Angul district
-
వెరైటీ చోరి.. నవ్వు ఆపుకోలేరు మరి!
దొంగతనాలకు సంబంధించిన వార్తలు మనం తరచుగా మీడియాలో చూస్తుంటాం. మనం ఇప్పుడు చెప్పుకోబోయే చోరీ ఘటన గురించి బహుశా ఎప్పుడు విని ఉండకవపోచ్చు. ఇదో విచిత్రమైన ఘటన. సాధారణంగా చీరల దుకాణాల్లో చోరీలు జరగడం, ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడం.. వైరల్ అవడం ఈ రోజుల్లో సర్వసాధారణ వ్యవహారంగా మారింది. మన చెప్పుకోబోయే చోరీ ఉదంతం కూడా ఇక్కడ వరకు ఇలాగే జరిగింది. కానీ తర్వాత జరిగిన పరిణామాలే విచిత్రంగా ఉన్నాయి.వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని అంగుల్ జిల్లా కేంద్రంలో ఉన్న బోయనికా హాండ్లూమ్స్ అవుట్లెట్కు ఈనెల 2న నీట్‌గా ప్యాక్ చేసిన పార్సిల్స్ వచ్చాయి. వాటిని ఓపెన్ చేయగానే అక్కడున్న సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వాటిలో 7 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే 24 చీరలు ఉన్నాయి. బోయనికా సిబ్బంది అవాక్కాయింది వాటి విలువ చూసి కాదు. ఈ 24 చీరలు గత నెలలో తమ దుకాణం నుంచే చోరీకి గురైనవని తెలుసుకుని ముక్కున వేలేశుకున్నారు. దొంగతనం చేసిన వారే ఈ చీరలను తమకు తిరిగి పంపించారని తెలుసుకుని మరింత ఆశ్చర్యపోయారు. ఇలా కూడా జరుగుతుందా అని అవాక్కయ్యారు!అసలేం జరిగింది?టిప్‌టాప్‌గా తయారైన కొందరు మహిళలు బట్టలు కొనేందుకు ఏప్రిల్ 11న అనగుల్లో ఉన్న బోయనికా హాండ్లూమ్స్ అవుట్లెట్కు వచ్చారు. చాలా చీరలు చూశారు. చివరకు 1400 రూపాయలకు కుర్తా మాత్రమే కొని వెళ్లిపోయారు. తర్వాత పరిశీలిస్తే దుకాణంలో 25 చీరలు మాయమయినట్టు తేలింది. దీంతో సీసీ కెమెరాలు చెక్ చేయడంతో చీరల చోరీ బయటపడింది. అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్లో బోయనికా ఫిర్యాదు చేసి, సీసీ ఫుటేజీని పోలీసులకు అందజేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సీసీ ఫుటేజీని విడుదల చేయగా, ఇందులోని దృశ్యాలు వైరల్‌గా మారాయి.ఈ నేపథ్యంలో చోరీ అయిన 25 చీరల్లో 24 శారీలు కొరియర్లో శనివారం బోయనికా హాండ్లూమ్స్ అవుట్లెట్కు అందాయి. చోరీ అయిన చీరలు తిరిగి రావడం పట్ల అవుట్లెట్ మేనేజర్ రష్మి రంజిత పట్నాయక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు నిందితులు తమ సిబ్బందిలో ఒకరికి ఫోన్ చేసి క్షమాపణ కూడా చెప్పారని వెల్లడించారు. ''తెలంగాణ చెందిన నిందితురాలు బిల్లు మీద ఉన్న నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని కోరారు. చీరల చోరీ వీడియో వైరల్ కావడంతో తమ ప్రాంతంలో తలెత్తుకుని తిరగలేపోతున్నామని వాపోయింద''ని తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతోనే నిందితులు తాము దొంగిలించిన చీరలను వెనక్కి పంపివుంటారని అన్నారు.తిరిగిచ్చినా చర్యలు తప్పవుకాగా, దొంగతనం చేసిన వస్తువులను తిరిగి ఇచ్చినంత మాత్రాన నేరం మాసిపోదని, కేసు నుంచి తప్పించుకోలేరని అంగుల్ పోలీసు అధికారి ప్రకాశ్ చంద్ర మాఝీ తెలిపారు. వారు చీరలను తిరిగి ఇచ్చినప్పటికీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఉదంతం గురించి విన్నవాళ్లందరూ.. అడుగు తొక్కనేల, కాళ్లు కడనేల సామెతను గుర్తు చేసుకుంటున్నారు.If you remember the incident where a gang of women stole expensive sarees from Boyanika in Angul, Odisha…there is now a twist in the tale 🙂The gang has couriered the sarees back to the showroom, fearing arrest.Looks like police have identified the accused and traced their… pic.twitter.com/2k1EiCtv3o— Manas Muduli (@manas_muduli) May 5, 2026బోయనికా గురించి..బోయనికా అవుట్లెట్లను ఒడిశా ప్రభుత్వ చేనేత, వస్త్ర, హస్తకళల శాఖ నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని నైపుణ్యం గల నేత కార్మికులకు, వినియోగదారులకు వారధిగా నిలవాలనే లక్ష్యంతో 1956లో బోయనికాను ఒడిశా నెలకొల్పింది. నాణ్యమైన ఉత్పత్తులను ఇది పేరుగాంచింది. దీంతో బోయనికాలో దుస్తులు, హస్తకళల ఉత్పత్తులు కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రఖ్యాత సంబల్పురి, బొంకై చేనేత చీరలు, డ్రెస్ మెటీరియల్స్, షర్టులు, కుర్తాలతో పాటు గృహోపకరణాలు ఇందులో విక్రయిస్తుంటారు.చదవండి: తమిళనాడులో విజయ్ గెలుపు.. ట్రెండింగ్‌లో అన్నామలై! -
పట్టాలు తప్పిన గూడ్సు
భువనేశ్వర్: ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని అంగుల్–తాల్చేరు సెక్షన్‌లోని 167/1–2 కిలోమీటరు ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి 2.35 గంటలకు గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఫిరోజ్‌పూర్ నుంచి ఖుర్దారోడ్డుకు గోధుమలు రవాణా చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సరిగ్గా వంతెనపై జరిగిన ఈ దుర్ఘటనలో 9 వ్యాగన్లు పలీ్టకొట్టి ఒకదానిపై మరొకటి పేరుకుపోగా, ఇంజిన్ పట్టాలపైనే ఉండటంతో లోకో పైలట్, ఇతర సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో ఢెంకనాల్–సంబల్పూర్ సెక్షన్ మధ్య రైలు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 12 రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైల్వే సేవలను పాక్షికంగా రద్దు చేసి, దారి మళ్లించి, నడిపిస్తున్నారు. చురుగ్గా పునరుద్ధరణ పనులు.. ఖుర్దారోడ్డు డివిజన్ డీఆర్ఎమ్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల బృందం ఘటనా స్థలం సందర్శించింది. దుర్ఘటనకు సంబంధించిన పరిస్థితులు, కారణాలను బృందం పరిశీలిస్తోంది. కుండపోత వర్షాలతో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వరద నీరు ఉధృతికి వంతెన ఇరువైపుల భాగాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం సంబల్పూర్ నుంచి క్రేన్‌ని తెప్పించి, వ్యాగన్ల పునరుద్ధరణ చేపడుతున్నారు. ప్రయాణికులకు ఆహారం సరఫరా.. ఈ ప్రమాదం దృష్ట్యా మధ్యలో నిలిచిపోయిన బికనీర్–పూరీ స్పెషల్ రైలు, దుర్గ్–పూరీ స్పెషల్ రైలులోని ప్రయాణికులకు సంబల్పూర్ రైల్వే డివిజన్ కేకులు, బిస్కెట్లు, టీ, తాగునీరు సరఫరా చేసింది. టిట్లాగడ్ రైల్వే స్టేషనులో దుర్గ్–పూరీ స్పెషల్, హతియా–పూరీ స్పెషల్, ఎల్టీటీ– పూరీ స్పెషల్ రైలు ప్రయాణికులకు మధ్యాహ్నం భోజనం ప్యాకెట్లను కూడా రైల్వే సరఫరా చేసింది. -
సెక్యూరిటీ గార్డే డాక్టరైండు.. పేషెంట్‌కు ఇంజెక్షన్
భువనేశ్వర్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యులపై ప్రజల్లో గౌరవం పెరిగింది. ప్రత్యక్ష దైవంగా వారిని భావించారు. అలాంటి భావనను కొందరు వైద్యులు తమ నిర్లక్ష్యంతో పోగొట్టుకుంటున్నారు. అలాంటి ఘటనే ఒడిశాలో చోటుచేసుకుంది. విధులపై నిర్లక్ష్యం వహించారు. ఆస్పత్రి గేటు వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహించే గార్డుతో ఇంజెక్షన్ ఇప్పించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చదవండి: భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు అంగుల్‌లోని జిల్లా ఆస్పత్రికి మంగళవారం ప్రమాదంలో గాయపడిన వ్యక్తితో పాటు అతడి బంధువులు వచ్చారు. ఈ సమయంలో ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు ఎవరూ లేరు. దీంతో సెక్యూరిటీ గార్డే వైద్యం చేశారు. క్షతగాత్రుడికి ఇంజెక్షన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడి బంధువులు సెల్ఫోన్లో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పరిణామంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవడంతో ప్రభుత్వం స్పందించింది. ‘ఆ రోజు ఆస్పత్రిలో ఇన్చార్జ్ ఎవరో తెలుసుకుంటున్నాం. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నాం. విచారణ అనంతరం కారకులపై చర్యలు తీసుకుంటాం’ అని అసిస్టెంట్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ మానస్ రంజన్ తెలిపారు. చదవండి: మహిళలు జన్మనివ్వడానికే.. మంత్రులుగా పనికి రారు -
ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లి.. మహిళా డాక్టర్‌పై లైంగిక దాడి
భువనేశ్వర్: ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి మహిళా డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై లైంగికదాడి చేశాడు. వివరాలు.. అంగూల్ జిల్లాలోని చెండిపద ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళ డాక్టర్‌గా పనిచేస్తోంది. ఆమెకు కేటాయించిన ప్రభుత్వ కార్వర్ట్స్‌లో తన సోదరుడితో పాటు కలిసి ఉంటోంది. అయితే మంగళవారం రాత్రి ఆమె సోదరుడు తన స్నేహితులతో కలిసి అక్కడికి సమీపంలోని దాబాకు డిన్నర్‌కు వెళ్లాడు. దాబాలో భోజనం చేస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న సోదరి కోసం ఫుడ్ పార్శిల్ పంపాడు. దీంతో దాబా యజమాని కుమారుడు.. సుకంత బెహరా రాత్రి సమయంలో ఫుడ్ డెలివరీ చేసేందుకు మహిళా డాక్టర్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నఆమెపై బెహరా అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై మహిళా డాక్టర్, ఆమె సోదరుడు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బెహరాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చదవండి: గూడూరులో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం -
ప్రయివేట్ బస్సు బోల్తా, 30 మంది మృతి
భువనేశ్వర్: ఒడిశాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్గూల్ జిల్లా ఆత్మలిక్ వద్ద ఓ ప్రయివేట్ బస్సు అదుపు తప్పి బ్రిడ్జి పైనుంచి కిందకు పడిపోయింది. ఈ దుర్ఘటనలో 30 మంది దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. 15మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో 15 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరణించారు. కాగా 50మంది ప్రయాణికులతో బస్సు భౌద్ జిల్లా నుంచి ఆత్మలిక్కు వెళుతుండగా ఉదయం 10 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ సెల్‌ఫోన్ లో మాట్లాడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అన్గూల్ జిల్లా ఎస్పీ కవిత జలాన్ తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు చెప్పారు. కాగా ప్రమాద ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.


