breaking news
Ajmera Chandulal
-
నింగీ నేలను కలుపుతూ..
సాక్షి, హైదరాబాద్: రంగు రంగుల పతంగులు రకరకాల ఆకృతులతో నింగీ నేలను కలుపుతూ రివ్వున ఎగిరాయి.. ఆకాశానికి నిచ్చెన వేశారా అనిపించేలా గాలిపటాలు దూసుకుపోయాయి.. వంద లాది పతంగులు ఒకేసారి గాలి లోకి ఎగిరి అద్భుతాన్ని ఆవిష్కరించాయి. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రారంభమైన అంత ర్జాతీయ పతంగుల పండుగ సందర్భంగా కనిపించిన దృశ్యాలివీ. ఉదయం ప్రారంభమైన ఈ కైట్ ఫెస్టివల్ రాత్రి వరకు కొనసాగగా.. తొలిరోజు దాదాపు 50 వేల మంది నగరవాసులు తిలకించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన పతంగుల పోటీదారులతో పరేడ్ మైదానం కోలాహలంగా మారింది. 3 రోజులపాటు పతంగుల పండుగ నగరవాసులకు కనువిందు చేయనుంది. అందరినీ ఏకతాటిపైకి తేవడానికే.. భాగ్యనగరంలో ఉన్న సకలజనులను ఏకతాటిపైకి తేవటమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకే దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా వివిధ రకాల ఫెస్టివల్స్‌ను తమ ప్రభుత్వం నిర్వహిస్తోందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో భాషా సాంస్కృతిక శాఖ–పర్యాటక శాఖల ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను మహమూద్ అలీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రారంభించారు. మహమూద్ మాట్లాడుతూ 15 దేశాలు, 25 రాష్ట్రాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన భిన్న జాతులు, సంస్కృతులు కలిగిన వారిని ఏకతాటిపైకి తెచ్చే ఉద్దేశంతో పతంగుల పండుగ నిర్వహిస్తున్నామని తెలిపారు. మంత్రి చందూలాల్ మాట్లాడుతూ.. పతంగుల పండుగలో నగర ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ బాల్యదశలో దోస్తులతో కలసి సంక్రాంతి ఆనందంగా జరుపుకునేవాడినని గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది సింగపూర్, థాయిలాండ్, కొరియా, జపాన్, చైనా సహా పది దేశాలు, మనదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 40 కైట్ ఫ్లేయర్ బృందాలు పాల్గొంటున్నాయని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. -
పర్యాటకానికి అంతర్జాతీయ గుర్తింపు
మంత్రి అజ్మీర చందూలాల్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషిచేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ అధికారులకు సూచించారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో సాగుతున్న వివిధ అభివృద్ధి పనులను సోమవారం ఆయన పర్యాటక భవన్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రస్తుత పర్యాటక రంగం పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలతో పాటు అలీసాగర్ ప్రాజెక్టు వద్ద ఎకో టూరిజంను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. కుంతాల, పాండవుల గుట్ట ప్రాంతాల్లో వాటర్‌ఫాల్స్ టూరిజం, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని అక్క మహాదేవి గుహల్లో కేవ్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నామన్నారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాలు, కాకతీయుల కాలం నాటి విశాలమైన చె రువులను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. నల్గొండ జిల్లాలోని బుద్ధవనం, ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీమ్ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పర్యాటక రంగాన్ని పోత్సహించేందుకు ప్రతి జిల్లాలో మేనేజర్లను నియమించాలని అధికారులను ఆదేశించారు.