breaking news
Average Student Nani
-
‘యావరేజ్ స్టూడెంట్ నాని’ మూవీ రివ్యూ
టైటిల్: యావరేజ్ స్టూడెంట్ నానినటీనటులు: పవన్ కుమార్ కొత్తూరి, స్నేహ మాల్వియ, సాహిబా భాసిన్, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి, తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ LLPనిర్మాతలు: పవన్ కుమార్ కొత్తూరి, బిషాలి గోయెల్రచయిత, దర్శకుడు: పవన్ కుమార్ కొత్తూరిసంగీతం: కార్తీక్ బి కొడకండ్లసినిమాటోగ్రఫీ: సజీష్ రాజేంద్రన్విడుదల తేది: ఆగస్ట్ 2, 2024‘యావరేజ్ స్టూడెంట్ నాని’ కథేంటంటే..నాని(పవన్ కుమార్) ఓ యావరేజ్ స్టూడెంట్. అమ్మనాన్నలు(ఝాన్సీ, రాజీవ్ కనకాల) తిడుతూ ఉన్నా.. అమ్మాయిలను ఫ్లట్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. అక్క(వివియా సంపత్) సహాయంతో మంచి ర్యాంక్ రాకపోయినా బీటెక్‌లో జాయిన్ అవుతాడు. కాలేజీలో తన సీనియర్ సారా(స్నేహ మాల్వియా)తో ప్రేమలో పడతాడు. జూనియర్ అను(సాహిబా భాసిన్) నానిని ఇష్టపడుతుంది. కొన్ని కారణాల వల్ల సారా అదే కాలేజీకి చెందిన ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది. నాని ఈ బాధలో ఉండగానే..కోమాలో ఉన్న తన అక్క తనకోసం చేసిన త్యాగం గురించి తెలుస్తుంది. తనవల్ల ఎవరికి ఉపయోగం లేదని భావించిన నాని.. ఓ సంచలన నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? నానిని ప్రాణంగా ప్రేమించిన సారా..మరో వ్యక్తితో ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది? నాని-సారాల లవ్‌స్టోరీ గురించి తెలిసిన తర్వాత కూడా అను నానితో ఎలా ప్రేమలో పడింది? యావరేజ్ స్టూడెంట్ అయినా నాని.. చివరకు అందరితో శభాష్ అనిపించుకోవడమే కాకుండా.. అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగాన్ని ఎలా సంపాదించగలిగాడు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. హీరో యావరేజ్ స్టూడెంట్. అల్లరి చిల్లరగా తిరుగుతూ..చివరకు ఓ మంచి పని చేసి అందరితో శభాష్ అనిపించుకుంటాడు.. ఇలాంటి యూత్‌ఫుల్ లవ్‌స్టోరీతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. యావరేజ్ స్టూడెంట్ నాని కథ కూడా ఇదే. అయితే యూత్‌కి ఆకట్టుకునే విధంగా బోల్డ్, గ్లామర్ అంశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు పవన్ కొత్తూరి. దర్శకుడు రాసుకున్న పాయింట్ పాతదే అయినా.. దాన్ని తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ప్రయత్నంలో మాత్రం పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. కేవలం రొమాంటిక్ సీన్లతో కథనాన్ని నడిపించే ప్రయత్నం చేశాడు. ఫాదర్-సన్ రిలేషన్, సిస్టర్ సెంటిమెంట్ ఉన్నా.. బోల్డ్ సీన్ల కారణంగా వాటికి ప్రేక్షకుడు కనెక్ట్ కాలేకపోయాడు. అయితే యూత్ మాత్రం కొన్ని సీన్లను బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్టాఫ్ అంతా నాని కాలేజీ లైఫ్.. సారాతో ప్రేమాయణంతో ఎంటర్టైనింగ్గా సాగుతుంది. సెకండాఫ్‌లో కాలేజీ సీన్లు బోర్ కొటించినా.. పాదర్-సన్ సెంటిమెంట్ సీన్లు ఆకట్టుకుంటాయి. చివరిలో ఇద్దరు హీరోయిన్లతో కలిసి వచ్చే పాట ఈళలు వేయిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. కథనం బోల్డ్‌గా సాగినా.. అంతర్లీనంగా ఓ మంచి సందేశాన్ని అందించారు. బోల్డ్ సీన్స్ అత్యధికంగా ఉండడం కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇబ్బందిగా అనిపించినా..యూత్ మాత్రం ఎంజాయ్ చేస్తుంది.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ-నిర్మాణ బాధ్యతలు కూడా పవన్ కుమారే తీసుకున్నాడు. తను రాసుకున్నదే కాబట్టి నాని పాత్రలో పవన్ ఒదిగిపోయాడు. కామెడీ కూడా బాగా పండించాడు. ఎమోషన్ సీన్లలో చక్కగా నటించాడు. హీరోయిన్స్ సాహిబా భాసిన్, స్నేహ మాల్వియల నటనకు పెద్దగా స్కోప్ లేదు కానీ..తెరపై అందంగా కనిపించ్ ఎంటర్టైన్ చేశారు. తల్లి పాత్రలో ఝాన్సీ, తండ్రి పాత్రలో రాజీవ్ కనకాల బాగా నటించారు. హీరో అక్క పాత్రలో వివియా సంపత్ పర్వాలేదనిపించింది. మిగిలిన నటీనటులు కూడా ఓకే అనిపిస్తారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. చివర్లో ఇద్దరు హీరోయిన్లతో కలిసి వచ్చే మాస్ సాంగ్‌తో పాటు ఓ ఎమోషనల్ సాంగ్ కూడా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.- రేటింగ్: 2.5/5 -
ఆకట్టుకుంటున్న మాస్ సాంగ్ ‘రాలే పువ్వే’
‘మెరిసే మెరిసే’ఫేం పవన్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కాబోతోంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్లోకి రానుంది.ఆల్రెడీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పీక్స్‌కు చేరుకున్నాయి. వరుసగా కంటెంట్‌ను రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు. ఇప్పటికే పాటలు, టీజర్, పోస్టర్ అంటూ బజ్ క్రియేట్ చేశారు. తాజాగా మంచి మాస్ అండ్ ఎనర్జిటిక్ బీట్ ఉన్న పాటను విడుదల చేశారు.రాలే పువ్వే అంటూ సాగే పాటను తాజాగా రిలీజ్ చేశారు. కార్తీక్ బి కొడకండ్ల అందించిన క్యాచీ ట్యూన్.. భువనేశ్వర్ రాగిఫణి సాహిత్యం.. లక్ష్మీ శ్రావణి, కార్తీక్ బి కొడకండ్ల గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. రాజ్ పైడి మాస్టర్ స్టెప్పులు కుర్రకారును కట్టిపడేసేలా ఉన్నాయి. -
Average Student Nani: ఆకట్టుకుంటున్న టీజర్
పవన్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. . శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కాబోతోంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. ఆల్రెడీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. మోస్ట్ రొమాంటిక్‌గా సాగిన ఈ టీజర్ యూత్ ఆడియెన్స్‌ను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.‘మనం ఆర్డినరీ అయినా మనం ట్రై చేసే అమ్మాయి ఎక్స్ట్రార్డినరీగా ఉండాలి’,, ‘కాలేజ్‌లో ఉన్నంత వరకే స్టూడెంట్ నాని.. ఆ తరువాత కూకట్ పల్లి నాని’ అంటూ సాగే డైలాగ్స్‌తో యావరేజ్ స్టూడెంట్ నాని మోస్ట్ రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా సాగింది. ఈ టీజర్లో యూత్‌కి కావాల్సిన ప్రతీ అంశం ఉంది. రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని యాంగిల్స్‌ను టచ్ చేస్తూ టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ఈ టీజర్లో విజువల్స్, ఆర్ఆర్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. -
Average Student Nani: ఆకట్టుకుంటున్న రొమాంటిక్ మెలోడీ
‘మెరిసే మెరిసే’సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కుమార్ కొత్తూరి ఇప్పుడు హీరోగా మారాడు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'యావరేజ్ స్టూడెంట్ నాని'. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కాబోతోంది. ఆల్రెడీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. గతంలో విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సింగిల్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ లోనే తన ఎక్స్ ప్రెషన్స్, పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు పవన్ కుమార్. ఈ రోజు సెకండ్ సింగిల్ ‘ఏమైందో మనసే’ అనే పాటను రిలీజ్ చేశారు.పూర్తి రొమాంటిక్ మోడ్‌లో సాగే ఈ మెలోడీ పాటకు కార్తీక్ బి కొడకండ్ల మంచి బాణీని అందించారు. శక్తి శ్రీ గోపాలన్ గానం వినసొంపుగా ఉంది. కృష్ణవేణి మల్లవజ్జల సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది.