breaking news
balanagireddy
-
వైఎస్ జగన్‌తోనే నా ప్రయాణం: మంత్రాలయం ఎమ్మెల్యే
సాక్షి,కర్నూలుజిల్లా: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని మంత్రాలయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు మంగళవారం(ఫిబ్రవరి11)బాలనాగిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పటికీ వైఎస్సార్సీపీలోనే ఉంటానని, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వెంటే నడుస్తానని బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగత సమస్యల వల్ల పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉన్నానని,అంతేకానీ పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు, మండల నాయకుల ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తామని బాలనాగిరెడ్డి తెలిపారు. -
ఫ్యాన్ గాలిని ఎవరూ ఆపలేరు
మంత్రాలయం, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గుర్తు ప్రభంజనం సృష్టిస్తుందని వైఎస్సార్సీపీ మంత్రాలయం అభ్యర్థి బాలనాగిరెడ్డి అన్నారు. దీన్ని ఆపడం ఎవరి తర మూ కాదన్నారు. పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని, జగన్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఆరోపణలు చేసినా ఎన్నికల్లో ప్రజాతీర్పు ముందు దిగదుడుపేనని పేర్కొన్నారు. సోమవారం ఆయన మంత్రాలయంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్రుల మూలబృందావ నానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాత ఊరిలో ఉద యం 11.50 నుంచి ప్రచారం మొదలెట్టిన బాలనాగిరెడ్డి కోట వీధి, పంప్‌హౌస్ గేరి, వెంకటేశ్వరస్వామి వీధుల్లో ఓట్లు అభ్యర్థించారు. వైఎస్సార్ మరణం తర్వా త అనేక ఇబ్బందులకు గురవుతున్న జనం జగన్మోహన్రెడ్డిపై ఆశలు పెట్టుకున్నారని బాలనాగిరెడ్డి తెలిపారు. ఇందుకోసం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్ భీమారెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, నాయకులు వెంకటేష్‌శెట్టి, విశ్వనాథ్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, ప్రభాకర్ఆచారి, వడ్డెప్పస్వామి, ఐపీ నరసింహమూర్తి, వీరన్నశెట్టి పాల్గొన్నారు.