Anna Rajan
-
సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బూతు కంటెంట్.. క్లారిటీ ఇచ్చిన నటి
ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రిప్షన్ గోల ఎక్కువైపోయింది. చాలామంది సబ్స్క్రిప్షన్ అనగానే అక్కడేదో బూతు కంటెంట్ ఉంటుందని భావిస్తున్నారు. తన దగ్గర మాత్రం అలాంటివి ఆశించొద్దంటోంది మలయాళ నటి అన్నా రేష్మ రాజన్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. నా అకౌంట్లో సబ్స్క్రిప్షన్ మోడల్‌ను రెండేళ్ల క్రితమే ప్రారంభించాను. దాని ద్వారా మీ అందరితో కనెక్ట్ అయ్యాను. సబ్స్క్రిప్షన్ వల్ల నా రీల్స్, ఫోటోలు మీకు ముందుగానే వస్తాయి. ఏదో ఊహించొద్దుఅలాగే మీరు నాతో కాస్త ఎక్కువగా కనెక్ట్ అవొచ్చు. అంతే తప్ప సబ్స్క్రిప్షన్ అంటే అక్కడేదో బూతు కంటెంట్ ఉంటుందని కాదు. కేవలం క్వాలిటీ, సృజనాత్మకత, గౌరవప్రదమైన సంభాషణలు మాత్రమే ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ఏదో ఊహించి రాకండి. కేవలం వృత్తిపరమైన విషయాలు మాత్రమే ఉంటాయని మీకు క్లియర్‌గా చెప్తున్నా అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు మంచి పని చేశావని మెచ్చుకుంటున్నారు. సినిమాకొందరు నెటిజన్లు మాత్రం.. నీ రీల్స్, ఫోటోలు ముందుగా చూడటానికి సబ్స్క్రిప్షన్ దేనికో? అని సెటైర్లు వేస్తున్నారు. కాగా నటి అన్నా రాజన్.. 2017లో 'అంగమలి డైరీస్' మూవీలో మలయాళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రంలో పృథ్వీరాజ్ భార్యగా నటించింది. మలయాళంలో పలు సినిమాలు చేసిన ఈ నటి ప్రస్తుతం జైలర్ 2లో నటిస్తోంది. తమిళంలో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం! View this post on Instagram A post shared by Anna raajan (@annaspeeks) చదవండి: మైండ్ బ్లాక్ అయ్యే సిరీస్.. ఓటీటీలో ఎప్పుడంటే? -
నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్‌పై స్పందించిన నటి
సినిమా నచ్చనప్పుడు బాలేదని విమర్శించడం తప్పు కాదు. కానీ కొందరు వారిని వృత్తిపరంగా కాకుండా వ్యక్తిగతంగా దూషిస్తుంటారు. లుక్కు బాలేదని, లావైపోయావని.. ఇలా ఎన్నో మాటలంటారు. మరీ ముఖ్యంగా నటీమణులపైనే విమర్శల బాణాలు ఎక్కుపెడుతుంటారు. దాదాపు ప్రతి హీరోయిన్, నటీమణులు ఎప్పుడో ఓసారి ఇలాంటి పరిస్థితుల బారిన పడినవారే!నటిపై ట్రోలింగ్తాజాగా మలయాళ నటి అన్నా రేష్మ రాజన్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. నువ్వు ఎంత లావున్నావో తెలుసా? ఆ బరువుతో డ్యాన్స్ కూడా చేయలేకపోతున్నావ్.. నీకసలు స్టెప్పులేస్తూ రీల్స్ చేయడం అవసరమా? అని వెక్కిరించారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై నటి స్పందించింది. తాను ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది.వీడియో నచ్చకపోతే..ఇప్పటికే కీళ్లనొప్పులతో బాధపడుతున్నానని, ఇప్పుడిలాంటి కామెంట్స్ చేసి తనను మరింత బాధపెట్టొద్దని కోరింది. నేను లేదా నా డ్యాన్స్ వీడియో నచ్చకపోతే చెప్పండి.. అంతేకానీ హద్దులు దాటి కామెంట్స్ చేయొద్దని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విజ్ఞప్తి చేసింది. ఇది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. అభిమానుల ప్రేమకు మురిసిపోయిన అన్నా మరో పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది. సరిగా డ్యాన్స్ చేయలేకపోయా..నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఓపక్క టైట్ డ్రెస్, మరోపక్క ఎండ వల్ల సరిగా డ్యాన్స్ చేయలేకపోయాను. అలాగే నేనేమీ పెద్ద ప్రొఫెషనల్ డ్యాన్సర్‌ని కూడా కాదు. కాకపోతే ఇలా స్టెప్పేయడమంటే ఇష్టం. అందుకే నాకు వచ్చినంతలో డ్యాన్స్ చేశాను. నెక్స్ట్ టైమ్ మరింత బాగా చేసేందుకు ప్రయత్నిస్తాను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అని రాసుకొచ్చింది. నటి కెరీర్..కాగా అన్నా రాజన్ 2017లో 'అంగమలి డైరీస్' చిత్రంతో మలయాళ చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'వేలిపడింతె పుస్తకం' సినిమాలో నటించింది. సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' మూవీలో పృథ్వీరాజ్ భార్యగా యాక్ట్ చేసింది. ఇటీవల రండు, తిరిమలై సినిమాలు చేసింది. View this post on Instagram A post shared by Anna Reshma Rajan (@annaspeeks) చదవండి: ఓటీటీలో 100 సినిమాలు.. ఎంచక్కా ఇంట్లోనే చూసేయండి -
నటిని షోరూమ్‌లో బంధించిన సిబ్బంది!
మలయాళ నటి అన్నా రేష్మ రాజన్‌కు చేదు అనుభవం ఎదురైంది. కొత్త సిమ్ తీసుకునేందుకు దగ్గర్లోని షోరూమ్‌కు వెళ్లగా అక్కడి సిబ్బంది ఆమెను లోపలే ఉంచి తాళం వేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. 'అంగమలి డైరీస్' ఫేమ్ నటి అన్నా రాజన్ గురువారం నాడు అలువ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఓ టెలికాం కంపెనీ ఆఫీస్‌కు సిమ్ కార్డు కోసం వెళ్లింది. అయితే సిమ్ తీసుకునే విషయంలో అన్నాకు, అక్కడి సిబ్బందికి మధ్య వాగ్వాదం జరగ్గా ఆమెను లోపలే ఉంచి తాళంవేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అన్నా రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు ఇరువురి మధ్య గొడవను పరిష్కరించినట్లు సమాచారం. ఈ విషయంపై అన్నా రాజన్ మీడియాతో మాట్లాడుతూ.. 'ఓ సిమ్ కార్డు కోసం నేను టెలికాం కంపెనీకి వెళ్లాను. నేను నటిగా కాకుండా సాధారణ మహిళగా ముఖానికి మాస్కు పెట్టుకుని వెళ్లాను. సిమ్ కార్డు తీసుకునే క్రమంలో వారికి, నాకు మధ్య గొడవ జరిగింది. కోపంతో వాళ్లు నన్ను లోపలే ఉంచి తాళం వేశారు. తర్వాత ఇలా చేసినందుకు క్షమాపణలు చెప్పారు. కాబట్టి నేను కేసు వెనక్కు తీసుకున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా అన్నా రాజన్ 2017లో 'అంగమలి డైరీస్' చిత్రంతో మాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'వేలిపడింతె పుస్తకం' సినిమాలో నటించింది. సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' మూవీలో పృథ్వీరాజ్ భార్యగా అలరించింది. View this post on Instagram A post shared by anna rajan (@annaspeeks) చదవండి: బిగ్‌బాస్ షోలో ఈవారం ఎలిమినేట్ అయ్యేది అతడే! అప్పటి చైల్డ్ ఆర్టిస్టులు.. ఇప్పటి సెలబ్రిటీలు -
కన్నీరుమున్నీరవుతూ మెగాస్టార్‌కు నటి క్షమాపణలు
తిరువనంతపురం : మంచి సినిమాలతో ప్రేక్షకుల ఆదరణ పొందిన కేరళ నటి అన్నా రాజన్ ఒక్కసారిగా ఇరకాటంలో పడిపోయారు. ఓ టీవీ షోలో జోక్‌గా చేసిన కామెంట్లతో, అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. చివరికి వారి ఆగ్రహానికి దిగి వచ్చిన అన్నా రాజన్, కన్నీరుమున్నీరవుతూ ఫేస్బుక్ లైవ్‌లో మెగాస్టార్ మమ్ముటీకి క్షమాపణలు చెప్పారు. అసలేం జరిగిందంటే.. దుల్కర్ సల్మాన్, మమ్మూటీలతో కలిసి నటించడానికి ఇష్టపడతారా? అని అన్నా రాజన్‌ను ఓ మలయాళం ఛానల్ తన టీవీ షోలో ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు తాను, దుల్కర్‌ను హీరోగా ఇష్టపడతానని, మమ్మూటీ తనకు ఆన్-స్క్రీన్ తండ్రి పాత్ర పోషిస్తారంటూ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలు మమ్మూటీ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. సోషల్ మీడియాలో ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహానికి, అన్నా రాజన్ క్షమాపణలు చెప్పారు. '' దీన్ని నేను జోక్‌గా తీసుకున్నా. నా కామెంట్‌ను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. కొంతమంది మీడియా వాళ్లు నా కామెంట్‌ను తప్పుదోవ పట్టిస్తారనుకోలేదు. మమ్మూటీని, దుల్కర్‌ను నేను అవమానపరచలేదు. ఇంత గొప్ప నటుడును అవమానపరిచే ఉద్దేశం నాకు లేదు. ఒకవేళ నేను అన్న మాటలు ఏమన్నా బాధ కలిగించి ఉంటే, మమ్మూటీ, దుల్కర్ అభిమానులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. మమ్మూటీ, దుల్కర్ ఇద్దరు సినిమాల్లో నాకు నటించాలని ఉంది. మమ్మూటీతో జతకట్టడానికి కూడా నేను సిద్ధమే'' అని రాజన్ ఫేస్బుక్ లైవ్‌లో చెప్పారు. అన్నా రాజన్ మలయాళంలో నటించిన రెండు మూవీలకు మంచి రివ్యూలు వచ్చాయి. తన తాజా సినిమా వెలిపాడింటె పుస్తకం. ఈ సినిమాలో సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు భార్యగా నటించారు.


