breaking news
ANM staff
-
ఇదెక్కడి న్యాయం..!
వారంతా ఏఎన్ఎంలే...ఒకరు వైద్య ఆరోగ్య శాఖలో...మరొకరు సీఎం ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తారు. చేసే పని మాత్రం ఒక్కటే...జీతాల్లో ఎందుకో చెప్పలేనంత వ్యత్యాసం. అందుకే వీరిలో సీఎం ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే వారికి ప్రభుత్వంపై చెప్పలేనంత అసంతృప్తి..అదే సమయంలో తమ జీవితంపై ఆవేదన...చేసే పని ఒక్కటైనా...వేతనాల చెల్లింపులో చూసే వ్యత్యాసంతో ఇదెక్కడి న్యాయమంటూ...ప్రశ్నిస్తున్నారు. విజయనగరం ఫోర్ట్: వారంతా ఒకే రకం విధులు నిర్వహిస్తారు. విద్యార్హత కూడా ఒక్కటే.. అయినా జీతాల్లో మాత్రం చెప్పలేనంత వ్యత్యాసం. ఒకరు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేసే 2 ఏఎన్ఎంలు కాగా, మరొకరు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఏఎన్ఎంలు. జీతాల్లో వ్యత్యాసం ఉండడంతో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఏఎన్ఎంలు ఆవేదన చెందుతున్నారు. ఒకే క్యాడర్ గల వారికి ప్రభుత్వం జీతాల్లో వ్యత్యాసం చూపడం ఏంటని? ప్రశ్నిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో.. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 400కు పైగా 2వ ఏఎన్ఎంలు పని చేస్తున్నారు. వీరికి ఒకరికి నెలకు రూ.18,970 జీతం. వీరు గ్రామాల్లో పిల్లలకు, గర్భిణులకు టీకాలు వేయించడం, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకునేలా మహిళలను ప్రోత్సహించడం, గర్భిణులకు వైద్య తనిఖీలు చేయించడం వంటి విధులు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో.. జిల్లాలో ఎనిమిది ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. విజయనగరంలోని వీటీ అగ్రహారం, పూల్‌బాగ్ కాలనీ, రాజీవ్‌నగర్ కాలనీ, లంకాపట్నంల్లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అదే విధంగా సాలూరులో ఒకటి, బొబ్బిలిలో 2, పార్వతీపురంలో ఒకటి చొప్పన ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రతీ ఆరోగ్య కేంద్రంలోను ఇద్దరు చొప్పన 16 మంది ఏఎన్ఎంలు పని చేస్తున్నారు. వీరికి నెలకు ఒకరికి జీతం రూ.11,200 ఇస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేసే వారికి, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వారికి మధ్య వ్యత్యాసం రూ.6,770 ఉంది. సుమారు రూ.7 వేలు వరకు ఇద్దరి మధ్య వ్యత్యాసం ఉండడంతో వారు చేసిన విధులే మేము చేసినప్పటికి మాకు మాత్రం జీతం తక్కువగా ఇస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఏఎన్ఎంలు వాపోతున్నారు. -
డబ్బులిస్తేనే వైద్యం
ఐదు నెలలుగా ఏఎన్ఎంలకు జీతాల్లేవు ఫోన్‌ఇన్ కార్యక్రమంలో డీఎంహెచ్ఓకు బాధితుల వినతి సంగారెడ్డి టౌన్: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి విభాగంలో డబ్బులు ఇవ్వందే వైద్యం చేయడం లేదని, పేద రోగులకు సరైన వైద్యం అందించడంలో ఆసుపత్రి డాక్టరు, సిబ్బంది తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని సంగారెడ్డిలోని హనుమాన్ నగర్‌కు చెందిన రాకేష్ ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ అమర్‌సింగ్ నాయక్‌కు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఎక్స్‌రే విభాగంలో దారుణంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. మంగళవారం స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఫోన్‌ఇన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ అమర్‌సింగ్ పాల్గొని ఫోన్ ద్వారా సమస్యలను తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి బాధితులు ఆయనకు సమస్యలను విన్నవించారు. ఐదు నెలల నుంచి ఏఎన్ఎంల జీతాలు రావడం లేదని, జీతాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దుబ్బాకకు చెందిన నరేందర్ పేర్కొన్నారు సిద్దిపేట మండలం చిన్నగౌడవెల్లి ఆస్పత్రిలో హిమోఫీలియా మందులు గత రెండు నెలల నుంచి అందుబాటులో లేవని గ్రామానికి చెందిన నరేష్ ఫిర్యాదు చేశారు. నారాయణఖేడ్ పీహెచ్సీలో ఉన్న ఖాళీలలను వెంటనే భర్తీ చేయాలని చందూలాల్ సూచించారు.