breaking news
baireddy
-
ప్రతి జిల్లాలో టోర్నమెంట్ లు నిర్వహిస్తా : బైరెడ్డి
-
పీవీ సింధు కు బై రెడ్డి సిద్దార్థ్ రెడ్డి అభినందనలు
-
బాబు ఎన్నికల గిమ్మిక్కులు ప్రజలు నమ్మరు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సీఎం చంద్రబాబునాయుడు ఐదేళ్లు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఎన్నికల సమయంలో ఎన్ని గిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మేస్థితిలో లేరని ‘నిన్ను నమ్మం బాబూ’ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉద్ఘాటిస్తున్నారు. జిల్లాలో ఋనిన్ను నమ్మం బాబూ’ కార్యక్రమం కొనసాగుతోంది. చంద్రబాబునాయుడు ప్రకటించే ఎన్నికల వరాలను నమ్మవద్దని ప్రజలకు విస్తృతంగా వివరిస్తున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం ఎదురుపాడు, జగ్గవారిపల్లెల్లో నిర్వహించిన నిన్ను నమ్మం బాబూ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఐజయ్య, సమన్వయకర్త cపాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అంతకముందు ఆయా గ్రామా ల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం బహిరంగ సభల్లో నవరత్నాలపై ప్రజలకు వివరించారు. ఆత్మకూరులోని ఇంద్రానగర్‌లో సమన్వయకర్త, నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి హాజరై టీడీపీ మోసాలను ప్రజలకు వివరించారు. ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామంలో నియోజకవర్గ నాయకుడు గంగుల బిజేంద్రారెడ్డి(నాని) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి టీడీపీ డ్వాక్రా మహిళలు, రైతులకు ప్రకటించిన వరాలు మోస పూరితమైనవని, కేవలం ఎన్నికల కోసమే వాటిని ప్రకటించారని ఇంటింటా ప్రచారం చేశారు. -
విడిపోతేనే సీమకు మనుగడ
కడప సెవెన్‌రోడ్స్ : రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తప్ప మనుగడ సాధ్యం కాదని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, అమరావతి ఫ్రీ జోన్‌గా ప్రకటించాలంటూ నాలుగు రోజులుగా కలెక్టరేట్ ఎదుట రాయలసీమ విద్యార్థి సంఘం చేపట్టిన నిరవధిక దీక్షా శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. శ్రీశైలం ముంపు ప్రాంతమైన కర్నూలుజిల్లాకు ఒక్క పైసా ఇవ్వకుండా, పుష్కరాల సందర్భంగా నిధులన్నీ కోస్తాలో ఖర్చు చేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతం పట్ల వివక్ష చూపారని విమర్శించారు. తాము సొంతంగా రాయలసీమ పుష్కరాలను నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతి ఇంటిపై ఒక నల్లజెండా ఎగురేసి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వల్ల కోస్తా ప్రాంతమే బాగుపడుతుంది తప్ప రాయలసీమకు ఎలాంటి మేలు జరగదన్నారు. బాబుకు అమరావతి తప్ప సీమ గోడు పట్టడం లేదని ధ్వజమెత్తారు.అమరావతి వరకు గడ్డం పెంచినా నీళ్లు ఇవ్వరంటూ పరోక్షంగా సతీష్‌రెడ్డిని ఎద్దేవా చేశారు. త్వరలో తాను చేపట్టబోయే చైతన్య యాత్రలో ఈ అంశాలపై కుప్పంలోనే చంద్రబాబును ఎండగడతానన్నారు. తెలంగాణతోపాటు ‘సీమ’ విడిపోయి ఉంటే ఇప్పటికి 10 ఉక్కు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకునే వారమన్నారు. వేలాది కోట్ల ఆదాయాన్ని సమకూర్చే టీటీడీ, శ్రీకాళహస్తి, కాణిపాకం, మంత్రాలయం, శ్రీశైలం దేవస్థానాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం ఆపాలి – సీహెచ్ అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని తక్షణమే ఆపాలని రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇంకా ఎనిమిదేళ్లు రాజధానిగా హైదరాబాదునే ఉపయోగించుకునే వెసులుబాటు ఉందన్నారు. ఆలోపు సీమ, ఉత్తర కోస్తాలను అభివృద్ది చేసి ఆ తర్వాత రాజధాని కర్నూలులో ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, సీపీఐ నాయకుడు కృష్ణమూర్తిలు మాట్లాడారు. దీక్షల విరమణ: నాలుగు రోజులుగా ఆర్ఎస్యూ అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన దీక్షలను బైరెడ్డి విరమింపజేశారు. కార్యక్రమంలో పవన్ విద్యా సంస్థల అధినేత జోగిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.