breaking news
anti agitation
-
అబార్షన్... విప్లవాత్మక తీర్పు
డబ్లిన్ : గర్భస్రావంపై నిషేధం ఎత్తివేయాలంటూ ఐరిష్ మహిళలు చేస్తున్న పోరాటంపై విప్లవాత్మక తీర్పు వచ్చింది. అబార్షన్లపై నిషేధాన్ని ఎత్తేయాలా? వద్దా? అన్న అంశంపై చేపట్టిన రిఫరెండంలో, 66 శాతం మంది ఈ నిషేధాన్ని ఎత్తివేయాలనే ఓటు వేశారు. శనివారం రోజు దీని తొలి ఫలితాన్ని అధికారికంగా ప్రకటించారు. 40 నియోజకవర్గాల్లో తొలి నాలుగింటిన్ని వెల్లడించారు. దీనిలో 66.36 శాతం మంది నిషేధం ఎత్తివేయాలని ఓటు వేయగా.. 33.64 శాతం మంది మాత్రం నిషేధ ఎత్తివేతకు వ్యతిరేకంగా ఓటు వేసినట్టు డుబ్లిన్లోని సెంట్రల్ కౌంట్ సెంటర్ వెల్లడించింది. డుబ్లిన్ సెంట్రల్లో 77 శాతం మంది, కార్క్ సౌత్-సెంట్రల్లో 69 శాతం మంది, కార్క్ నార్త్ సెంట్రల్లో 64 శాతం మంది, గాల్వే ఈస్ట్‌లో 60 శాతం మంది అబార్షన్ల నిషేధ ఎత్తివేతకు ‘యస్’ అని ఓటు వేసినట్టు తెలిసింది. దీంతో ఎంతో కట్టుదిట్టంగా అమలవుతున్న అబార్షన్ వ్యతిరేక చట్టానికి ఇక చరమగీతం పాడాల్సివసరం వస్తోంది. ఈ ఏడాది చివరి వరకు అబార్షన్లకు అనుమతి ఇచ్చే ఓ కొత్త చట్టం తీసుకొస్తామని ప్రధాని లియో వరడ్కర్ చెప్పారు. కొత్త చట్టం డ్రాఫ్టింగ్ కోసం మంగళవారం కేబినెట్ సమావేశమవుతుందని తెలిపారు. తల్లి ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశమున్నప్పుడు అబార్షన్‌కు అనుమతించేలా ఈ కొత్త చట్టం రూపుదిద్దుకోనుంది. అబార్షన్ నిషేధం అనే కఠినతర చట్టం వల్ల ఆరేళ్ల క్రితం సవిత అనే ఓ భారతీయ మహిళ మృతి ఎందరినో కలచివేసింది. దీంతో ఐర్లాండ్ ప్రభుత్వం ఈ రిఫరెండాన్ని చేపట్టింది. సవిత మరణంతో అబార్షన్ల విషయంలో ఐర్లాండ్ వాసుల దృక్కోణంలో మార్పు వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. నేడు వెల్లడైన తొలి ఫలితం కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటిస్తోంది. -
స్వదేశంలో శరణార్థులుగా మారాం
భీమవరం అర్బన్: స్వదేశంలో తమ పరిస్థితి శరణార్థులుగా మారిందని గోదావరి మెగా ఫుడ్‌పార్కు బాధిత గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ‘మేం తీవ్రవాదులమా, దేశ ద్రోహులమా.. ఇంటి నుంచి కాలు బయట పెడితే పోలీసులకు సవాలక్ష అనుమానాలను నివృత్తి చేయాల్సి వస్తోంది. ప్రశాంతమైన గ్రామాలు పోలీస్ రాజ్యంలా మారాయి’ అంటూ తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నలగరువు గ్రామస్తులు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది పొత్తూరి నాగ సురేష్‌కుమార్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. హైదరాబాద్lనుంచి వచ్చిన పొత్తూరి నాగ సురేష్‌కుమార్ ఆదివారం ఆయా గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్తులను కలిసి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని నాగసురేష్కుమార్ అన్నారు. ఇక్కడి పరిస్థితులను చూస్తుంటే బ్రిటీష్ పాల నను తలపిస్తోందన్నారు. ఎక్కడ చూసిన పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం పౌరహక్కుల ఉల్లంఘన అవుతుందని చెప్పారు. ఫ్యాక్టరీ నిబంధనల ప్రకారం నిర్మించుకోవాలని ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. తక్షణమే గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడి పరిస్థితులను మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకువెళ్లి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. చర్చినీ వదలని పోలీసులు విశ్వాçÜులు చర్చిలకు వెళితే అక్కడ చర్చలు జరుపుతారనే ఉద్దేశంతో పోలీసులు అడ్డుకున్నారు. చర్చి ఆరుబయట ప్రార్థనలు చేసుకోవాలని ఆదేశించారు. దైవ కార్యక్రమాలకు సైతం పోలీసులు అడ్డుపడటం తగదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వినాయకచవితి వేడుకలకు కూడా తాము దూరమయ్యాయని పలువురు గ్రామస్తులు వాపోయారు. అన్యాయంగా అరెస్ట్ చేశారు తన భర్తను అన్యాయంగా పోలీసులు అరెస్టు చేశారని జొన్నలగరువు గ్రామానికి చెందిన కీర్తన అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనిచేసుకుని తనతో పాటు ముగ్గురు పిల్లల్ని పోషిస్తున్నాడని కన్నీటిపర్యంతమయ్యారు. ఇల్లు గడవడం కష్టంగా ఉందని, తన భర్తను విడుదల చేయాలని కోరారు.