సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే బూతు కంటెంట్‌.. క్లారిటీ ఇచ్చిన నటి | Anna Rajan About Subscription: Dont Expect Unprofessional Content | Sakshi
Sakshi News home page

Anna Rajan: సబ్‌స్క్రిప్షన్‌.. బూతు కంటెంట్‌ ఊహించొద్దు.. కేవలం..

Apr 11 2026 1:26 PM | Updated on Apr 11 2026 1:31 PM

Anna Rajan About Subscription: Dont Expect Unprofessional Content

ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్‌ గోల ఎక్కువైపోయింది. చాలామంది సబ్‌స్క్రిప్షన్‌ అనగానే అక్కడేదో బూతు కంటెంట్‌ ఉంటుందని భావిస్తున్నారు. తన దగ్గర మాత్రం అలాంటివి ఆశించొద్దంటోంది మలయాళ నటి అన్నా రేష్మ రాజన్‌. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. నా అకౌంట్‌లో సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ను రెండేళ్ల క్రితమే ప్రారంభించాను. దాని ద్వారా మీ అందరితో కనెక్ట్‌ అయ్యాను. సబ్‌స్క్రిప్షన్‌ వల్ల నా రీల్స్‌, ఫోటోలు మీకు ముందుగానే వస్తాయి. 

ఏదో ఊహించొద్దు
అలాగే మీరు నాతో కాస్త ఎక్కువగా కనెక్ట్‌ అవొచ్చు. అంతే తప్ప సబ్‌స్క్రిప్షన్‌ అంటే అక్కడేదో బూతు కంటెంట్‌ ఉంటుందని కాదు. కేవలం క్వాలిటీ, సృజనాత్మకత, గౌరవప్రదమైన సంభాషణలు మాత్రమే ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ఏదో ఊహించి రాకండి. కేవలం వృత్తిపరమైన విషయాలు మాత్రమే ఉంటాయని మీకు క్లియర్‌గా చెప్తున్నా అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు మంచి పని చేశావని మెచ్చుకుంటున్నారు. 

సినిమా
కొందరు నెటిజన్లు మాత్రం.. నీ రీల్స్‌, ఫోటోలు ముందుగా చూడటానికి సబ్‌స్క్రిప్షన్‌ దేనికో? అని సెటైర్లు వేస్తున్నారు. కాగా నటి అన్నా రాజన్‌.. 2017లో 'అంగమలి డైరీస్‌' మూవీలో మలయాళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ చిత్రంలో పృథ్వీరాజ్‌ భార్యగా నటించింది. మలయాళంలో పలు సినిమాలు చేసిన ఈ నటి ప్రస్తుతం జైలర్‌ 2లో నటిస్తోంది. తమిళంలో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం!

 

 

చదవండి: మైండ్‌ బ్లాక్‌ అయ్యే సిరీస్‌.. ఓటీటీలో ఎప్పుడంటే?

Advertisement
 
Advertisement
Advertisement