
హైదరాబాద్: అంబర్ పేట బతుకమ్మ కుంటను సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం(సెప్టెంబర్ 28వ తేదీ) ప్రారంభించారు. పాడు పడ్డ చెరువును ఏడున్నర కోట్ల రూపాయిలతో పునరద్ధరించింది హైడ్రా. ఈ మేరకు బతుకుమ్మ కుంటలో బతుకమ్మ నిమజ్జనం చేసే ప్రాంతాన్ని సీఎం రేవంత్ పరిశీలించిన తర్వాత ప్రారంభించారు. బతుకమ్మ కుంటకు ప్రత్యేక పూజలు చేశారు సీఎం రేవంత్.
దీనిలో భాగంగా బతుకమ్మ కుంటలో స్వయంగా మొదటి బతుకమ్మను వదిలారు. బతుకమ్మకు చీర, సారె అందజేశారు సీఎం రేవంత్.
సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ హైడ్రా తీసుకొచ్చిమంచి పని చేస్తుంటే బురదజల్లారు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు.. ఆరోపణలు చేశారు. కోవిడ్ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. గంటలో 40 సెం.మీ వర్షం కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు మూసీ మురికికూపంలా మారిపోయింది. ఈ బతుకమ్మ కుంట కోసం వీహెచ్ పోరాటం చేశారు. ఈ రోజు చాలా సంతోషకరమైన దినం’ అని పేర్కొన్నారు.