breaking news
bahubali bulls
-
బాహుబలి ఎద్దు..
-
‘బాహుబలి’ వృషభాల సందడి
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి-2’ చిత్రంలో కీలక సన్నివేశంలో కనిపించిన ‘రాజస్థాన్ కాంక్రీజ్’ జాతి వృషభాలు అనంతపురంలో సందడి చేస్తున్నాయి. నగర శివారులోని ఇస్కాన్ మందిర ప్రాంగణంలో గల గోశాలలో ఇవి ఉన్నాయి. ఇరవై నెలల వయసులోనే బలిష్టంగా కనిపించే వృషభాలు వయసు పెరిగే కొద్దీ కొమ్ములు మరింత రాటు దేలుతాయని ‘ఇస్కాన్’ నిర్వాహకులు దామోదర గౌరంగదాసు తెలిపారు. బాహుబలి - 2 చిత్రం విడుదల తర్వాత నుంచి ‘రాజస్థాన్ కాంక్రీజ్’ జాతి వృషభాలను తిలకించేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. - సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం