breaking news
Assembly Speaker kodela Shivaprasad
-
ఈ పక్షపాతం స్పీకర్‌కు తగునా?
ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్ అసెంబ్లీ సమావేశాలకు ముగింపు పలుకుతూ సీఎం బాబు వచ్చే శాసనసభలో తిరిగి తన స్థానంలో కూర్చోవాలని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఉండవలసిన స్పీకర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అధికారపార్టీ అధినేతకు అనుకూలంగా ఇలాంటి ప్రకటనలు చేయడం గర్హనీయం. టీడీపీకి వీర విధేయతను తెల పడం కోసం, ప్రత్యేక హోదాపై చంద్రబాబు చేపట్టిన (అ)ధర్మ పోరాట దీక్షలో స్పీకర్ పాల్గొన్నారు. దీంతో సామాన్య ప్రజలు కూడా స్పీకర్ తన పదవిని దుర్వినియోగ పరుస్తున్నారని అర్థం చేసుకుంటున్నారు. గతంలో ప్రధాన ప్రతిపక్షాన్ని కించపరిచేలా అధికార పార్టీ సభ్యులు నిందావ్యాఖ్యలు చేస్తున్నా సభాపతి కనీసం అడ్డుకోలేదు. ప్రతిపక్ష నాయకుడిని అనరాని మాటలతో అవమానిస్తున్నా సభా మర్యాదకయినా మందలించిన పాపాన పోలేదు. ప్రతిపక్ష నేత ప్రసంగించినప్పుడు మైకును పలుమార్లు కట్ చేశారు. కానీ, అధికారపార్టీ సభ్యులు ప్రతిపక్ష నేతను అరుపులు కేకలతో అడ్డుకున్నప్పుడు కూడా స్పీకర్ స్పందించలేదు. అదే సమయంలో ప్రతిపక్ష సభ్యురాలు రోజా అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణకు స్పీకర్ విలువనిచ్చి ఏడాదిపాటు సభలోకి అనుమతించలేదు. టీడీడీకి చెందిన పద్మావతి గెస్ట్ హౌస్‌లో స్పీకర్ కోడెల నిర్వహించిన సమావేశంలో మాజీ శాసన సభాపతి ఆగరాల ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజాను సంవత్సర కాలం సభ నుంచి బహిష్కరించడం ఏమాత్రం మంచి సంప్రదాయం కాదని చెప్పారు. సభ్యులు తమ నియోజకవర్గ విషయాలతోపాటు రాష్ట్ర సమస్యలను సభ దృష్టికి తేవడానికి అవకాశం కల్పించాలి తప్ప సభలోకే రాకుండా అడ్డుకోవడం అప్రజా స్వామ్యమని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ 22 మంది ప్రతిపక్ష శాసన సభ్యులను ప్రలోభపెట్టి అధికార పార్టీలోకి చేర్చుకుని ఏళ్లు గడిచిపోయాయి. ఫిరాయింపు శాసన సభ్యుల సభ్యత్వం రద్దు చేయాలనీ ఎన్నిమార్లు స్పీకర్‌కు విన్నవించినా బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఏకపక్షంగా అధికార పార్టీకి వంతపాడుతున్న స్పీకర్ కోడెల నడిపించిన తీరుతో ప్రతిపక్ష సభ్యులు విసిగిపోయి శాసనసభ సమావేశాలను బహిష్కరించారు. స్పీకర్‌గా కోడెల సభను నిర్వహించిన తీరు సమంజసం కాదు. -జయరామిరెడ్డి, తిరుపతి మొబైల్ : 79816 76509 -
ప్రజాభీష్టం మేరకు పనిచేయండి
సభ సంప్రదాయాలను మంటగలపొద్దు చట్టసభల సభ్యులుగానే కాకుండా నాయకులుగా ఎదగండి ఎమ్మెల్యేలకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఉద్బోధ హైదరాబాద్: ప్రజాభీష్టానికి అనుగుణంగా పని చేసి నాయకులుగా ఎదగాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కొత్త ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉద్బోధించారు. కొత్త సభ్యుల శిక్షణా రెండో రోజు కా ర్యక్రమంలో శనివారం ఆమె కీలకోపన్యాసం చేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌లు పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటేనే నాయకులవుతారని, గొప్పగా ఉండటం, గొప్పగా కనిపించడంలో వ్యత్యాసాన్ని తెలిసి మసలుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులుగా మీరు పొందుతున్న దానికంటే ప్రజలకు ఎక్కువ అందించగలగాలి. అప్పుడే గొప్ప నాయకులవుతారు. సవాళ్లకు సామరస్య పూర్వక పరిష్కారాలు చూపించడం చట్ట సభల బాధ్యత. ఆ సభల్లో సభ్యులుగా మీ ఆలోచనలు, ప్రవర్తన, ఆలోచనా వి ధానం అందుకు అనుగుణంగా ఉండాలి. సభా సంప్రదాయాలను గౌరవించాలి. చర్చలు అర్థవంతంగా జరగడానికి సభ్యులు తమ వంతు సహకారం అందించాలి. సంప్రదాయాలను గౌరవిస్తే.. ప్రజల గొంతుక వినిపించే అవకాశం తప్పకుండా వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రత్యేక స్థానం ఉంది. వారిని కూడా ప్రజలే ఎన్నుకున్నారనే విషయాన్ని అధికారపక్షం మరిచిపోకూడదు. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చినప్పుడే అధికార పక్షానికి గౌరవం దక్కుతుంది. పార్లమెంటరీ వ్యవస్థలో కమిటీలు కీలకం : కేంద్ర మంత్రి నజ్మా హెఫ్తుల్లా పార్లమెంటరీ వ్యవస్థలో వివిధ కమిటీల పాత్రను కేం ద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి నజ్మా హెఫ్తుల్లా వివరించారు. కమిటీల్లో ప్రతిపక్షాల సభ్యులే కీలక పాత్ర పోషిస్తారని, ప్రజాస్వామ్యంలో అధికారపక్షంతో పాటు ప్రతిపక్షానికి కీలక బాధ్యత ఉంటుందన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సభ్యులు అభిప్రాయాలు వెల్లడించడానికి, మెరుగైన విధానాల రూపకల్పనకు కమిటీలు ఉపయోగపడతాయని చెప్పారు. హాజరుకాని అరుణ్‌జైట్లీ రెండో రోజు శిక్షణా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ హాజరు కావాల్సి ఉన్నా.. ఆయన రాలేదు. శాసనమండలి చైర్మన్, కొంత మంది మంత్రులు కార్యక్రమంలో మాట్లాడాల్సి ఉన్నా.. వారికి అవకాశం ఇవ్వలేదు. భోజనానంతరం కూడా కొనసాగాల్సిన శిక్షణ కార్యక్రమం.. భోజన విరామం కంటే గంట ముందుగానే ముగిసింది.