breaking news
Argentine star
-
డెల్‌పోట్రో సంచలనం
వింబుల్డన్ ప్రిక్వార్టర్స్ నాలుగోసీడ్ వావ్రింకాపై గెలుపు వింబుల్డన్ ప్రిక్వార్టర్స్‌లో వీనస్, నవారో రెండోరౌండ్లో పేస్, బోపన్న జోడీలు లండన్: మూడుసార్లు మణికట్టుకు శస్త్రచికిత్స చేయించుకున్నా తన రాకెట్లో పవర్ తగ్గలేదని అర్జెంటీనా స్టార్ ఆటగాడు యువాన్ మార్టిన్ డెల్‌పోట్రో నిరూపించాడు. గత రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉన్నా... వింబుల్డన్‌లో అంచనాలకు మించి రాణించాడు. భారీ సర్వీస్‌లతో పాటు కోర్టులో చురుకుగా కదులుతూ నాలుగు సెట్ల పోరాటంలో నాలుగోసీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్)కు షాకిచ్చాడు. దీంతో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో ప్రపంచ 165వ ర్యాంకర్ డెల్‌పోట్రో 3-6, 6-3, 7-6 (7/2), 6-3తో వావ్రింకాను ఓడించి మూడోరౌండ్లోకి అడుగుపెట్టాడు. ఐదో రోజు వర్షం వల్ల మ్యాచ్‌లకు అంతరాయం కలిగింది. వావ్రింకాతో రెండు గంటలా 44 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... డెల్‌పోట్రో పాయింట్ల కోసం తీవ్రంగా పోరాడాడు. వావ్రింకా 15 ఏస్‌లు, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేయగా, డెల్‌పోట్రో 9 ఏస్‌లు 4 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. అయితే 47 విన్నర్లు సంధించిన స్విస్ ప్లేయర్ 48 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఐదు బ్రేక్ పాయింట్లలో మూడిం టిని మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. కానీ డెల్‌పోట్రో తన సర్వీస్‌లో అత్యధిక పాయింట్లు నెగ్గడంతో పాటు కీలక సమయంలో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి మ్యాచ్‌ను చేజిక్కించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో 10వ సీడ్ బెర్డిచ్ (చెక్) 6-4, 6-1, 6-2తో బెకర్ (జర్మనీ)పై; 12వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) 6-1, 6-4, 6-3తో యువాన్ మొనాకో (అర్జెంటీనా)పై; 32వ సీడ్ పౌలీ (ఫ్రాన్స్) 6-4, 6-3, 6-3తో యంగ్ (అమెరికా)పై గెలిచి తదుపరి రౌండ్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్స్‌లో వీనస్: మహిళల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా), సూరెజ్ నవారో (స్పెయిన్) ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మూడోరౌండ్లో వీనస్ 7-5, 4-6, 10-8తో కస్తాకినా (రష్యా)పై; నవారో 6-2, 6-2తో ఎరకోవిచ్ (న్యూజిలాండ్)పై గెలిచారు. ఇతర రెండోరౌండ్ మ్యాచ్‌ల్లో పావులెంచెకోవా (రష్యా) 7-5, 6-1తో పుటినెత్సోవా (కజకిస్తాన్)పై; 24వ సీడ్ స్ట్రయికోవా (చెక్) 6-4, 6-0తో రొడినా (అమెరికా)పై; బీక్ (జర్మనీ) 6-2, 6-1తో సన్స్నోవిచ్ (బెలారస్)పై నెగ్గి మూడోరౌండ్లోకి అడుగుపెట్టారు. మూడో రౌండ్లో సెరెనా: మహిళల సింగిల్స్ రెండోరౌండ్లో టాప్‌సీడ్ సెరెనా (అమెరికా) 6-7 (7/9), 6-2, 6-4తో మెక్‌హాలే (అమెరికా)పై చెమటోడ్చి నెగ్గి మూడోరౌండ్లోకి ప్రవేశించింది. బోపన్న, పేస్ జోడీల శుభారంభం భారత డబుల్స్ ప్లేయర్లు రోహన్ బోపన్న, లియాండర్ పేస్లు తమ భాగస్వాములతో కలిసి వింబుల్డన్‌లో శుభారంభం చేశారు. పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో ఆరోసీడ్ బోపన్న-ఫ్లోరిన్ మెర్జి (రొమేనియా) 7-5, 7-6 (8-6)తో అన్‌సీడెడ్ మారిన్ డ్రాంగ్జా- నికోలా మెక్టిక్ (క్రొయేషియా)పై; పేస్-మత్కోవాస్కీ (పోలాండ్) 6-1, 6-3తో హు లూ (తైపీ)-టిప్సరెవిచ్ (సెర్బియా)పై నెగ్గి రెండోరౌండ్లోకి ప్రవేశించారు. డ్రాంగ్జా-మెక్టిక్‌తో జరిగిన 80 నిమిషాల పోరులో బోపన్న ద్వయం స్థాయికి తగిన ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలిసెట్లో 11వ గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన బోపన్న ద్వయం తర్వాతి గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకుని సెట్‌ను చేజిక్కించుకుంది. రెండోసెట్లో రెండు జోడీలు సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో స్కోరు 6-6తో సమమైంది. ఈ దశలో బోపన్న-మెర్జి వరుసగా రెండు గేమ్‌లు గెలిచి సెట్, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. -
ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాం
ఫిఫా వరల్డ్ కప్ సాధించడానికి తాము ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నామని చెబుతున్నాడు అర్జెంటీనా స్టార్ స్ట్రైకర్ లియోనెల్ మెస్సీ. సెమీఫైనల్ మ్యాచ్‌లో తాము నెదర్లాండ్స్ జట్టుపై పెనాల్టీ షూటవుట్‌లో 4-2 తేడాతో గెలిచిన విజయాన్ని అదేరోజు రోడ్డు ప్రమాదంలో మరణించిన స్పోర్ట్స్ జర్నలిస్టు జార్జి టోపో లోపెజ్కు మెస్సీ అంకితమిచ్చాడు. ''అర్జెంటీనా టీమ్‌లో సభ్యుడినైనందుకు చాలా గర్వంగా ఉంది, అద్భుతమైన ఆట ఆడారు. ఎలాగైతే మనమంతా కలిసి ఫైనల్లోకి వెళ్లిపోయాం. దాన్ని కూడా ఎంజాయ్ చేద్దాం. మనం కేవలం ఒక్క చిన్న అడుగు దూరంలోనే ఉన్నాం'' అని తన ఫేస్బుక్ పేజీలో మెస్సీ పోస్ట్ చేశాడు. ఇక జర్నలిస్టు లోపెజ్ బుధవారం నాడు మ్యాచ్ అయిపోయిన తర్వాత కారులో హోటల్‌కు వెళ్తుండగా, పోలీసుల నుంచి పారిపోతున్న దొంగల కారు ఈయనను ఢీకొనడంతో మరణించారు. ఆయనకు మెస్సీ ఘనంగా నివాళులు అర్పించాడు. ఇక అర్జెంటీనాకు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా కూడా ఫైనల్ మ్యాచ్‌కి ముందు జట్టుతోపాటే వాళ్లు ఉంటున్న హోటల్లోనే ఉంటానని చెప్పాడు. దీనివల్ల తమ జట్టుకు నైతిక బలం వస్తుందని, అలాగే వ్యూహాల విషయంలో కూడా కాస్త ముందంజలో ఉండే అవకాశం ఉంటుందని మారడోనా భావిస్తున్నట్లు సమాచారం.