breaking news
apparel store
-
తక్కువ ధరలతో రిలయన్స్ కొత్త ఫ్యాషన్ బ్రాండ్.. తొలి స్టోర్ హైదరాబాద్‌లోనే..
రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ ( Reliance Retail Ltd ) వ్యాల్యూ అపరెల్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇప్పటికే ప్రసిద్ధి చెందిన టాటా జూడియో ( Tata Zudio ) చైన్, ల్యాండ్‌మార్క్ గ్రూప్ యాజమాన్యంలోని మ్యాక్స్, షాపర్స్ స్టాప్‌కు చెందిన ఇక్ ట్యూన్‌కి పోటీగా కొత్త బ్రాండ్ యూస్టా ( Yousta )ని ప్రారంభించింది. అన్ని ఉత్పత్తులు రూ. 999 లోపే సమకాలీన టెక్-ఎనేబుల్డ్ స్టోర్ లేఅవుట్లతో, యువ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సరసమైన ధరలకు యూస్టా హై ఫ్యాషన్ ఉత్పత్తులను అందిజేస్తుందని కంపెనీ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్టోర్‌లో అన్ని ఉత్పత్తులు రూ. 999 కంటే తక్కువ ధరకే లభిస్తాయి. అందులోనూ ఎక్కువ భాగం రూ. 499 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంచడం విశేషం. హైదరాబాద్‌లో తొలి స్టోర్ రిలయన్స్ యూస్టా తమ తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్లో ప్రారంభించింది. యూస్టా స్టోర్లను అనేక టెక్ టచ్ పాయింట్లను అమర్చారు. క్యూఆర్ స్క్రీన్లు, సెల్ఫ్-చెక్అవుట్ కౌంటర్లు, కాంప్లిమెంటరీ వైఫై, ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ యూస్టా ఉత్పత్తులను అజియో ( Ajio ), జియో మార్ట్ ( JioMart ) ద్వారా కూడా ఆన్లైన్లో యాక్సెస్ చేయవచ్చు. -
వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండల కేంద్రంలోని ఓ వస్త్ర దుకాణంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బస్టాండ్ వద్దనున్న శిరీష స్కూల్ బ్యాగులు, వస్త్ర దుకాణం నుంచి మంటలు వస్తుండడంతో స్థానికులు అగ్ని మాపక విభాగానికి సమాచారం అందించారు. వారొచ్చి మంటలను ఆర్పివేశారు. రెండంతస్తుల భవనంలో కింద షాపు ఉండగా, పైన యజమానులు నివసిస్తున్నారు. అయితే, అగ్ని ప్రమాదానికి భవనం మొత్తం దగ్ధం కాగా, పై అంతస్తులో ఉన్న యజమాని కుటుంబ సభ్యులు నలుగురు స్నానాల గది ద్వారా బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు. షాపులో ఉన్న రూ.7 లక్షల సరుకు బూడిదైనట్టు అంచనా. అలాగే, ఈ ప్రమాదంలో భవనం కూడా చాలా వరకు దెబ్బతింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు సమాచారం.