బతుకమ్మ నిమజ్జనం చేసే ప్రాంతాన్ని సీఎం రేవంత్ పరిశీలించిన తర్వాత ప్రారంభించారు. బతుకమ్మ కుంటకు ప్రత్యేక పూజలు చేశారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా బతుకమ్మ కుంటలో స్వయంగా మొదటి బతుకమ్మను వదిలారు. బతుకమ్మకు చీర, సారె అందజేశారు సీఎం రేవంత్.సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ హైడ్రా తీసుకొచ్చిమంచి పని చేస్తుంటే బురదజల్లారు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు.. ఆరోపణలు చేశారు. కోవిడ్ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. గంటలో 40 సెం.మీ వర్షం కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు మూసీ మురికికూపంలా మారిపోయింది. ఈ బతుకమ్మ కుంట కోసం వీహెచ్ పోరాటం చేశారు. ఈ రోజు చాలా సంతోషకరమైన దినం’ అని పేర్కొన్నారు. -
25న బతుకమ్మకుంటలో బతుకమ్మ
సాక్షి, హైదరబాద్: అంబర్‌పేటలోని బతుకమ్మకుంట ఈసారి బతుకమ్మ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ నెల 25న ఇక్కడ నిర్వహించనున్న కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. హైడ్రా అ«దీనంలో పునరుజ్జీనం పొందిన ఈ కుంటను అదే రోజు ప్రజలకు అంకితం చేయనున్నారు. ఆ ఏర్పాట్లను ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. బతుకమ్మ కుంటకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా బతుకమ్మ ఉత్సవాలు జరగాలని వేంనరేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ఆక్రమణలకు గురై నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయి, పిచ్చి మొక్కలు పెరిగి అటువైపు వెళ్లాలంటే కాదు.. కనీసం చూడాలంటే భయపడే విధంగా బతుకమ్మ కుంట మారిపోయింది. కబ్జాల చెర నుంచి దీనికి విముక్తి కలి్పంచి సర్వాంగ సుందరంగా తీర్చడంలో హైడ్రా కృషి అభినందనీయం’ అని మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు. -
పేదలు కాదు.. పెద్దలు కూడా హైడ్రా టార్గెట్: రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల తొలగింపు, చెరువుల రక్షణ, ప్రభుత్వ స్థలాలను కాపాడటమే లక్ష్యంగా హైడ్రా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో నేడు హైడ్రా ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అంబర్ పేట బతుకమ్మ కుంట వద్ద స్కూల్ స్టూడెంట్స్ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ..‘చెరువులను కాపాడాలనే ఉద్దేశ్యంతో మొదట్లో మేము చాలా అగ్రసీవ్ గా వెళ్ళాం. అలా చేయడంతో చెరువుల ఆక్రమణలు తగ్గాయి. భావితరాలకు భవిష్యత్తు ఇవ్వడం కోసం హైడ్రా పని చేస్తుంది. సీఎం ఆదేశాలతో సామజిక కోణంలో చూసి పేదల ఇళ్లు కూల్చడం లేదు. కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారు. సెప్టెంబర్ 21న బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. హైడ్రా అంటే డెమాలిషన్ కాదు డెవలప్మెంట్. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన బతుకమ్మ కుంట ఒక షాంపిల్ మాత్రమే. త్వరగా ఎన్నో బతుకమ్మ కుంటలు వెలుగు లోకి వస్తాయి.గత ఏడాది జూలై 19న హైడ్రా ఏర్పడింది. డిజాస్టర్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టం. ప్రభుత్వ స్థలాలు కాపాడటంపై ప్రత్యేక దృష్టి సారించాం. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు.. దాదాపు 500 ఎకరాల భూమి కాపాడాం. వాటి విలువ 30వేల కోట్లకు పైనే ఉంటుంది. బతుకమ్మ కుంటను వెలుగులోకి తెచ్చాము. ప్రజల సహకారంతో ప్రభుత్వ, ప్రజల ఆస్తులు కాపాడే ప్రయత్నం చేశాం. హైడ్రా అంటే కేవలం కూచివేతలు కాదు. రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా హైడ్రా పనిచేస్తుంది. పేద వారి మీద కాదు మా ప్రతాపం.. పెద్ద వారిపై కూడా హైడ్రా సమానంగా పని చేస్తుంది. హైడ్రాపై అనేక విమర్శలు చేశారు. సామాజిక కోణంలో హైడ్రా పని చేస్తుంది..సల్కాం చెరువుపై ఇంకా ఫైనల్ నోటిఫికేషన్ అవ్వలేదు. ఒవైసీ ఫాతిమా కాలేజీపై సామాజిక కోణంతో ముందుకు వెళ్తున్నాం. 140 చెరువుల ఫైనల్ నోటిఫికేషన్ ఉంది. మిగతా చెరువుల బౌండరీతో పాటు ఫైనల్ నోటిఫికేషన్ రాలేదు. ఫైనల్ నోటిఫికేషన్ వచ్చాక మిగతా FTL, బఫర్‌లో వచ్చిన అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేస్తాం. ఈ ఏడాది సెప్టెంబర్ 21న ముఖ్యమంత్రి చేతుల మీదగా బతుకమ్మ కుంట లో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతాయి. బతుకమ్మ కుంట పునరుద్దరణ చేయడం మా పనికి నిదర్శనం అని చెప్పుకొచ్చారు. -
గోడ దూకిన సీపీఐ నారాయణ
అంబర్‌పేటలోని బతుకమ్మకుంట స్థలాన్ని పరిశీలించేందుకు శుక్రవారం అక్కడికి వచ్చిన సీపీఐ జాతీయ నాయకులు నారాయణ ఈ సందర్భంగా ఎత్తయిన గోడను ఎక్కి, పట్టు తప్పి కిందపడబోయాడు. అ తరువాత నిగ్రహించుకొని కుంటను చూసి మళ్లీ గోడను దూకి ఇవతలకు వచ్చేశారు. ఫోటోలు: ఎం.రవికుమార్ ముషీరాబాద్