breaking news
All Party Complaint
-
‘జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయండి’
హైదరాబాద్: రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో అఖిలపక్షనాయకులు గురువారం భేటీ అయ్యారు. గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తెలంగాణ జనసమతి అధ్యక్షులు కోదండ రాం, టీటీడీపీ అధ్యక్షులు ఎల్‌రమణ, టీడీపీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. గవర్నర్‌తో భేటీలో ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ వైఫల్యాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతోన్న రాజకీయ ఫిరాయింపులపై అఖిలపక్షం నేతలు ఫిర్యాదు చేశారు. ఇంటర్మీడియట్లో జరిగిన అక్రమాలపై న్యాయవిచారణ జరిపి ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే చూడాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఇంటర్‌కు సంబంధించి అన్ని పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్లోబెరినా ఐటీ సంస్థ, ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని అన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి.. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కేబినేట్ నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోంది
టీఆర్ఎస్పై రాష్ట్రపతికి అఖిల పక్షం ఫిర్యాదు ► దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు ► బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని అఖిల పక్ష, టీజేఏసీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్న దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలపై పోలీసులను ప్రయోగించి చిత్రహింసలకు గురిచేస్తోందని రాష్ట్ర పతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తదితరులు బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతిని కలిశారు. బంగారు తెలంగాణ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. న్యాయవిచారణ జరిపేలా ఆదేశించండి.. ఇసుక దందాలకు పాల్పడుతున్న వారికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్న దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ తన బంధువులతో కలసి నడుపుతున్న ఇసుక దందాను ప్రశ్నించిన నేరెళ్లకు చెందిన 8 మంది దళితులను పోలీసులు వేధిస్తున్నారని రాష్ట్రపతికి వివరించారు. నేరెళ్లలో ఎస్పీ దగ్గరుండి మరీ దళితులను చిత్రహింసలకు గురిచేశారన్నారు. ఈ ఘటనలో బాధితులకు న్యాయం జరిగేలా స్వతంత్ర కమిషన్‌తో విచారణ జరిపేలా డీజీపీని ఆదేశించాలని, బాధితులకు నష్టపరిహారమందేలా చూడాలని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని నేతలు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ నియంతృత్వ విధానాల వల్ల రాష్ట్రంలో ఏ వర్గమూ సంతృప్తిగా లేదన్నారు. ఉద్యోగాల కోసం యువత, వ్యవసాయంలో చేయూత కోసం రైతులు ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం వారిని అణగదొక్కుతోందన్నారు. సమావేశం అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను ఎలా కాలరాస్తోందో రాష్ట్రపతికి సమర్పించినట్లు చెప్పారు. దళితులపై జరుగుతున్న దాడులపై విచారణ జరిపించాలని చేసిన విజ్ఞప్తిపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించార న్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణలో ఎంపీటీసీ ఉపట్ల శ్రీనివాస్‌పై జరిగిన దాడిని కోదండరాం ఖండించారు.