breaking news
bank coaching
-
నాన్నపై ప్రేమతో..
విశాఖ :ఈమె పేరు రేవతి. చదివింది డిగ్రీ. కుటుంబ భారాన్ని మోయడానికి మెకానిక్‌గా మారింది. విశాఖ సుజాతానగర్ ప్రాంతానికి చెందిన కె.రాముకు కొడుకు లేని లోటు తీరుస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తోంది. కరోనా కష్ట కాలంలో తండ్రి మెకానిక్ షాపులో బైక్‌లు రిపేర్ చేస్తూ కుటుంబానికి చేయూతనందిస్తోంది. మరోవైపు బ్యాంకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. -
అతిగా మద్యం తాగి విద్యార్థి మృతి
నంద్యాల: అతిగా మద్యం తాగి బ్యాంక్ కోచింగ్ సెంటర్ విద్యార్థి రామకృష్ణ(25) సోమవారం మృతి చెందాడు. ఒంగోలు పట్టణానికి చెందిన కిరాణం వ్యాపారి వెంకట సుబ్బారావుకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమార్తె లక్ష్మీ స్థానిక బ్యాంక్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది ఉద్యోగం సంపాదించింది. దీంతో డిగ్రీ చదివిన రామకృష్ణను బ్యాంక్ కోచింగ్ సెంటర్లో చేర్పించాడు. ప్రైవేటు గదుల్లో ఉన్న రామకృష్ణ..డిసెంబర్ 31వ తేదీ రాత్రి, జనవరి 1వ తేదీ ఫుల్‌గా మద్యం తాగి స్నేహితులతో గడిపాడు. సోమవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా నిద్ర లేచి బాత్రూంకు వెళుతూ కుప్పకూలిపోయాడు. వెంటనే సహచర విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినా కోలుకోలేక మృతి చెందాడు. ఇతనికి చికిత్స చేసిన వైద్యులు మద్యం అతిగా తాగినట్లు నిర్ధారించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు.