వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం | fire accident in apparel store at kosgi | Sakshi
Sakshi News home page

వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

May 25 2015 10:23 AM | Updated on Sep 5 2018 9:45 PM

మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండల కేంద్రంలోని ఓ వస్త్ర దుకాణంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండల కేంద్రంలోని ఓ వస్త్ర దుకాణంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బస్టాండ్ వద్దనున్న శిరీష స్కూల్ బ్యాగులు, వస్త్ర దుకాణం నుంచి మంటలు వస్తుండడంతో స్థానికులు అగ్ని మాపక విభాగానికి సమాచారం అందించారు. వారొచ్చి మంటలను ఆర్పివేశారు. రెండంతస్తుల భవనంలో కింద షాపు ఉండగా, పైన యజమానులు నివసిస్తున్నారు. అయితే, అగ్ని ప్రమాదానికి భవనం మొత్తం దగ్ధం కాగా, పై అంతస్తులో ఉన్న యజమాని కుటుంబ సభ్యులు నలుగురు స్నానాల గది ద్వారా బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు.

షాపులో ఉన్న రూ.7 లక్షల సరుకు బూడిదైనట్టు అంచనా. అలాగే, ఈ ప్రమాదంలో భవనం కూడా చాలా వరకు దెబ్బతింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement