
ఆత్మకూరులో ఇంటింటి ప్రచారం చేస్తున్న శిల్పా చక్రపాణి రెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సీఎం చంద్రబాబునాయుడు ఐదేళ్లు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఎన్నికల సమయంలో ఎన్ని గిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మేస్థితిలో లేరని ‘నిన్ను నమ్మం బాబూ’ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఉద్ఘాటిస్తున్నారు. జిల్లాలో ఋనిన్ను నమ్మం బాబూ’ కార్యక్రమం కొనసాగుతోంది. చంద్రబాబునాయుడు ప్రకటించే ఎన్నికల వరాలను నమ్మవద్దని ప్రజలకు విస్తృతంగా వివరిస్తున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం ఎదురుపాడు, జగ్గవారిపల్లెల్లో నిర్వహించిన నిన్ను నమ్మం బాబూ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఐజయ్య, సమన్వయకర్త cపాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
అంతకముందు ఆయా గ్రామా ల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం బహిరంగ సభల్లో నవరత్నాలపై ప్రజలకు వివరించారు. ఆత్మకూరులోని ఇంద్రానగర్‌లో సమన్వయకర్త, నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి హాజరై టీడీపీ మోసాలను ప్రజలకు వివరించారు. ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామంలో నియోజకవర్గ నాయకుడు గంగుల బిజేంద్రారెడ్డి(నాని) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి టీడీపీ డ్వాక్రా మహిళలు, రైతులకు ప్రకటించిన వరాలు మోస పూరితమైనవని, కేవలం ఎన్నికల కోసమే వాటిని ప్రకటించారని ఇంటింటా ప్రచారం చేశారు.