నేడు విజేందర్ ఆరో బౌట్ | Today is the sixth bout Vijender | Sakshi
Sakshi News home page

నేడు విజేందర్ ఆరో బౌట్

May 13 2016 12:46 AM | Updated on Sep 3 2017 11:57 PM

నేడు విజేందర్ ఆరో బౌట్

నేడు విజేందర్ ఆరో బౌట్

అపజయం లేకుండా తన ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్‌లో దూసుకుపోతున్న భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ నేడు (శుక్రవారం) తన ఆరో బౌట్‌లో తలపడనున్నాడు

బోల్టన్: అపజయం లేకుండా తన ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్‌లో దూసుకుపోతున్న భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ నేడు (శుక్రవారం) తన ఆరో బౌట్‌లో తలపడనున్నాడు. పోలండ్‌కు చెందిన ఆండ్రెజెజ్ సోల్డ్రాతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. అయితే ఈసారి విజేందర్ తొలిసారిగా ఎనిమిది రౌండ్ల ఫైట్‌ను ఎదుర్కొనబోతున్నాడు. ‘నా ఆరో బౌట్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాను.

సోల్డ్రాకు సంబంధించిన వీడియోలు చూశాను. అతనికి 16 ఫైట్లలో 81 రౌండ్ల అనుభవం ఉంది. నాకంటే అనుభవశాలే అయినా అతడిని నియంత్రిస్తాను’ అని విజేందర్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ పోటీలో నెగ్గి వచ్చే నెలలో భారత్‌లో జరిగే డబ్ల్యుబీవో ఆసియా బౌట్‌కు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని 30 ఏళ్ల విజేందర్ భావిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement