Akshya Tertiya
-
Akshaya Tritiya : ధగధగల వెనుక దగా!
బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. ఊహించని విధంగా ధరలు పెరుగుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన అధికమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరగడం, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడం, పెట్టుబడిదారులు బంగారంపైనే అధికంగా దృష్టి పెట్టడం తదితర కారణాలు ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 2024, 2025 సంవత్సరాల్లోనే ధరలు దూసుకుపోతున్నాయి. ఇవాళ (ఏప్రిల్30) అక్షయ తృతీయ. ఆ రోజున బంగారం కొంటే లక్ష్మిదేవిని ఇంటికి ఆహ్వానించినట్లేనన్న నమ్మకం ప్రజల్లో ఉంది. మిగతా రోజులతో పోలిస్తే ఆ రోజున బంగారం వ్యాపారం మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే ధరలు పెరిగిన నేపథ్యంలో అక్షయ తృతీయ రోజున బంగారం వ్యాపారం ఎలా ఉంటుందోననే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. స్వచ్ఛమైన బంగారానికి హాల్ మార్క్ బంగారం కొనుగోలులో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. స్వచ్ఛమైన బంగారానికి సాధారణంగా హాల్ మార్క్ ఉంటుంది. బ్యూరో ఆఫ్ స్టాండర్డ్ (బిఐఎస్) హాల్ మార్క్ ఇస్తుంది. అయితే కార్పొరేట్ సంస్థలు హాల్ మార్క్ సెటప్ చేసుకున్నట్లుగా ప్రకటించుకుంటూ నాణ్యతకు సొంత మార్కు ఇచ్చుకుంటున్నాయి. బంగారం కొనుగోలులో హాల్ మార్క్, క్యారెట్లను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నిబంధనల మేరకు బంగారాన్ని బ్యాంకుల ద్వారా దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఐసీఐసీఐ, యాక్సిస్, ఇండియన్ ఓవర్సీస్ తదితర బ్యాంకులు సరఫరా చేస్తున్నాయి. బిల్లు తీసుకోకపోతే నష్టమే.. బంగారం వ్యాపారంలో 85 శాతం జీరో జరుగుతోంది. 90 శాతం వ్యాపారులు ఆథరైజ్డ్ బిల్లులు ఇవ్వడం లేదు. కేవలం షాపు పేరు కలిగిన కాగితాలపై బిల్లులు ఇస్తున్నారు. వీటిలో పాన్‌నెంబర్, వ్యాట్ నెంబర్ ఇతరత్రా వివరాలు ఉండవు. ఇలా ఇవ్వడం జీరో వ్యాపారం కిందకు వస్తుంది. మరికొందరు తెల్లపేపర్‌పైనే వివరాలు రాసిస్తుండటం గమనార్హం. వాణిజ్య పన్నుల శాఖ, ఆదాయపు పన్ను, కస్టమ్స్ ఎక్సైజ్ సుంకం అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. బంగారం పోగొట్టుకున్నా.. దొంగలు ఎత్తుకెళ్లినా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బిల్లులు తప్పనిసరి. కొంతమంది వ్యాపారులు తూకాల్లో దగా చేస్తున్నట్లు తెలుస్తోంది. తూనికలు, కొలతల శాఖకు వారి టార్గెట్లకు అనుగుణంగా తనిఖీలు చేయడం, కేసులు పెట్టడం తప్ప అక్రమాలను అరికట్టాలనే చిత్తుశుద్ధి లోపించినట్లు తెలుస్తోంది. కొనుగోలులో అప్రమత్తత అవసరం స్వచ్ఛమైన బంగారం కొంటే తిరిగి అమ్ముకున్నప్పుడు ఆ రోజు ఉన్న ధర లభిస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 1,500 వరకు బంగారం దుకాణాలు ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం బిస్కెట్ రూపంలో లభిస్తుంది. ఇది పూర్తిగా స్వచ్ఛమైనది. బంగారం ఆభరణాలు మాత్రం 22 క్యారెట్లలో ఉంటాయి. వీటి స్వచ్ఛత 916 ఉంటుంది. జిల్లాలో జరిగే వ్యాపారంలో 80 శాతం వరకు 22 క్యారెట్ల బంగారం(నగలు, ఆభరాణాలు) కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు 22 క్యారెట్ల బంగారం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.14, 16, 18 క్యారెట్ల బంగారానికి 22 క్యారెట్ల ధర వసూలు కర్నూలు, నంద్యాల జిల్లా కేంద్రాలతో సహా అన్ని ప్రాంతాల్లోని కొందరు వ్యాపారులు 14, 16, 18, 20 క్యారెట్ల బంగారం ఆభరణాలు అమ్ముతూ వాటికి 22 క్యారెట్ల ధర వసూలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం 10 గ్రాముల ఆర్నమెంటు బంగారం ధర రూ.89,400 పలుకుతోంది. ఒక క్యారెట్ విలువ రూ.4,063.63. 22 క్యారెట్లు(916 స్వచ్ఛత) ఉన్న బంగారమైతే ఈ ధర చెల్లించాలి. వినియోగదారులు కొనుగోలు చేసే బంగారం 20 క్యారెట్లు కలిగినదైతే 10 గ్రాముల ధర రూ.81,272 అవుతుంది. కానీ అధిక శాతం జ్యువెలరీ షాపుల్లో తక్కువ క్యారెట్లు ఉన్న బంగారానికి కూడా 22 క్యారెట్ల బాంగారం ధర వసూలు చేస్తుండటం గమనార్హం.కొనక తప్పడం లేదు బంగారం ధరలు అందుబాటులో ఉంటే కాస్త ఎక్కువ కొంటాం. మా కుటుంబంలో వివాహం ఉన్నందున ధర ఎంతు న్నా కొనక తప్పడం లేదు. అక్షయ తృతీయ నేపథ్యంలో ఆఫర్లు ఉండటంతో బంగారం కొనడానికి మలబార్ గోల్డ్‌కు వచ్చాం. ఆర్నమెంటు బంగారం 10 గ్రాముల ధర రూ.89,800 ఉన్నప్పటికీ డిజైన్‌ను బట్టి తరుగు కలుపుతుండటంతో రూ.లక్షపైనే అవుతోంది. ఇంత ధర ఉండటం నిజంగా బాధాకరమే. – ప్రత్యూష, సంతోష్‌నగర్, కర్నూలుధరలు తగ్గించాలి బంగారం ధరలు తగ్గించే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలి. రోజురోజుకు ధరలు భారీగా పెరిగిపోతుండటం మధ్యతరగతి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం శుభకార్యాలు, అక్షయ తృతీయ ఉండటంతో బంగారం కొనడానికి వచ్చాం. బంగారం అంటే ప్రతి ఒక్కరికి మక్కువ ఉన్నప్పటికీ వనరులను బట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. – శైలజ, కోడుమూరు(చదవండి: అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..! బంగారం కొనాల్సిందేనా..?) -
అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..!
వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం (Chandanotsavam) కూడా జరుగుతుంది. స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం.1. పరశురాముని జన్మదినం.2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం.3. త్రేతాయుగం మొదలైన దినం.4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం.5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో , వ్రాయడం మొదలుపెట్టిన దినం.6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం.7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం.8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం.9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం.10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.అక్షయ తృతీయ నాడు మనం చేపట్టిన ఏ కార్యఫలమైనా, (అది పుణ్యం కావచ్చు, లేదా పాపం కావచ్చు) అక్షయంగా, నిరంతరం, జన్మలతో సంబంధం లేకుండా, మన వెంట వస్తూనే ఉంటుంది. పుణ్య కర్మలన్నీ విహితమైనవే. అందునా ఆ రోజు ఓ కొత్త కుండలో గానీ, కూజాలో గానీ, మంచి నీరు పోసి, దాహార్తులకు శ్రధ్ధతో సమర్పిస్తే, ఎన్ని జన్మలలోనూ, మన జీవుడికి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితి రాదు.అతిథులకు, అభ్యాగతులకు, పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే, ఏ రోజూ ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు. వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు స్వయంపాకం, దక్షిణ, తాంబూలాదులు సమర్పించుకుంటే, మన ఉత్తర జన్మలలో, వాటికి లోటురాదు. గొడుగులు, చెప్పులు, విసనకర్రల లాటివి దానం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ రోజు నిషిధ్ధ కర్మల జోలికి వెళ్ళక పోవడం ఎంతో శ్రేయస్కరం. అక్షయ తృతీయ అదృష్టాన్ని, విజయాన్ని చేకూర్చుతుంది అని పౌరాణిక ఉదంతాలు కొన్ని చెబుతున్నాయి.బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి?మన సంస్కృతిలో ప్రతి పండుగ వెనుకా ఓ కారణం కనిపిస్తుంది. కాకపోతే ఒక్కోసారి ఆ కారణాన్ని మర్చిపోయి, ఆచరణకే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాము. అందుకు ఉదాహరణే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాల్సిందే అన్న స్థాయిలో ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం (Gold) కొనాల్సిందేనా! అసలు బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి?అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్య కర్మని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయ తృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.అక్షయ తృతీయనాడు విష్ణుమూర్తిని పూజించాలని మత్స్య పురాణం పేర్కొంటోంది. విష్ణుమూర్తి పాదాలను అక్షతలతో అర్చించి, ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతోంది. జపం, హోమం, వ్రతం, పుణ్యం, దానం... ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి పనీ అనంతమైన ఫలితాన్నిస్తుందని మాత్రమే మతగ్రంథాలు పేర్కొంటున్నాయి. అక్షయ తృతీయనాడు వివాహం చేసుకుంటే ఆ బంధం చిరకాలం నిలుస్తుందనీ, జాతకరీత్యా వివాహబంధంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని నమ్ముతారు.అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితం దక్కుతుంది కాబట్టి, ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే... మన సంపదలు కూడా అక్షయం అవుతాయన్న నమ్మకం మొదలైంది. అయితే కష్టపడో, అప్పుచేసో, తప్పు చేసో సంపదను కొనుగోలు చేస్తే మన కష్టాలు, అప్పులు, పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పెద్దలు.అక్షయ తృతీయ రోజున వర్జ్యం , రాహుకాలంతో పనిలేదు''వైశాఖ శుక్ల పక్షోతు తృతీయ రోసిణి యుతాదుర్లభా బుధచారేణ సోమనాపి ఉతా తథా''మత్స్య పురాణంలో 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం (Akshaya Tritiya Vratham) గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ రోజున చేసే ఏ వ్రతమైనా, జపమైనా, దానాలు ఏవైనా సరే అక్షయమౌతుంది.పుణ్యకార్యాచరణతో వచ్చే ఫలితం అక్షయమైనట్లే , పాపకార్యాచరణతో వచ్చే పాపం అక్షయమే అవుతుంది. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్య కర్మనాచరించినా అక్షయముగా ఫలము లభిస్తుంది. అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందునే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది.ఈ రోజున ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం (Rahu Kalam) వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పండితులు చెప్తున్నారు. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు అంటున్నారు.చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో పసిడి పరుగు, కొందామా? వద్దా?ఇంకా గృహనిర్మాణం, ఇంటిస్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే అక్షయ తృతీయనాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసినా సంపద , పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.- డీ వీ ఆర్ -
త్వరలో అక్షయ తృతీయ.. బంగారంపై భారీ శుభవార్త!
త్వరలో అక్షయ తృతీయ రాబోతోంది. ఈ క్రమంలో పసిడి ప్రియులకు ఆనందం కలిగించే వార్త ఇది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. పసిడి ధరలు ఈరోజు (మే 1) ఏకంగా రూ.1260 మేర తగ్గాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.65,550 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.1090 తగ్గి రూ. 71,510 లకు తగ్గింది.ఇతర నగరాల్లో..దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.65,700 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.1090 తగ్గి రూ.71,660 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.1000 క్షీణించి రూ.65,550 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1090 తగ్గి రూ.71,510 వద్దకు దిగొచ్చింది.చెన్నైలో అయితే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.1150 తగ్గి రూ.71,510 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.1260 తగ్గి రూ.72,380గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 క్షీణించి రూ.65,550 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1090 తగ్గి రూ.71,510 లకు తగ్గింది. -
అక్షయ తృతీయ వేళ కరుణించిన బంగారం!
అక్షయ తృతీయ పండుగ వేళ బంగారం కాస్త కరుణించింది. ఆదివారం (ఏప్రిల్ 23) 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం రెండు ధరలూ మునపటి రోజు కంటే ధర కొంతమేర తగ్గి పండుగ వేళ కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. గుడ్‌రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర ఆదివారం (ఏప్రిల్ 23) రూ.30 తగ్గి రూ.5,575 వద్ద ఉంది. శనివారం (ఏప్రిల్ 23) ఇది రూ. 5,605 ఉండేది. అదేవిధంగా 8 గ్రాముల ధర రూ.44,600, తులం (10 గ్రాములు) ధర రూ.55,750లుగా ఉంది. అంటే తులానికి రూ.300 చొప్పున ధర తగ్గింది. ఇదీ చదవండి: Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి... ఇక 24 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.33 చొప్పున తగ్గింది. ప్రస్తుతం రూ. 6,082 వద్ద ఉంది. అంతకుముందు రోజు దీని ధర రూ.6,115 ఉండేది. 8 గ్రాముల ధర రూ. 48,656లు ఉండగా 10 గ్రాములు (తులం) ధర రూ.60,820. మొత్తంగా తులంపై రూ.330 తగ్గింది. వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా.. ఢిల్లీ, జైపూర్, లక్నో, నోయిడా నగరాల్లో ఒక తులం(10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,900, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,970. అహ్మదాబాద్, బెంగళూరు, సూరత్, వడోదరలలో 22 క్యారెట్ల స్వర్ణం రూ. 55,800 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,870లుగా ఉంది. ఇక చెన్నై, కోయంబత్తూరు, మధురై నగరాల్లో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 56,050 ఉండగా 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,150 ఉంది. అలాగే హైదరాబాద్, పుణే నగరాల్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.55,750లుగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,820లుగా ఉంది. ఇదీ చదవండి: అక్షయ తృతీయ ప్రత్యేక బంగారు నాణేలు.. ఆఫర్లు! మరోవైపు బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా ఆదివారం (ఏప్రిల్ 23) తగ్గాయి. గుడ్‌రిటర్న్స్ ప్రకారం.. గ్రాము వెండి ధర రూ.0.70 తగ్గి రూ. 76.90లకు చేరింది. అంటే 8 గ్రాములకు రూ. 5.60, 10 గ్రాములకు రూ. 7 తగ్గింది. ప్రస్తుతం తులం వెండి ధర రూ.769. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో గ్రాము వెండి రూ.760, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో రూ. 804 వద్ద ఉంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
అక్షయ తృతీయ: గోల్డ్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: అక్షయ తృతీయరోజు బంగారం ధరలు స్వల్పంగా వెనక్కి తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర 62 రూపాయలు క్షీణించి 31,321 రూపాయల వద్ద కొనసాగుతోంది. ప్రపంచ మార్కెట్ల నుంచి బలహీనమైన సంకేతాలతో పసిడి ధరలు స్వల్పంగా క్షీణించినట్టు బులియన్ ట్రేడర్లు తెలిపారు. వెండి ధరలు కూడా ఇదే ధోరణిని కనబరుస్తున్నాయి. అయితే అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా మార్కెట్లో రీటైల్ కొనుగోళ్లతో నష్టాలు పరిమితంగా ఉన్నట్టు పేర్కొన్నారు. మల్టీ కామోడిటీ ఎక్స్ఛేంజ్ లో ఏప్రిల్ కాంట్రాక్టులలో బంగారం ధర 62 రూపాయలు లేదా 0.20 శాతం నష్టంతో రూ .31,321 కి చేరుకుంది.అలాగే ఆగస్టు నెలలో డెలివరీ ధర రూ .56 లేదా 0.18 శాతం పడిపోయి పది గ్రాముల రూ .31,487 కు పడి పోయాయి.స్పాట్ మార్కెట్లలో, చె న్నైలో ఓపెనింగ్ ట్రేడ్‌లో పది గ్రాముల బంగారం ధర రూ .29,920 వద్ద ఉంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో పసిడి ధరలు ఇంకే తగ్గుముఖం పట్టనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ మార్కెట్లో బలహీనంగా ఉన్న ధోరణి ఇందుకు కారణంగా పేర్కొన్నారు. అటు గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.33 శాతం తగ్గి 1,342.70 డాలర్లకు చేరుకుంది. -
అక్షయ తృతీయపై వ్యాపారుల దృష్టి
బంగారం అమ్మకాలు 30 శాతం పెరుగుతాయని అంచనా ముంబై: అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 28వ తేదీన (శుక్రవారం) బంగారం అమ్మకాలు 30 శాతం పెరుగుతాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. శుభ దినంగా భావించే అక్షయ తృతీయనాడు గత ఏడాది ఇదే రోజుతో పోలిస్తే పసిడి అమ్మకాలు 20 నుంచి 30 శాతం మేర పెరుగుతాయని భావిస్తున్నట్లు అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య చైర్మన్ నితిన్ ఖండేల్వాల్ తెలిపారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) పీఆర్ సోమసుందరం కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. పెళ్లిళ్ల సీజన్, వీకెండ్లో రావడం కొనుగోళ్లకు మరీ కలిసి వస్తున్న అంశంగా పీఎన్ గాడ్జిల్ జ్యూయెలర్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ పేర్కొన్నారు. డీమోనిటైజేషన్ నుంచి వినియోగదారుల్లో పసిడి పట్ల మరింత సానుకూల ధోరణి ఏర్పడినట్లు భావిస్తున్నట్లు డబ్ల్యూహెచ్పీ జ్యూయెలర్స్ డైరెక్టర్ ఆదిత్య పాథే వివరించారు. ప్రస్తుత ధరలు ఇలా... ఇదిలావుండగా, అంతర్జాతీయ మార్కెట్– నైమెక్స్ ఫ్యూచర్స్‌లో కడపటి సమాచారం అందే సరికి ఔన్స్ (31.1గ్రా) ధర స్వల్ప నష్టంతో 1,264 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో రూ. 90 నష్టంతో రూ. 28,725 వద్ద ట్రేడవుతోంది. ఇక ముంబై స్పాట్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత పసిడి 10 గ్రాముల ధర బుధవారం కిత్రం రోజుతో పోల్చితే, రూ.205 తగ్గి రూ. 28,950 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర సైతం అంతే స్థాయిలో తగ్గి రూ.28,800 వద్దకు చేరింది. ఇక వెండి కేజీ ధర రూ. 555 తగ్గి రూ.40,980కి దిగింది.