breaking news
ANjani srinivas
-
బాబూ.. జాబు ఎక్కడ?
నిరుద్యోగ భృతి ఏమైంది.. జాతీయ విద్యాసంస్థలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలి {పాంతీయ వివక్ష తగదు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏబీవీపీ నాయకులు వైవీయూ : జాబు రావాలంటే బాబు రా వాంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసే లేకుండా ఉన్నారని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు అంజనీ శ్రీనివాస్ విమర్శిం చారు. శుక్రవారం కడప నగరంలోని హ రిత హోటల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత వి వేకానందుడు, సరస్వతీ చిత్రపటాలకు పూలమాల వేసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అమలుకు సాధ్యం కాని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి సంగతే మర్చిపోయారన్నారు. రైతు రుణాలు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీకి నియమ నిబంధనలను వర్తింపచేసి ప్రజలను మోసం చేశారన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని ప్రారంభించకుండా ఎవరికో మేలు చేసేందుకు పట్టిసీమ పథకాన్ని ప్రారంభించారన్నారు. ఏబీవీపీ జాతీయ కార్యదర్శి పనతల సురేష్ మాట్లాడుతూ నిరుద్యోగులకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, తర్వాత విస్మరించారని పేర్కొన్నారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి సునీల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా క్లస్టర్ పాఠశాలల పేరుతో విద్యార్థులు తక్కువ ఉన్నారన్న నెపంతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సమావేశంలో ఏబీవీపీ జాతీయ సహ సంఘటన కార్యదర్శి గుంతా లక్ష్మణ్, రాష్ట్ర సంఘటన కార్యదర్శి ఆదిశేషు, క్షేత్రియ సంఘటన కార్యదర్శి రామ్మోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు మల్లికార్జున, మాధవ, నాయకులు దామోదర్‌రెడ్డి, ఏబీవీపీ జిల్లా ప్రముఖ్ పోతుగుంట రమేష్‌నాయుడు, కన్వీనర్ రమణ, కో కన్వీనర్ సుబ్బరాజు, బాబు, 13 జిల్లాలకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందాలి
ముగిసిన ఏబీపీపీ జిల్లా మహాసభలు హిందూపురం అర్బన్ : విద్యార్థుల్లో జాతీయభావాలు దేశభక్తి సామాజిక స్పృహతోపాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు అంజనీశ్రీనివాస్ సూచించారు. హిందూపురంలో రెండు రోజులగా నిర్వహించిన ఏబీవీపీ జిల్లా మహాసభలు ఆదివారం ముగిశాయి. ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ విద్యరంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులనుఅరికట్డడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వీరి రక్షణకు ప్రత్యేక మహిళా స్పెషల్ ఫోర్సును ఏర్పాటు చేయాలన్నారు. కఠినమైన శిక్షలు అమలు చేయాలని కోరారు. రాయలసీమంలో తలమానీకమైన జెఎన్టీయూ అభివృద్ధికి ప్రతిఏడాది రూ.100కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హిందూపురంలో ఐటీ కారిడర్‌ను వెంటనే ఏర్పాటుచేసి, సెరికల్చర్, ఆర్టికల్చర్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ వంటి పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుమలరెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యుడు కరణాకర్లు కూడా ప్రసంగించారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్తకార్యదర్శి నాగర్జున, జిల్లా కన్వీనర్ సునీల్‌కుమార్, సప్తగిరికళాశాల ప్రిన్సిపాల్ ఈశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.