breaking news
Bashar Assad
-
సెప్టెంబర్‌లో సిరియా ఎన్నికలు
డమాస్కస్: దీర్ఘకాల అంతర్యుద్ధం అనంతరం.. సిరియాలో పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి 20 ఎన్నికలను నిర్వహించనున్నట్లు పీపుల్స్ అసెంబ్లీ ఎన్నికల ఉన్నత కమిటీ చైర్మన్ మొహమ్మద్ తహా అల్–అహ్మద్ తెలిపారు. గతేడాది డిసెంబర్లో తిరుగుబాటుతో బషర్ అసద్ అధికార పతనం తరువాత.. దేశంలో మొదటిసారి ఎన్నికలు జరగుతున్నాయి. తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్–షరా మార్చిలో తాత్కాలిక రాజ్యాంగంపై సంతకం చేశారు. సాధారణ ఎన్నికలు జరిగి.. శాశ్వత రాజ్యాంగాన్ని ఆమోదించే వరకు తాత్కాలిక పార్లమెంటుగా పీపుల్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగనున్నాయి. అలవైట్లపై హింస.. డ్రూజ్ మిలిటెంట్ల దాడులు మార్చిలో అలవైట్ మైనారిటీకి చెందిన వందలాది మంది హత్యతో మతపరమైన హింస చెలరేగింది. సిరియా భద్రతా దళాలు అలవైట్ మైనార్టీ వర్గానికి చెందిన వందలాదిమంది పౌరులను చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. అలవైట్లను లక్ష్యంగా చేసుకొని 30 సార్లు సాగించిన మారణకాండలో 745 మంది పౌరులు చనిపోయినట్లు బ్రిటన్ కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ (ఎస్ఓహెచ్ఆర్) తెలిపింది. దీంతో సిరియాలో మైనారిటీల స్థితిగతులపై ఆందోళనలను రేకెత్తించాయి. మరో మైనారిటీ గ్రూప్ డ్రూజ్ మిలిటెంట్లు ప్రభుత్వంపై దాడికి దిగారు. గతంలో ఐఎస్ఎస్ ఉగ్రవాదిగా ఉన్న అహ్మద్ అల్ షరా.. అసద్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఈ డ్రూజ్ మైనారిటీల మిలిటెంట్ల సాయం తీసుకున్నారు. తీరా అల్ షరా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడేటప్పుడు కేవలం ఒక్క డ్రూజ్ నేతకే ప్రభుత్వంలో స్థానం కల్పిస్తానని చెప్పడం, డ్రూజ్ ప్రాభల్య ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో చీలిక వచ్చింది. డ్రూజ్‌లో ఒక వర్గం ఇలా సాయుధ పంథాను ఉధృతం చేసింది. సువైదా ప్రావిన్స్‌లో జూలై 13న డ్రూజ్ వ్యాపారి అపహరణతో తాజా హింస ప్రారంభమైంది. డమాస్కస్, సువైదా, డెరాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది. ప్రభుత్వ అనుబంధ దళాల నుండి డ్రూజ్‌ను రక్షించడానికి తమ దళాలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. సువైదాలో 1,100 మందికి పైగా మరణించినట్లు ఎస్ఓహెచ్ఆర్ తెలిపింది. డ్రూజ్, బెడోయిన్, ప్రభుత్వ దళాలు.. దారుణాలకు పాల్పడ్డాయి. అసద్ పతనం నుంచి దేశవ్యాప్తంగా సైనిక స్థావరాలు, ప్రభుత్వ దళాలపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్.. సిరియాలోని కుర్దులు, డ్రూజ్, అలవైట్లతో సహా మైనారిటీల రక్షకుడిగా చూపించుకునే ప్రయత్నం చేసింది. అయితే.. ఇజ్రాయెల్ తన విస్తరణ కోసం సిరియాలో మత విభజనను రేకెత్తిస్తోందని విమర్శలున్నాయి. రాష్ట్ర నిర్మాణం, యుద్ధానంతర పునరుద్ధరణ ప్రయత్నాలను మత ఘర్షణలు, ఇజ్రాయెల్ దాడులు పక్కదారి పట్టిస్తున్నాయి. ఈ హింస తర్వాత ప్రజల్లో చీలిక వచ్చింది. కొత్త ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత పెరిగింది. ఈ నేపథ్యంలోనే తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికల ప్రకటన చేసింది. అసద్ పతనం తరువాత మొదలైన మతపరమైన విభజనలను తగ్గించి.. పరిస్థితులను పునరుద్ధరించేందుకు తాత్కాలిక అధ్యక్షుడు అల్–షరా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల తన ఎన్నికల చట్టాలను సవరించింది, పార్లమెంటు సీట్లను 150 నుంచి 210కి పెంచింది. 210 సీట్లలో మూడింట ఒక వంతు స్థానాలను తాత్కాలిక అధ్యక్షుడు అల్–షరా నియమిస్తారు. మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. దీనికోసం సిరియాలోని ప్రతి ప్రావిన్స్‌లో ఒక ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. -
బషర్ అసద్‌పై విష ప్రయోగం?
లండన్: రష్యాలో ఆశ్రయం పొందిన సిరియా పదవీచ్యుత అధ్యక్షుడు బషర్ అసద్(59)పై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఆదివారం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు రష్యా మాజీ గూఢచారిగా భావిస్తున్న జనరల్ ఎస్వీఆర్ అనే ఆన్లైన్ ఎకౌంట్లో ఈ విషయం బయటకు పొక్కిందని ‘ది సన్’పేర్కొంది. అసద్‌కు తీవ్రమైన దగ్గు, ఊపిరాడకపోవడంతో వైద్యం అందించారని తెలిపింది. అసద్‌పై హత్యా ప్రయత్నం జరిగిందనేందుకు ఇదే ఉదాహరణ అని సన్ పేర్కొంది. డిసెంబర్ మొదటి వారం కుటుంబం సహా వెళ్లిన అసద్ మాస్కోలోని సొంత అపార్టుమెంట్లోనే ఉంటున్నారు. అక్కడే ఆయనకు వైద్యం అందుతోందని, సోమవారానికి పరిస్థితి కుదుటపడిందని సన్ తెలిపింది. -
దాడికి దిగితే యుద్ధమే
కైరో: అమెరికా, దాని మిత్రదేశాలు సైనిక దాడికి దిగితే యుద్ధం తప్పదని సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మంగళవారం హెచ్చరించారు. దాడికి దిగితే తీవ్ర పరిణామాలుంటాయని ఫ్రెంచి పత్రిక ‘లె ఫిరాగో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసద్ ఈ మేరకు స్పష్టంచేశారు. సిరియా పౌరులపై అసద్ ప్రభుత్వం రసాయనిక దాడికి పాల్పడిందనే ఆరోపణలతో అమెరికా సహా పాశ్చాత్య దేశాలు సిరియాపై సైనిక దాడి జరపడంపై మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో అసద్ ఈ హెచ్చరిక చేయడం గమనార్హం. మరోవైపు సిరియాపై దాడికి అమెరికన్ కాంగ్రెస్ మద్దతు కోరిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు రిపబ్లికన్ సెనేటర్లు జాన్ మెక్కెయిన్, లిండ్సే గ్రాహంలు మద్దతుపలికారు. అదేవిధంగా అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ మంగళవారం‘స్పారో’ క్షిపణి పరీక్ష నిర్వహించడమూ ఈ ప్రాంతంలో ఉద్రిక్తతను పెంచింది. ఇదిలాఉండగా, ఐక్యరాజ్యసమితి ఆమోదం లేకుండా సిరియాపై సైనికదాడిలో తాము పాల్గొనబోమని జర్మనీ స్పష్టం చేసింది. కాగా.. సిరియాపై సైనిక దాడి జరిపే అంశంలో భారత్ మద్దతు ఉందని బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సిరియా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, సంక్షోభం పరిష్కారానికి సైనిక చర్యకు దిగరాదని భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. -
దాడులకు పాల్పడితే బుద్ధి చెబుతాం: అసద్
డెమాస్కస్ : బరి తెగించి తమపై ఎవరు దాడులకు పాల్పడినా తీవ్రంగా ప్రతిఘటించడమే కాకుండా, తగిన బుద్ధి చెప్తామని సిరియా అధ్యక్షుడు బషార్ అల్ అసాద్ హెచ్చరించారు. సిరియాపై దాడిచేయాలని కోరుకుంటున్న శక్తులకు రసాయన ఆయుధాలు ఒక సాకు మాత్రమేనన్నారు. సిరియన్లు శాంతియుత స్వేచ్ఛా జీవితం గడపడం ఇష్టంలేని శక్తులు కుట్రపన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. రసాయన ఆయుధాలు ఉపయోగించింది తిరుగుబాటు సైన్యమేనని అసద్ స్పష్టం చేశారు. దూకుడుగా వ్యవహరించి సిరియాపై సైనిక దాడి చేస్తే.. అది సాహసమే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తాము రసాయన ఆయుధాలు ప్రయోగించామని చెప్పేందుకు ఏ సాక్ష్యాధారాలున్నాయో చూపాలని అసద్ సవాల్ విసిరారు. ఓ వైపు.. ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం తనిఖీ నివేదికలు ఇంకా ఇవ్వకుండానే.. తీర్పులు ఇచ్చేస్తున్న శక్తుల ఉద్దేశాలు వేరని వ్యాఖ్యానించారు.