breaking news
basherbagh
-
వరకట్నం వేధింపులకు గర్భిణి బలి
బషీరాబాద్(తాండూరు): వరకట్న దాహనికి ఓ ఇల్లాలు బలైంది. పెళ్లై నాలుగేళ్లు గడుస్తున్నా భర్త వేధింపులు మాత్రం ఆగలేదు. పెళ్లినాడు ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన వరకట్నం పుట్టింటి నుంచి తీసుకురావాలని భర్త పెడుతున్న వేధింపులకు తాళలేక ఏడు నెలల గర్భవతి అయిన భార్య పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీళ్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ లక్ష్మయ్య, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలప్రకారం.. నీళ్లపల్లి గ్రామానికి చెందిన తలారి ఆంజనేయులు, అమృతమ్మ(22) భార్యభర్తలు. వీరికి నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు కూతురు భావ్యశ్రీ(3) ఉంది. వీరు హైదరాబాద్‌లో పనిచేస్తూ అక్కడే కాపురం పెట్టారు. కొన్ని నెలల కిందట స్వంత గ్రామం నీళ్లపలికి తిరిగి వచ్చారు. అయితే తనకు ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రిలో చూపించాలని భర్త ఆంజనేయులుకు చెప్పింది భార్య. దీనికి భర్త అగ్గిమీద గుగ్గిలంలా భార్య అమృతమ్మను దూశిస్తూ.. ‘మీ పుట్టింటికి వెళ్లి మిగిలిన వరకట్నం డబ్బులు తీసుకొనిరా.. అప్పుడు నీకు ధవఖానాకు చూపిస్తా..’ అంటు బదులిచ్చాడు. అంతడితో ఆగకుండా భార్యను మానసికంగా, శారీరకంగా బాధపెట్టాడు. దీనికి తోడు అత్త వెంకటమ్మ కూడా కొడుకుకు అండగా నిలచి వేధింపులకు గురిచేసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన ఆమె అదే రోజు ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోయింది. రాత్రికి పురుగుల మందు తాగి ఇంటికి చేరుకుంది. విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. రాత్రంతా అలాగే ఇంట్లోనే ఉంది. అయితే విషం శరీరంలోకి పాకడంతో తీవ్ర అస్వస్థకు గురైంది. గమనించిన కుటుంబæ సభ్యులు ఆదివారం తెల్లవారు జామున ఆమెను తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వికారాబాద్‌లోని మిషన్ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం అక్కడి నుంచి మొరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తల్లితో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా కండ్లు తెరవకుండానే మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి శాంతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమృతమ్మ భర్త ఆంజనేయులు, అత్త వెంకటమ్మలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. శవపంచనామ అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. -
చంద్రబాబూ.. గుణపాఠం నేర్వరా?
విద్యుత్ చార్జీలను పెంచితే మళ్లీ ప్రజా ఉద్యమమే సీపీఎం నేత బాబూరావు హెచ్చరిక బషీర్‌బాగ్ అమరవీరులకు నివాళులు విజయవాడ : పేదలపై విద్యుత్ భారాలు మోపితే ప్రతిఘటన తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీ.హెచ్.బాబూరావు తెలుగుదేశం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 2000 సంత్సరంలో విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో జరిగిన ప్రజా ఉద్యమంపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం జరిపించిన పోలీసు కాల్పుల పాశవిక దాడికి 16 ఏళ్ళు అయింది. ఈ సందర్భంగా ఆదివారం సుందరయ్యభవన్‌లో నగర సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన విద్యుత్ అమర వీరుల సంస్మరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బాబూరావు మాట్లాడుతూ 2000వ సంత్సరంలో విద్యుత్ చార్జీలు పెంచితే ప్రజలు పెద్దఎత్తున ఉద్యమం చేసి వాటిని తిప్పికొట్టారని గుర్తుచేశారు. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికి గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళీ విద్యుత్ చార్జీల పెంపునకు పూనుకోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి.ఆర్.తులసీరావు, నగర కార్యదర్శి దోనేపూడి కాశీనా«థ్ తదితరులు పాల్గొన్నారు.