breaking news
Andrzej Soldra
-
నేడు విజేందర్ ఆరో బౌట్
బోల్టన్: అపజయం లేకుండా తన ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లో దూసుకుపోతున్న భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ నేడు (శుక్రవారం) తన ఆరో బౌట్లో తలపడనున్నాడు. పోలండ్‌కు చెందిన ఆండ్రెజెజ్ సోల్డ్రాతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. అయితే ఈసారి విజేందర్ తొలిసారిగా ఎనిమిది రౌండ్ల ఫైట్‌ను ఎదుర్కొనబోతున్నాడు. ‘నా ఆరో బౌట్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాను. సోల్డ్రాకు సంబంధించిన వీడియోలు చూశాను. అతనికి 16 ఫైట్లలో 81 రౌండ్ల అనుభవం ఉంది. నాకంటే అనుభవశాలే అయినా అతడిని నియంత్రిస్తాను’ అని విజేందర్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ పోటీలో నెగ్గి వచ్చే నెలలో భారత్‌లో జరిగే డబ్ల్యుబీవో ఆసియా బౌట్‌కు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని 30 ఏళ్ల విజేందర్ భావిస్తున్నాడు. -
'అతడి బొక్కలు విరగ్గొట్టి భారత్ కు పంపిస్తా'
న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తన ప్రొఫెషనల్ కెరీర్‌ను దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. ఆరో బౌట్ కు సిద్ధంగా ఉన్న విజేందర్ తన చివరి బౌట్ లో ఫ్రాన్స్‌కు చెందిన మటియోజ్ రోయర్ పై విజయం సాధించాడు. దీంతో అతను వరుసగా ఐదో టెక్నికల్ నాకౌట్ విజయాన్ని సొంతం చేసుకున్న ఆటగాడయ్యాడు. తొలిసారి ఆరు రౌండ్ల బౌట్లో పాల్గొన్న విజేందర్ మరో రౌండ్ మిగిలి ఉండగానే విజేతగా నిలిచాడు. . ఆరో బౌట్ లో పోలాండ్ కు చెందిన ఆండ్రిజెజ్ సోల్డ్రాతో పోటీ పడనున్నాడు. ఆరో రౌండ్ మాత్రం అంత సులువుకాదంటూ అతడి ప్రత్యర్థి సవాలు చేస్తున్నాడు. బోల్టాన్ లోని ప్రీమియర్ సూట్ మాక్రాన్ స్టేడియంలో సోల్డ్రాతో తలపడేందుకు కసరత్తులు చేస్తున్నాడు. మొత్తం 14 రౌండ్లు ఆడిన విజేందర్ వరుసగా ఐదు విజయాలను సాధించాడు. ప్రత్యర్థి సోల్డ్రా మ్యాచ్ వీడియోలు చూశాను. ఆరో బౌట్ గెలవాలని తాను చాలా ఆసక్తిగా ఉన్నానని చెబుతండగా, తనలాంటి ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ కు ఇంతకుముందు ఎదురుకాలేదని బౌట్ రోజు తన సత్తా చూపిస్తానంటూ సవాల్ విసిరాడు. విజేందర్ బొక్కలు విరగ్గొట్టి భారత్ కు పంపిస్తానంటూ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దీంతో మే 13న జరగనున్న వీరి పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది.