హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 (Hong Kong Sixes) టోర్నమెంట్‌కు భారత్ తమ జట్టును ప్రకటించింది. హాంకాంగ్‌లో నవంబరు 6 నుంచి 9 వరకు మోంగ్ కాక్ వేదికగా జరిగే ఈ పొట్టి టోర్నీలో భారత్‌కు.. మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) సారథ్యం వహించనున్నాడు.
డీకేతో పాటు రాబిన్ ఊతప్ప, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, భరత్ చిప్లి, షాబాజ్ నదీమ్‌లు హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్‌లో పాల్గొననున్నారు. అదే విధంగా.. దేశీ వెటరన్ క్రికెటర్ ప్రియాంక్ పాంచల్ (Priyank Panchal) కూడా ఈ టోర్నీలో భాగం కానున్నాడు.
ఆరు ఓవర్ల పాటు ఆట
కాగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ టోర్నీలో.. ఒక్కో టీమ్‌లో ఆరుగురు సభ్యులు (మాజీ క్రికెటర్లు) ఉంటారు. ఆరు ఓవర్ల పాటు ఆట సాగుతుంది. ఇక ఈ షార్టెస్ట్ క్రికెట్ ఈవెంట్లో 2005లో టైటిల్ గెలిచిన భారత్.. రెండుసార్లు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
అయితే, గతేడాది రాబిన్ ఊతప్ప కెప్టెన్సీలో కనీసం ఫైనల్ కూడా చేరలేదు టీమిండియా. ఈ నేపథ్యంలో ఈసారి కొత్త సారథిగా డీకే రావడం విశేషం. కాగా తాజా ఎడిషన్‌లో పన్నెండు జట్లు పాల్గొంటున్నాయి.
పన్నెండు జట్లు ఇవే
భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, నేపాల్, ఇంగ్లండ్, యూఏఈ, కువైట్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ (చైనా) ఈసారి టోర్నీలో భాగం కానున్నాయి. పూల్- ‘ఎ’ నుంచి సౌతాఫ్రికా అఫ్గనిస్తాన్, నేపాల్.. పూల్- ‘బి’ నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ యూఏఈ.. పూల్- ‘సి’ నుంచి ఇండియా, పాకిస్తాన్, కువైట్... పూల్- ‘డి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ పోటీపడతాయి.
హాంకాంగ్ సిక్సెస్-2025లో పాల్గొనే జట్ల వివరాలు
భారత్
దినేశ్ కార్తిక్ (కెప్టెన్), రాబిన్ ఊతప్ప, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, భరత్ చిప్లి, షాబాజ్ నదీమ్, ప్రియాంక్ పాంచల్.
ఆస్ట్రేలియా
అలెక్స్ రాస్ (కెప్టెన్), బెన్ మెక్‌డెర్మాట్, జాక్ వుడ్, నిక్ హోబ్సన్, క్రిస్ గ్రీన్, విల్ బొసిస్టొ, ఆండ్యూ టై.
ఇంగ్లండ్
జో డెన్లీ (కెప్టెన్), జేమ్స్ కోల్స్, ఈథన్ బ్రూక్స్, టోబీ అల్బర్ట్, జార్జ్ హిల్ డాన్ మౌస్లే, టామ అస్పిన్‌వాల్.
బంగ్లాదేశ్
అక్బర్ అలీ (కెప్టెన్) అబు హైదర్ రోని, జిషాన్ ఆలం, మొహమ్మధ్ సైఫుద్దీన్, మొసాడెక్ హొసేన్, రకీబుల్ హసన్, టొఫేల్ అహ్మద్.
యూఏఈ
కౌశిక్ హర్షిత్ (కెప్టెన్), ఖలీద్ షా, ముహమ్మద్ అర్ఫాన్, ముహమ్మద్ ఫారూక్, ముహమ్మద్ సాగిర్ ఖాన్, నిలాన్ష్ కేస్వాని, రెజిత్ కురుంగొడె, జాహిద్ అలీ.
కువైట్
యాసిన్ పటేల్ (కెప్టెన్), ఉస్మాన్ పటేల్, మీట్ భవ్సార్, బిలాల్ తాహిర్, రవిజ సాండరువాన్, అద్నాన్ ఇద్రీస్, మొహమద్ షఫీక్.
నేపాల్
శరద్ వేసావ్కర్ (కెప్టెన్), సందీప్ జోరా, లోకేశ్ బామ్, బాసిర్ అహ్మద్, ఆదిల్ ఆలం, రషీద్ ఖాన్, రూపేశ్ సింగ్.
శ్రీలంక
లాహిరు మధుషాంక (కెప్టెన్), ధనంజయ లక్షణ్, తనుక దబారే, నిమేశ్ విముక్తి, లాహిరు సమారకూన్, థారిందు రత్నాయక, సచిత జయతిలకె.
సౌతాఫ్రికా
జోర్డాన్ మోరిస్ (కెప్టెన్), అబ్దుల్లా బయోమి, ఈథన్ కన్నింగ్‌హామ్, బులెలొ దూబే, కషీఫ్ జోసెఫ్, బ్లేక్ సింప్సన్, జోరిచ్ వాన్ షాల్వేక్.
హాంకాంగ్
యాసిమ్ ముర్తజా (కెప్టెన్), బాబర్ హయత్, అన్షుమాన్ రథ్, ఐజాజ్ ఖాన్, నిజాకత్ ఖాన్, ఎహ్‌సాన్ ఖాన్, నస్రుల్లా రాణా.
అఫ్గనిస్తాన్
గుల్బదిన్ నైబ్ (కెప్టెన్), ఇక్రామ్ అలిఖిల్, కరీం జన్మత్, షరాఫుద్దీన్ ఆష్రఫ్, ఫర్మానుల్లా సఫీ, ఐజాజ్ అహ్మద్ అహ్మద్‌జాయ్, సెదీకుల్లా పచా.
పాకిస్తాన్
అబ్బాస్ ఆఫ్రిది (కెప్టెన్), అబ్దుల్ సమద్, ఖవాజా మొహమద్ నఫాయ్, మాజ్ సదాకత్, మొహమద్ షాజాద్, సాద్ మసూద్ షాహిద్ అజీజ్.


