breaking news
Aviation authorities
-
ఇంజన్ వైఫల్యమే!
దేశాన్ని దిగ్భ్రాంతికి లోను చేసిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ (వీటీ–ఏఎన్‌బీ) 171 విమాన ప్రమాదానికి ఇంజన్ వైఫల్యమే కారణమై ఉంటుందని వైమానిక రంగ నిపుణులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే పెను ప్రమాదాన్ని సూచిస్తూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు పైలట్ చేసిన మేడే కాల్లోనూ, ప్రమాద వీడియోల్లోనూ విమానం ఇంజన్ శబ్దం అసలు విన్పించమే లేదు. దాన్నిబట్టి విమానం అప్పటికే పూర్తిగా థ్రస్ట్ (ఎగిరేందుకు అవసరమైన వేగం) పూర్తిగా కోల్పోయిందని విశ్లేషిస్తున్నారు. పక్షులు ఢీకొట్టడం వంటివి ఇందుకు కారణం కావచ్చంటున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో పక్షుల బెడద ఎక్కువే. అయితే బోయింగ్‌లో అత్యాధునికమైన ఈ శ్రేణి విమానాల్లో రెండు అత్యంత శక్తిమంతమైన ఇంజన్లుంటాయి. ఒకటి అనుకోకుండా ఫెయిలైనా రెండో ఇంజన్ సాయంతో విమానం సునాయాసంగా ఎగరగలదు. దాన్ని బట్టి రెండు ఇంజన్లూ విఫలమై ఉంటాయని అనుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ 10 లక్షల ప్రయాణాలకు కేవలం ఒకసారి మాత్రమే అలా జరిగే ఆస్కారముంటుంది! ఇంధన కల్తీ, యాంత్రిక వైఫల్యం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు. కానీ బోయింగ్ 787లో వాడేది అత్యంత శక్తిమంతమైన జనరల్ మోటార్స్ కంపెనీ తాలూకు జీఈఎన్ఎక్స్ ఇంజన్లు. అవి అత్యంత విశ్వసనీయమైనవి. ఈ నేపథ్యంలో ప్రమాద కారణం పెద్ద పజిల్‌గా మారింది. బ్లాక్‌బాక్స్ డేటాను పూర్తిగా విశ్లేషించిన మీదటే దీనిపై స్పష్టత వస్తుందని నిపుణులు అంటున్నారు. వారి విశ్లేషణ ప్రకారం ప్రమాద కారణాలు ఏమై ఉండొచ్చంటే...టేకాఫ్ సెట్టింగుల్లో లోపంవిమానం టేకాఫ్ కాగానే లాండింగ్ గేర్ మూసుకోవాలి. సురక్షితమైన ఎత్తుకు చేరేదాకా రెండు ఫ్లాప్‌లూ (రెక్కల వెనక భాగం) విచ్చుకుని ఉండాలి. అప్పుడే విమానానికి ఎగిరేందుకు అవసరమైన శక్తి, ఊపు లభిస్తాయి. వీటన్నింటినీ టేకాఫ్ సెట్టింగులుగా పిలుస్తారు. ఇకగురువారం మధ్యాహ్నం ప్రమాద సమయంలో అహ్మదాబాద్‌లో ఏకంగా 43 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో వాయుసాంద్రత తక్కువగా ఉంది. అలాంటప్పుడు లాండింగ్ గేర్, ఫ్లాప్‌లు అత్యంత కచ్చితత్వంతో పని చేయడం చాలా కీలకం. కానీ ఏఐ171 విమానం గేర్ తెరుచుకునే ఉండగా ఫ్లాప్‌లు మూసుకుపోయాయి. ఇది పెను ప్రమాదానికి దారితీసే అసాధారణ పరిస్థితి. దీనివల్ల పైకెగిరేందుకు కావాల్సిన శక్తి సమకూరక విమానం అదుపు తప్పుతుంది. పైగా అవసరమైన థ్రస్ట్ లభించకుండానే పైలట్ టేకాఫ్‌కు ప్రయత్నించి ఉంటాడంటున్నారు. ఇలా ఫ్లాప్‌లు వెంటనే ముడుచుకుపోవడం వల్లే 2008లో స్పాన్‌ఎయిర్ విమానం కుప్పకూలింది.సరిపోని థ్రస్ట్ బోయింగ్ ఇంజన్లు శక్తిమంతమైనవే అయినా విమానం బరువు, రన్‌వే పొడవు, ఉష్ణోగ్రత తదితరాల ఆధారంగా టేకాఫ్‌కు నిర్దిష్ట థ్రస్ట్ సెటింగ్‌లు అవసరమవుతాయి. 43 డిగ్రీల ఎండ ఉన్నందున ఇంజన్ సామర్థ్యం సహజంగానే కాస్త తగ్గుతుంది. అలాంటప్పుడు టేకాఫ్‌కు మామూలు కంటే అధిక థ్రస్ట్ తప్పనిసరి. కానీ ఏఐ171 పైలట్ రొటేషన్ స్పీడ్‌ను పొరపాటుగా లెక్కించి తక్కువ థ్రస్ట్ ప్రయోగించి ఉండొచ్చు. 241 మంది ప్రయాణికులు, భారీ లగేజీ, ఏకంగా 1.25 లక్షల లీటర్ల ఇంధన బరువు దీనికి తోడై విమానం సజావుగా ఎగరలేకపోయి ఉంటుంది.లాండింగ్ గేర్ వైఫల్యంప్రమాద సమయంలో ఏఐ171 విమానం లాండింగ్ గేర్ తెరుచుకునే ఉంది. ఇది డ్రాగ్‌కు దారితీస్తుంది. దాంతో విమానం సజావుగా ఎగరలేదు. అందుకే టేకాఫ్ అయ్యాక క్షణాల్లోనే గేర్ మూసుకోవాల్సి ఉంటుంది. కానీ తొలుత దాదాపుగా మూసుకున్న ఏఐ171 లాండింగ్ గేర్ ఆ వెంటనే బయటికొస్తూ కన్పించింది. బహుశా విమానాన్ని పైకి తీసుకెళ్లేందుకు అవసరమైన థ్రస్ట్ లభించడం లేదని అర్థమై ఎమర్జెన్సీ లాండింగ్‌కు వీలుగా పైలట్ ఉద్దేశపూర్వకంగానే అలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తం ఉదంతంలో ఏదో ఒక దశలో పైలట్ లోపం కచ్చితంగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి లోపాలను సునాయాసంగా అధిగమించే అత్యాధునిక సాంకేతికత 787 సొంతం. ఇక్కడే పైలట్ మానవ తప్పిదం చోటుచేసుకుని ఉంటుందంటున్నారు.విద్రోహ కోణంఉగ్రవాదులో, దేశ వ్యతిరేక శక్తులో ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చేయడం. కానీ ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న సమాచారం,సాక్ష్యాలను బట్టి ఇందుకు అవకాశాలు తక్కువే.– సాక్షి, నేషనల్ డెస్క్ -
గాలిలో ప్రాణాలు
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో వైమానిక భద్రత మరోసారి చర్చనీయాంశమైంది. గత ఐదారేళ్లుగా అత్యంత ఘోరమైన ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది... టేకాఫ్ అయిన కాసేపటికే... గత ఐదేళ్లలో అత్యంత విషాదకరమైన, చర్చనీయమైన విమాన ప్రమాదం లయన్ ఎయిర్ ఫ్లైట్ 610. 2018 అక్టోబర్ 29న ఇండోనేసియాలోని జకార్తా నుంచి పాంగ్‌కల్ పినాంగ్‌కు బయలుదేరిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే జావా సముద్రంలో కూలిపోయింది. 189 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది చనిపోయారు. విమానంలోని ఆగ్మెంటేషన్ సిస్టమ్ (ఎంసీఏఎస్)లో లోపమే ప్రమాదానికి కారణమని తేలింది. బోయింగ్ విమానాల రూపకల్పన, ఏవియేషన్ రెగ్యులేటర్లు, ముఖ్యంగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్ (ఎఫ్ఏఏ) పర్యవేక్షణలో తీవ్ర లోపాలను ఈ దుర్ఘటన ఎత్తిచూపింది. ఐదు నెలలకే మరోటి... లయన్ ఎయిర్ ప్రమాదం జరిగిన ఐదు నెలలకే మరో బోయింగ్ 737 మ్యాక్స్ కూలిపోయింది. 2019 మార్చి 10న ఇథియోపియా ఎయిర్‌లైన్స్ విమానం 302 అడిస్ అబాబా నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 157 మంది చనిపోయారు. దీనికీ ఎంసీఏఎస్ వ్యవస్థే కారణమని తెలిసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన అధికారులు మాక్స్‌ను నిలిపివేశారు. బోయింగ్ చట్టపరమైన, ఆర్థికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంది. సముద్రంలో కూలిన విమానం... 2021 జనవరి 9న ఇండోనేషియాలోని జకార్తాలో విమాన ప్రమాదం జరిగింది. సోకర్నో–హట్టాలో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పాంటియానాక్కు బయలుదేరిన బోయింగ్ 737–500 విమానం సముద్రంలో కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సముద్రంలో కూలిపోవడంతో అందులో ఉన్న 62 మంది చనిపోయారు. ఇండోనేషియాలో ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఇది. యాంత్రిక వైఫల్యం, మానవ తప్పిదం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. విమానంలోని ఆటోథ్రోటిల్ సిస్టమ్‌లో లోపం వల్ల విమానం ఇంజన్లు అసమతుల్యం కావడంతో అదుపు తప్పి కూలిపోయింది. పైలట్ పరిస్థితికి తగిన విధంగా స్పందించడంలో విఫలమయ్యారని తేలింది. ఈ ప్రమాదం పాత విమానాల నిర్వహణలో అప్రమత్తతను, విమానాల అప్‌గ్రేడేషన్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పింది. యాంత్రిక వైఫల్యాలు తలెత్తినప్పుడు ప్రతిస్పందించడానికి విమానయాన సిబ్బంది అందరికీ శిక్షణ ఇవ్వాలని ఉద్ఘాటించింది.ఇళ్లపైనే కూలిన విమానం.. 2020 మే 22న పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఫ్లైట్ 8303, ఎయిర్‌బస్ ఎ 320 కరాచీలోని ఇళ్లపై కూలిపోయింది. లాహోర్ నుంచి బయలుదేరిన ఈ విమానంలో 99 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 41 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ల్యాండింగ్ సమయంలో పైలట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ల్యాండింగ్ గేర్‌లో తలెత్తిన సమస్యల కారణంగా విమానం రన్ వేపైకి దూసుకెళ్లడంతో ఇంజన్లు ధ్వంసమయ్యాయి. చివరకు అదుపు తప్పిన విమానం నివాస ప్రాంతంలోకి దూసుకెళ్లింది. పైలట్లుప్రామాణిక అత్యవసర విధానాలను పాటించలేదని విమానం బ్లాక్ బాక్స్ వెల్లడించింది. ఈ ప్రమాదం పైలట్ల శిక్షణ, నియంత్రణ పర్యవేక్షణలో లోతైన లోపాలను బహిర్గతం చేసింది. పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీలో శిక్షణ నాణ్యతపై విచారణకు దారితీసింది, రన్‌వే నుంచి జారి లోయలో పడి... గత ఐదేళ్లలో భారత్‌లో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం 1344ది. దుబాయ్ నుంచి వచి్చన ఈ విమానం 2020 ఆగస్టు 7న కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా కూలిపోయింది. ప్రయాణికులు, సిబ్బంది మొత్తం 165 మంది ఉండగా.. 21 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా రన్‌వే తడిసిపోయి ఉంది. ఇక్కడ రన్‌వే పొడవు కూడా తక్కువగా ఉండటంతో ల్యాండ్ అయిన విమానం జారి లోయలో పడిపోయింది. వాతావరణ పరిస్థితులు, మానవ తప్పిదం, రన్ వే మౌలిక సదుపాయాల సరిగా లేకపోవడం వల్ల జరిగిందని దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదం తరువాత దేశంలోని విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను సమీక్షించారు. రన్‌వే నుంచి జారి..నేపాన్‌లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పొఖారాకు బయల్దేరిన విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో సిబ్బందితో సహా 19 మంది ఉన్నారు. 18 మంది మృతి చెందగా, పైలట్ కెపె్టన్ ఎంఆర్ షాక్యా తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. రన్‌వే దక్షిణం వైపు నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా, రెక్కల కొన భూమిని తాకడంతో ఒక్కసారిగా పలీ్టలు కొట్టింది. దీంతో వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి.మంచు కారణంగా... ఈ సంవత్సరం బ్రెజిల్ విమానయాన సంస్థకు చెందిన వోపాస్ 2283, ఏటీఆర్ 72 ట్విన్ఇంజన్ టర్బోప్రాప్ ఆగస్టు 9న కూలిపోయింది. 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సావోపాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన విమానం.. సావోపావో సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారంతా మరణించారు. విమాన ప్రమాదానికి మంచు కారణమని తేలింది. పండుగ రోజున ప్రమాదం.. ఇటీవలే.. క్రిస్మస్ పర్వదినాన అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి ప్రమాదం జరిగింది. అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బాకు నుంచి రష్యాలోని గ్రోజీ్నకి వెళ్తుండగా కాస్పియన్ సముద్ర సమీపంలో కూలిపోయింది. విమానంలో 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉండగా 38 మంది మరణించారు. ఉక్రెయిన్ వరుస డ్రోన్ దాడులను తిప్పికొడుతున్న రష్యా వైమానిక రక్షణ దళాలు విమానాన్ని కూలి్చవేశాయని రష్యా అంగీకరించింది. దాడి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్ క్షమాపణ చెప్పారు. వీడని మిస్టరీ.. చైనాలో జరిగిన అత్యంత విషాద ఘటనల్లో ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎంయూ 5735 కుప్పకూలడం ఒకటి. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737–800.. 2022 మార్చి 21న దక్షిణ చైనాలోని పర్వతాల్లో కూలిపోయింది. ప్రయాణికులు, సిబ్బంది సహా విమానంలో ఉన్న 132 మంది మరణించారు. విమానం ఎత్తునుంచి కిందికి దించే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తాత్కాలిక దర్యాప్తులో తేల్చారు. విమానం వేగంగా, ఉద్దేశపూర్వకంగా ల్యాండ్ చేసినట్లు బ్లాక్ బాక్స్ డేటా వెల్లడించింది. ఈ ప్రమాదం యాంత్రిక వైఫల్యమా, మానవ తప్పిదమా అనే విషయంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఈ విపత్తుకు అసలు కారణం మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కజకిస్థాన్‌లో విమాన ప్రమాదం
అల్మేటీ: కజకిస్తాన్‌లో శుక్రవారం జరిగిన ఒక విమాన ప్రమాదంలో 12 మంది మరణించారు. దేశంలోని అతిపెద్ద నగరం అల్మేటీ నుంచి ఉదయం ఏడు గంటల ప్రాంతంలో సుమారు వంద మందితో టేకాఫ్ తీసుకున్న విమానం ఆ తరువాత కొద్దిసేపటికే కూలిపోయింది. బెక్ ఎయిర్ అనే విమానయాన సంస్థకు చెందిన ఈ విమానం రాజధాని నూర్ సుల్తాన్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే టేకాఫ్ తరువాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే విమానం రాడార్‌లో కనిపించకుండా పోయిందని, అల్మేటీ సరిహద్దుల్లోని ఓ రెండంతస్తుల భవనంపై కూలిపోయిందని విమానాశ్రయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విమానం కూలిపోయిన ధాటికి విమానం రెండు ముక్కలైందని, ప్రాణాలతో ఉన్న వారిని శకలాల నుంచి వెలికి తీసేందుకు సహాయక బృందాలు పనిచేస్తున్నాయని వివరించింది. విమానంలో మొత్తం 95 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉండగా కెప్టెన్‌తోపాటు 11 మంది మరణించినట్లు ఆ ప్రకటన వివరించింది. ఈ దుర్ఘటనలో 53 మంది గాయపడ్డారని, వీరిలో తొమ్మిది మంది పిల్లలూ ఉన్నారని తెలిపింది, ఘటనపై విచారణ జరపడంతోపాటు, బెక్ ఎయిర్ సంస్థ వాడుతున్న ఫొక్కర్ మోడల్ విమానాలపై కజకిస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. విమానం టేకాఫ్ తీసుకునే సమయంలోనే దాని తోకభాగం రన్‌వేను రెండుసార్లు తాకిందని, ఇది పైలట్ తప్పిదమా? లేదా సాంకేతికపరమైన సమస్య? అన్నది తేల్చాల్సి ఉందని ఉప ప్రధాని స్కైలార్ చెప్పారు. -
రావణుడే తొలి వైమానికుడు
కొలంబో: చరిత్రలో మొట్టమొదటి వైమానికుడు రావణాసురుడేనట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు 5వేల ఏళ్ల క్రితమే రావణాసురుడు విమానంలో గగనతలంలో విహరించాడని.. రానున్ను ఐదేళ్లలో ఈ విషయాన్ని సాంకేతికంగా నిరూపిస్తామని అంటున్నారు శ్రీలంక వైమానిక అధికారులు. ఈ విషయం గురించి శ్రీలంక సివిల్ ఏవియేషన్ అథారిటీ వైస్ చైర్మన్ శశి దానతుంగే న్యూస్18తో ఫోన్లో మాట్లాడారు. ‘చరిత్రలో విమానాన్ని ఉపయోగించి గగనతలంలో విహరించిన తొలి వైమానికుడు రావణుడే. పురాణాల ఆధారంగా ఈ విషయం చెప్పడం లేదు. ఈ విషయంలో పూర్తి స్థాయి పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. వచ్చే ఐదేళ్లలో ఈ విషయాన్ని సాంకేతికంగా నిరూపిస్తాం’ అన్నారు. కటునాయకేలో ఉన్న బండారునాయకే విమానాశ్రయంలో బుధవారం శ్రీలంక పౌర విమానయాన నిపుణులు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. దాదాపు 5,000 సంవత్సరాల క్రితమే రావణుడు శ్రీలంక నుంచి నేటి భారతదేశానికి వెళ్లి తిరిగి వచ్చాడని ఈ సమావేశం తేల్చింది. రానున్న ఐదేళ్లలో ఈ విషయాన్ని సాంకేతికంగా నిరూపించాలని నిర్ణయించింది. అంతేకాక శ్రీలంకలో రావణుడిని గొప్ప రాజుగా.. దయ గల మనిషిగా చెప్పుకుంటారు. సీతా దేవిని అపహరించాడు, రాక్షసుడు అనే అంశాన్ని అక్కడి ప్రజలు ఒప్పుకోరు. అది కేవలం భారతీయుల వాదనగా కొట్టి పారేస్తారు. కొద్ది రోజుల క్రితం శ్రీలంక అంతరిక్షంలోకి పంపిన ఓ ఉగప్రహానికి రావణ అనే పేరు పెట్టింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఆ దేశ ప్రజలు రావణుడికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో. -
సంక్రాంతి కానుక... గగన విహారం
నేటి నుంచి మళ్లీ హెలీ టూరిజం 17వ తేదీ వరకు అవకాశం హైదరాబాద్: నగరవాసులకు సంక్రాంతి కానుకగా టూరిజం శాఖ అధికారులు హెలీ టూరిజాన్ని మళ్లీ పునరుద్ధరించారు. హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డు, సాగర్ మధ్యలో ఉండే తథాగతుడిని వీక్షించి అక్కడికి కాస్త దూరంలో ఉండే బిర్లా మందిర్, శాసనసభా ప్రాంగణం, చార్మినార్, మక్కా మసీదు, గోల్కొండ కోట పరిస రాలు... హైటెక్ సిటీ, సైబరాబాద్‌లోని ఐటీ భవనాలన్నింటినీ నిమిషాల్లో వీక్షించాలను కునేవారికి ఇదో అవకాశం. గత ఏడాది మార్చి ఒకటిన నెక్లెస్ రోడ్డు, జలవిహార్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతం లో హెలీటూరిజం కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. కొంతకాలం నడిచాక ఉపరాష్ట్ర పతి నగరానికి వచ్చిన నేపథ్యంలో గగనతల ఆంక్షలు విధించి, ఏవియేషన్ అధికారులు అనుమతులు నిరాకరించారు. దానికితోడు బుకింగ్ పొరపాట్ల కారణంగా పర్యాటకులు ఆసక్తి చూపకపోవటంతో గగన విహారానికి బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ఈసారి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగానే ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ అనుమతులను పొందారు. టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం తుంబే ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని ఒప్పించి హెలీటూరిజం ప్రారంభమయ్యేలా చేశారు. ఐదురోజులే ఈ అవకాశం... ఈ హెలీ టూరిజాన్ని ఐదురోజులకే పరి మితం చేశారు. 13 నుంచి 17 వరకు సాగు తుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు హెలీకాప్టర్ తిరుగు తుంది. ఒక్కొక్కరికి రూ.3,500 టికెట్ ధర చెల్లించాలి. నలుగురు కుటుంబసభ్యులు కలసి వస్తే ఒక్కొక్కరికి రూ.3 వేలు, 12 మంది కుటుంబసభ్యులు కలసి వస్తే ఒక్కొక్కరికి రూ. 2,500 చెల్లించాలి. మేరా ఈవెంట్స్ డాట్ కామ్‌లో బుకింగ్ చేసుకోవాలి.