breaking news
alia bhatt films
-
మస్తు ఫీచర్లతో మడత ఫోన్లు..ఇరగదీస్తున్నాయిగా
సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ దూకుడు పెంచింది. అదిరిపోయే ఫీచర్లతో కాంపీటీటర్ల ఫోన్లకు పోటీగా మడత (ఫోల్డబుల్ ) ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే భారత్ మినహాయించి వరల్డ్ వైడ్ గా ఆగస్ట్ 11న గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 మడత (ఫోల్డబుల్ ) ఫోన్లతో పాటు గెలాక్సీ బడ్స్ 2, గెలాక్సీ వాచ్ 4 సిరీస్‌లను విడుదల చేయగా.. ఈ ఫోల్డబుల్ ఫోన్లను ఇండియాలో ఆగస్ట్ 20న బాలీవుడ్ హీరోయిన్ ఆలియా బట్ చేతులు మీదిగా మార్కెట్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ఫీచర్స్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ఫోన్ బుక్ టైప్ లో ఉంటుంది. అంటే మీరు ఈ ఫోన్ టాబ్లా లేదంటే ఫోన్లా యూజ్ చేసుకోవచ్చు.ఆపరేట్ చేసేందుకు ఎస్ పెన్ స్టైలస్ ఫోన్ తో పాటు వస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ లోని ఫీచర్లు ఇతర స్మార్ట్ ఫోన్ల కంటే భిన్నంగా ఉన్నాయి. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, ఎఫ్ 1/8 వైడ్ యాంగిల్ లెన్స్ తో 12 మెగాఫిక్సెల్ ప్రైమరీ షూటర్, 12 మెగాఫిక్సెల్ ఆల్ట్రావైడ్, 12 మెగా ఫిక్సెల్ టెలీ ఫోటో షూటర్స్ సదుపాయం ఉంది. హై క్వాలిటీ వీడియోల కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజటిన్ ఫీచర్స్ తో పాటు ఫ్రంట్ ఎండ్ 10 మెగా ఫిక్సెల్ షూటర్, వెనుక భాగంలో 4 మెగా పిక్సెల్ కెమెరాలతో అట్రాక్ట్ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్ లో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.1,33,600 గా ఉండగా.. భారత్ లో మాత్రం ఆ ఫోన్ల ధరల్లో మార్పులుండొచ్చు. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫీచర్స్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 రేర్ కెమెరా సెటప్,12మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ లెన్స్, ఫ్రంట్ ఎండ్ లో ఎఫ్/2.4 లెన్స్ తో 10 మెగాపిక్సెల్‌తో అందుబాటులోకి రానుండగా. ఈ ఫోన్ కి ఎస్ పెన్ స్టైలస్ ను వినియోగించలేము. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ధర శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 యూఎస్ మార్కెట్ లో రూ.74వేలు ఉండగా.. ఆగస్ట్ 20 న విడుదలయ్యే ఈ ఫోన్ ఖరీదు ఇండియాలో ఎంతుండొచ్చనేది తెలియాల్సి ఉంది. -
యాక్షన్, రియాక్షన్.. సోషల్ మీడియా ఓవరాక్షన్!
'చర్యకు సరిసమానమైన ప్రతి చర్య ఉంటుంది. అదే సోషల్ మీడియాలో అయితే.. అది మితిమీరి అతిగా ఉంటుంది'.. బుధవారం ఉదయం ట్విట్టర్లో ఆలియా భట్ చేసిన ట్వీట్ ఇది. తన విమర్శలకు గట్టి సమాధానం చెప్పేందుకు చేసిందో లేక సహజంగానే తనకు నచ్చడం వల్ల ఈ కామెంట్ ను షేర్ చేసిందో తెలియదు కానీ.. ఈ ట్వీట్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె తాజా సినిమా 'ఉడ్తా పంజాబ్'లో తన పాత్రపై వస్తున్న విమర్శలకు సమాధానం ఈ ట్వీట్ కావొచ్చునని వినిపిస్తోంది. అభిషేక్ చౌబే దర్శకత్వంలో తెరకెక్కిన 'ఉడ్తా పంజాబ్' సినిమాలో బిహారీ వలస మహిళ పాత్రలో ఆలియ కనిపిస్తున్నది. పంజాబ్‌లో తాండవిస్తున్న డ్రగ్స్ మహామ్మారి ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై సంగతి తెలిసిందే. ట్రైలర్లో ఆలియా కనిపించిన తీరుపై సినీ ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తుండగా.. ఆలియా పాత్రను తీవ్రంగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఓ బహిరంగ లేఖ హల్చల్ చేస్తోంది. మొదట ఓ వెబ్సైట్లో ఈ లేఖ కనిపించింది. ఈ లేఖ రాసిన ఓ గుర్తుతెలియని వ్యక్తి తనకు తాను 'బిహారీ అమ్మాయి'గా చెప్పుకుంటూ ఆలియా పాత్రపై చండ్ర నిప్పులు కురిపించింది. బిహారీలు అనగానే దుర్భర దారిద్ర్యంలో ఉంటారని, పేదరికానికి, నేరాలకు ప్రతిబింబంగా బిహార్ ఉంటుందనే పాతచింతకాయ ఆలోచనల్నే ఈ చిత్రంలో ఆలియా పాత్ర ప్రతిబింబిస్తున్నదని ఆమె ధ్వజమెత్తింది. ఈ లేఖకు కౌంటర్‌గానే ఆలియా ఈ ట్వీట్ చేసిందా? అనే అభిప్రాయం బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు సినీ జనాలు మాత్రం 'ఉడ్తా పంజాబ్'లో ఆలియ నటన సూపర్ అంటూ ట్విట్టర్లో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆలియా భట్, షాహిద్ కపూర్, కరీనా కపూర్ కలిసి నటిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. Hmmmmmmm :) pic.twitter.com/pWbSOkNGWm — Alia Bhatt (@aliaa08) 20 April 2016