
పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు
సాక్షి, హైదరబాద్: అంబర్‌పేటలోని బతుకమ్మకుంట ఈసారి బతుకమ్మ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ నెల 25న ఇక్కడ నిర్వహించనున్న కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. హైడ్రా అ«దీనంలో పునరుజ్జీనం పొందిన ఈ కుంటను అదే రోజు ప్రజలకు అంకితం చేయనున్నారు. ఆ ఏర్పాట్లను ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. బతుకమ్మ కుంటకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా బతుకమ్మ ఉత్సవాలు జరగాలని వేంనరేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ఆక్రమణలకు గురై నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయి, పిచ్చి మొక్కలు పెరిగి అటువైపు వెళ్లాలంటే కాదు.. కనీసం చూడాలంటే భయపడే విధంగా బతుకమ్మ కుంట మారిపోయింది. కబ్జాల చెర నుంచి దీనికి విముక్తి కలి్పంచి సర్వాంగ సుందరంగా తీర్చడంలో హైడ్రా కృషి అభినందనీయం’ అని మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు.