breaking news
akbar ali
-
భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా డీకే.. పూర్తి వివరాలు
హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 (Hong Kong Sixes) టోర్నమెంట్‌కు భారత్ తమ జట్టును ప్రకటించింది. హాంకాంగ్‌లో నవంబరు 6 నుంచి 9 వరకు మోంగ్ కాక్ వేదికగా జరిగే ఈ పొట్టి టోర్నీలో భారత్‌కు.. మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) సారథ్యం వహించనున్నాడు.డీకేతో పాటు రాబిన్ ఊతప్ప, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, భరత్ చిప్లి, షాబాజ్ నదీమ్‌లు హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్‌లో పాల్గొననున్నారు. అదే విధంగా.. దేశీ వెటరన్ క్రికెటర్ ప్రియాంక్ పాంచల్ (Priyank Panchal) కూడా ఈ టోర్నీలో భాగం కానున్నాడు.ఆరు ఓవర్ల పాటు ఆట కాగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ టోర్నీలో.. ఒక్కో టీమ్‌లో ఆరుగురు సభ్యులు (మాజీ క్రికెటర్లు) ఉంటారు. ఆరు ఓవర్ల పాటు ఆట సాగుతుంది. ఇక ఈ షార్టెస్ట్ క్రికెట్ ఈవెంట్లో 2005లో టైటిల్ గెలిచిన భారత్.. రెండుసార్లు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.అయితే, గతేడాది రాబిన్ ఊతప్ప కెప్టెన్సీలో కనీసం ఫైనల్ కూడా చేరలేదు టీమిండియా. ఈ నేపథ్యంలో ఈసారి కొత్త సారథిగా డీకే రావడం విశేషం. కాగా తాజా ఎడిషన్‌లో పన్నెండు జట్లు పాల్గొంటున్నాయి.పన్నెండు జట్లు ఇవేభారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, నేపాల్, ఇంగ్లండ్, యూఏఈ, కువైట్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ (చైనా) ఈసారి టోర్నీలో భాగం కానున్నాయి. పూల్- ‘ఎ’ నుంచి సౌతాఫ్రికా అఫ్గనిస్తాన్, నేపాల్.. పూల్- ‘బి’ నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ యూఏఈ.. పూల్- ‘సి’ నుంచి ఇండియా, పాకిస్తాన్, కువైట్... పూల్- ‘డి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ పోటీపడతాయి.హాంకాంగ్ సిక్సెస్-2025లో పాల్గొనే జట్ల వివరాలుభారత్దినేశ్ కార్తిక్ (కెప్టెన్), రాబిన్ ఊతప్ప, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, భరత్ చిప్లి, షాబాజ్ నదీమ్, ప్రియాంక్ పాంచల్.ఆస్ట్రేలియాఅలెక్స్ రాస్ (కెప్టెన్), బెన్ మెక్‌డెర్మాట్, జాక్ వుడ్, నిక్ హోబ్సన్, క్రిస్ గ్రీన్, విల్ బొసిస్టొ, ఆండ్యూ టై.ఇంగ్లండ్జో డెన్లీ (కెప్టెన్), జేమ్స్ కోల్స్, ఈథన్ బ్రూక్స్, టోబీ అల్బర్ట్, జార్జ్ హిల్ డాన్ మౌస్లే, టామ అస్పిన్‌వాల్.బంగ్లాదేశ్అక్బర్ అలీ (కెప్టెన్) అబు హైదర్ రోని, జిషాన్ ఆలం, మొహమ్మధ్ సైఫుద్దీన్, మొసాడెక్ హొసేన్, రకీబుల్ హసన్, టొఫేల్ అహ్మద్.యూఏఈకౌశిక్ హర్షిత్ (కెప్టెన్), ఖలీద్ షా, ముహమ్మద్ అర్ఫాన్, ముహమ్మద్ ఫారూక్, ముహమ్మద్ సాగిర్ ఖాన్, నిలాన్ష్ కేస్వాని, రెజిత్ కురుంగొడె, జాహిద్ అలీ.కువైట్యాసిన్ పటేల్ (కెప్టెన్), ఉస్మాన్ పటేల్, మీట్ భవ్సార్, బిలాల్ తాహిర్, రవిజ సాండరువాన్, అద్నాన్ ఇద్రీస్, మొహమద్ షఫీక్.నేపాల్శరద్ వేసావ్కర్ (కెప్టెన్), సందీప్ జోరా, లోకేశ్ బామ్, బాసిర్ అహ్మద్, ఆదిల్ ఆలం, రషీద్ ఖాన్, రూపేశ్ సింగ్.శ్రీలంకలాహిరు మధుషాంక (కెప్టెన్), ధనంజయ లక్షణ్, తనుక దబారే, నిమేశ్ విముక్తి, లాహిరు సమారకూన్, థారిందు రత్నాయక, సచిత జయతిలకె.సౌతాఫ్రికాజోర్డాన్ మోరిస్ (కెప్టెన్), అబ్దుల్లా బయోమి, ఈథన్ కన్నింగ్‌హామ్, బులెలొ దూబే, కషీఫ్ జోసెఫ్, బ్లేక్ సింప్సన్, జోరిచ్ వాన్ షాల్వేక్.హాంకాంగ్యాసిమ్ ముర్తజా (కెప్టెన్), బాబర్ హయత్, అన్షుమాన్ రథ్, ఐజాజ్ ఖాన్, నిజాకత్ ఖాన్, ఎహ్సాన్ ఖాన్, నస్రుల్లా రాణా.అఫ్గనిస్తాన్గుల్బదిన్ నైబ్ (కెప్టెన్), ఇక్రామ్ అలిఖిల్, కరీం జన్మత్, షరాఫుద్దీన్ ఆష్రఫ్, ఫర్మానుల్లా సఫీ, ఐజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్, సెదీకుల్లా పచా.పాకిస్తాన్అబ్బాస్ ఆఫ్రిది (కెప్టెన్), అబ్దుల్ సమద్, ఖవాజా మొహమద్ నఫాయ్, మాజ్ సదాకత్, మొహమద్ షాజాద్, సాద్ మసూద్ షాహిద్ అజీజ్.చదవండి: యాషెస్ తొలి టెస్ట్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన -
బంగ్లాదేశ్ కెప్టెన్‌గా దేశవాలీ స్టార్
నవంబర్ 14 నుంచి 23 మధ్యలో ఖతార్ వేదికగా జరిగే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్-2025 (ACC Cup Rising Stars 2025) కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్-ఏ జట్టును (Bangladesh-A) ఇవాళ (నవంబర్ 5) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా దేశవాలీ స్టార్, వికెట్‌కీపర్, బ్యాటర్ అయిన అక్బర్ అలీ (Akbar Ali) ఎంపికయ్యాడు.అక్బర్ అలీకి దేశవాలీ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. 92 మ్యాచ్‌ల్లో 27.65 సగటున 1853 పరగులు చేశాడు. అతని తాజాగా ప్రదర్శనలు (40, 44, 28) కూడా పర్వాలేదనేలా ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలైన రాజ్‌షాహీ, ఖుల్నా టైగర్స్ తరఫున కూడా అక్బర్ అలీ సత్తా చాటాడు.ఈ జట్టు అక్బర్‌తో పాటు అనుభవజ్ఞులు, యువశక్తి కలయికగా ఉంది. అబూ హీదర్ రోని, రిపోన్ మొండల్ బంగ్లాదేశ్ సీనియర్ జట్టు తరఫున సత్తా చాటారు. రోని 2016, మొండల్ 2023లో సీనియర్ టీమ్‌లోకి అరంగేట్రం చేశారు. యార్కర్ స్పెషలిస్ట్ అయిన రోని 13 టీ20ల్లో 6 వికెట్లు తీయగా.. మొండల్ 23 టీ20ల్లో 31 వికెట్లు తీశాడు. ఈ జట్టులో దేశవాలీ స్టార్లు,యువ ఆటగాళ్లు జిషన్ అలం, మహిదుల్ ఇస్లాం, అరిఫుల్ ఇస్లాం వంటి వారికి చోటు దక్కింది.ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌తో పాటు భారత్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంగ్‌కాంగ్ జట్లు పాల్గొంటున్నాయి. బంగ్లాదేశ్.. ఆఫ్ఘనిస్తాన్-ఏ, శ్రీలంక-ఏ, హాంగ్‌కాంగ్‌లతో కలిసి గ్రూప్-బిలో పోటీపడుతుండగా.. భారత్-ఏ, పాకిస్తాన్-ఏ, ఒమన్, యూఏఈ గ్రూప్-ఏ తలపడనున్నాయి.టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్, ఒమన్ తలపడనుండగా.. రెండో మ్యాచ్‌లో భారత్, యూఏఈ ఢీకొంటాయి. నవంబర్ 15న జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ హాంగ్‌కాంగ్‌ను ఎదుర్కొంటుంది. ఈ టోర్నీలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లోకి మిగతా జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు (A1 vs B2, B1 vs A2) చేరతాయి. ఈ మ్యాచ్‌లు నవంబర్ 21న జరుగుతాయి. సెమీస్ విజేతలు నవంబర్ 23న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.బంగ్లాదేశ్ ఏ జట్టు..అక్బర్ అలీ (కెప్టెన్), జిషాన్ అలం, హబీబుర్ రెహమాన్, జవాద్ అబ్రార్, అరిఫుల్ ఇస్లాం, యాసిర్ అలీ చౌదరి, మహిదుల్ ఇస్లాం భుయాన్, రకీబుల్ హసన్, ఎస్ఎం మెహెరోబ్ హుస్సేన్, అబూ హిడర్ రోనీ, తుఫాయెల్ అహ్మద్, షాధిన్ ఇస్లాం, రిపోన్ మొండోల్, అబ్దుల్ గఫార్ సక్లైన్, మృత్తుంజయ్ చౌదరిచదవండి: ప్రపంచ క్రికెట్‌ను శాశించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టిన కోహ్లి -
‘ఆసరా’లేక..
నర్సాపూర్ రూరల్, దుబ్బాక: ఇన్నాళ్లు వచ్చిన రూ.200 అయినా ఎంతోకొంత ఆసరా అయ్యాయి. అయితే ఇకనుంచి రూ.1000 వస్తాయనుకుంటే పింఛనే లేకుండా పోయింది. ఇక ఎలా బతకాలి అని అనుకున్నరో ఏమో జిల్లాలో ఓ వృద్ధుడు, వితంతువు మృతిచెందారు. ఈ సంఘటన లు నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తిలో, దుబ్బాకలో ఆదివారం చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామానికి చెందిన ఎండి అక్బర్అలీ(70) గ్రామంలో శనివారం పెన్షన్లు ఇస్తున్నట్లు తెలుసుకొని ఉదయం 10గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లాడుడు. సాయంత్రం 5గంటలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి జెడ్పీచైర్‌పర్సన్, ఎమ్మెల్యేలు వచ్చి కొంతమందికి పెన్షన్ పంపిణీ చేసి వెళ్లిపోయారు. మిగత వారికి గ్రామ కార్యదర్శి తారసింగ్ రాత్రి 7గంటల వరకు పెన్షన్ పంపిణీ చేశాడు. ఎంతకు తన పేరు రాకపోవడంతో కార్యదర్శిని అడగా నీపేరు లేదు తరువాత జాబితాలో వస్తుందని చెప్పారు. దీంతో మనస్థాపానికి గురైన అతను ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని అతని భార్య చెప్పాడు. తనకు పెన్షన్ రాలేదని శనివారం రాత్రి సరిగా భోజనం చేయకుండా ఆలోచిస్తూ పడుకున్నాడు. అదివారం ఉదయం భార్య అలిమాబీ ఎంత లేపిన లేవకపోవడంతో దగ్గరకు వెళ్లి చూడగా మృతిచెంది ఉన్నాడు. అలీమాబీ రోదనలతో చుటుపక్కల వారు వచ్చి ఆమెను ఓదార్చారు. తనకు సరిగా కళ్లు కనింపిచవని, ఇద్దరు కొడుకులు బతుదెరువు కోసం కొన్ని ఏళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లిపోయారంటూ రోదిస్తూ చెప్పడం అక్కడున్న వారందర్నీ కలచివేసింది. పెన్షన్ వచ్చి ఉంటే తన భర్త బతికి ఉండేవాడని ఆరోపించారు. ఈవిషయమై గ్రామ కార్యదర్శి తారసింగ్ను వివరణ కోరగా ఆన్లైన్లో అతని పేరు రాకపోవడంతో మరోసారి దరఖాస్తు ఆన్లైన్లో పంపించామని చెప్పారు. తుదిజాబితాలో అతని పేరు ఉందని త్వరలో వస్తుందని శనివారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వద్దకు వస్తే చెప్పి ఇంటికి పంపించినట్లు తెలిపారు. పింఛన్ రాలేదన్న బెంగతో... నగర పంచాయతీలో ఇటీవల ప్రచురించిన పింఛన్ జాబితాలో పేరు లేదన్న బెంగతో ఓ వితంతువు మరణించింది. ఈ సంఘటన దుబ్బాకలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ జిల్లా బిక్కనూర్ మండలం రామేశంపల్లి గ్రామానికి చెందిన అల్లం బాల్‌లక్ష్మి(50) భర్త చనిపోవడంతో గత 15 సంవత్సరాలుగా దుబ్బాక పట్టణ కేంద్రంలోనే బీడీలు చుడుతూ నివాసం ఉంటోంది.గతంలో కూడా బాల్లక్ష్మికి రూ. 200 పింఛన్ వస్తుండేది. నగర పంచాయతీ అధికారులు ఇటీవల ప్రచురించిన జాబితాలో బాల్‌లక్ష్మి పేరు లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై బెంగపెట్టుకోవడమే కాకుండా అనారోగ్యానికి గురైంది. తీవ్ర అనారోగ్యానికి గురైన బాల్లక్ష్మిని ఆదివారం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది. -
తెలంగాణ వర్సిటీ మాజీ వీసీ మెడకు బిగిసిన ఉచ్చు
సీఎం వద్దకు చేరిన విచారణ నివేదిక డిచ్పల్లి: తెలంగాణ యూనివర్సిటీ మాజీ వీసీ అక్బర్ అలీఖాన్ మెడకు నియామకాల ఉచ్చు బిగిసింది. వర్సిటీలో చేపట్టిన టీచింగ్, నాన్‌టీచింగ్ నియామకాలకు సంబంధించి వీసీపై ఆరోపణలు రావడంతో గవర్నర్ నరసింహన్ విచారణకు ఆదేశించగా, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ రాములు విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ విచారణలో.. నియామకాల నిలిపివేతకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా వీసీ పట్టించుకోలేదని తేలింది. రెండు, మూడు రోజులలో సీఎం ఈ విషయమై చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ల ఎంపికలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు జస్టిస్ సీవీ రాములు తన నివేదికలో నిర్ధారించినట్లు సమాచారం. నియామకాలు రద్దు చేయాలని, కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది. మాజీ వీసీ అక్బర్ అలీఖాన్ రాష్ట్ర మంత్రుల చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. ఇన్చార్జ వీసీ శైలజా రామయ్యర్‌కు చెప్పించి వేతనాలందేలా చూస్తానని కొత్త అధ్యాపకులకు భరోసా ఇస్తున్నట్లు తెలిసింది. పదవీకాలం ముగిసినా, ప్రస్తుతం ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో విధుల్లో ఉన్న విషయం తెలిసిందే.


