breaking news
Ajoy Mukherjee
-
భారీగా క్యాంపస్ హైరింగ్: టీసీఎస్
2015-16లో 35 వేల పైచిలుకు ఫ్రెషర్ల నియామకానికి యోచన ముంబై: సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారీగా క్యాంపస్ నియామకాలు చేపట్టనుంది. మొత్తం 35,000 మంది ఫ్రెషర్లను తీసుకోనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ ముఖర్జీ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్ల నియామకాలతో పోలిస్తే ఇది 10,000 అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ 25,000 పైచిలుకు ఆఫర్లు ఇవ్వగా, 71-72 శాతం మంది ఫ్రెషర్లు చేరే అవకాశముందని భావిస్తున్నట్లు ముఖర్జీ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ రిక్రూట్మెంట్లతో పాటు ఇతర దరఖాస్తుదారులకు సంబంధించి తాము నిర్దేశించుకున్న 55,000 నియామకాల లక్ష్యాన్ని మించి హైరింగ్ ఉండగలదని ఆయన వివరించారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు తగ్గిందని, భవిష్యత్‌లో ఇది మరింత తగ్గొచ్చని తెలిపారు. మరోవైపు, 2015-16 ఏడాది రిక్రూట్మెంట్స్కి సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభించామని, క్యాంపస్‌లను సందర్శిస్తున్నామని ముఖర్జీ పేర్కొన్నారు. సుమారు 350-400 విద్యా సంస్థలను సందర్శించనున్నట్లు ఆయన వివరించారు. -
ఫేస్‌బుక్‌తో తగ్గుతున్న హైరింగ్ భారం
ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 55 వేల మందికి ఉద్యోగాలివ్వనున్నది. ఇప్పటికే 25 వేల మందికి ఆఫర్ లెటర్లు ఇచ్చామని టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ అజోయ్ ముఖర్జీ చెప్పారు. టైర్-వన్, టైర్-టూ నగరాల నుంచే ఈ సారి హైరింగ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇక హైరింగ్ విషయంలో ఫేస్బుక్, లింక్డెన్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల వలన తమపై భారం తగ్గుతోందని వివరించారు. వీటి ద్వారా నేరుగా అభ్యర్ధులను ఎంపిక చేసుకుంటున్నామని, ఫలితంగా ఇతర నియామక ఏజెన్సీలపై ఆధారపడడం తగ్గుతోందని తెలిపారు. మూణ్నెళ్లలో కొలువులే... కొలువులు: మ్యాన్‌పవర్ సర్వే కాగా వ్యాపార సెంటిమెంట్ మెరుగుపడటంతో భారత కంపెనీలు భారీగా ఉద్యోగాలివ్వనున్నాయి. రానున్న మూడు నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియలు జోరుగా చేపట్టాలని ఆ కంపెనీలు యోచిస్తున్నాయని ప్రముఖ హెచ్ఆర్ సంస్థ మ్యాన్‌పవర్ రూపొందించిన ద మ్యాన్‌వపర్ ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ సర్వే వెల్లడించింది. మొత్తం 5,389 కంపెనీలపై నిర్వహించిన ఈ తాజా సర్వే వివరాలు.., - స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వ్యాపార సెంటిమెంట్ మెరుగుపడి ఇప్పటికే కొన్ని రంగాల్లో హైరింగ్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. - జూలై-సెప్టెంబర్ కాలానికి భారీ స్థాయిలోనే ఉద్యోగాలివ్వగలమని కంపెనీలు భావిస్తున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే హైరింగ్ అవుట్‌లుక్ 46 శాతం అధికంగా ఉంది. - భారత్, తైవాన్, టర్కీ, న్యూజిలాండ్, సింగపూర్ కంపెనీలు ఉద్యోగ కల్పన పట్ల పటిష్టమైన ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఇటలీ, బెల్జియం, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ దేశాల కంపెనీలు మాత్రం ఏమంత ఆశావహంగా లేవు.