breaking news
Army Recruitment Center
-
నేటి నుంచి ఖమ్మంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
ఖమ్మం స్పోర్ట్స్: సైన్యంలో నియామకాల కోసం అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ శుక్రవారం నుంచి ఖమ్మం జిల్లాకేంద్రంలో జరగనుంది. సర్దార్ పటేల్ స్టేడియంలో ఎనిమిది రోజులపాటు సాగే ర్యాలీలో రాష్ట్రవ్యాప్తంగా రాతపరీక్షలో అర్హత సాధించిన 7,397 మంది అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇందుకోసం స్టేడియంలో చేసిన ఏర్పాట్లను కలెక్టర్ వీపీ గౌతమ్, కల్నల్ కీట్స్దాస్ గురువారం పర్యవేక్షించారు. మొదటిదశ పరీక్షలో ఉత్తీర్హులైనవారు అడ్మిట్ కార్డుతోపాటు కావాల్సిన సరి్టఫికెట్లు తీసుకుని నిర్ణీత తేదీలోనే రావాలని సూచించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం ఖమ్మం రైల్వేస్టేషన్, బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. -
యెమెన్‌లో ఆత్మాహుతి దాడి
45 మంది బలి సనా: యెమెన్‌లోని ఆడెన్ నగరంలో సోమవారం ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు జరిపిన పేలుళ్లలో 45 మంది మరణించారు. ఆర్మీలో చేరడానికి వచ్చిన యువకులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఆర్మీ రిక్రూట్మెంట్ సెంటర్ బయట పేలిన కారు బాంబులో 20 మంది, రిక్రూట్మెంట్కు వచ్చిన వారు వేచి ఉండే చోట జరిగిన మరో పేలుడులో 25 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.