ఇండిక్యాష్ ఏటీఎమ్ ధ్వంసం..
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు టాటా సంస్థకు చెందిన ఇండిక్యాష్ ఏటీఎమ్‌ను ధ్వంసం చేశారు.
గ్రామంలో ఉన్న టాటా క్యాష్ ఏటీఎమ్‌ను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ టీవీ ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా, ఏటీఎమ్ నుంచి క్యాష్ దొంగలించారా? లేదా అన్న విషయాన్ని ఏటీఎమ్ అధికారులు తెలపాల్సి ఉంది.