కాంట్రాక్ట్ మ్యారేజ్ గుట్టురట్టు
హైదరాబాద్: మెడికల్ వీసా పై నగరానికి వచ్చి ఇక్కడి పేద ముస్లిం మహిళను పెళ్లి చేసుకోవడానికి యత్నించిన సోమాలియా వాసిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నగరంలోని మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.
సోమాలియా దేశం నుంచి వచ్చిన అలీ మహ్మద్ (56) అనే వ్యక్తి కాంట్రాక్ట్ వివాహం కోసం ప్రయత్నిస్తున్నాడనే సమాచారంతో రంగంలోకిదిగిన పోలీసులు అతనితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాంట్రాక్ట్ మ్యారేజ్ చేస్తామని అతని నుంచి రూ. 1 లక్ష తీసుకొని దాంతో ఓ పేదింటి మహిళ(27)ను పెళ్లికి ఒప్పించి అతని వెంట పంపడానికి ప్రయత్నించిన బ్రోకర్ ఇస్మాయిల్, అన్వరి అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.