breaking news
ajith son
-
వైరలవుతోన్న ‘కుట్టి థలా’ ఫోటోలు
తమిళ స్టార్ హీరో అజిత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వివాదాలకు దూరంగా.. తన పనేంటో తాను చూసుకుంటారు అజిత్. ఇక తన అభిమానులు కూడా అలానే ఉండాలని కోరుకుంటారు. ఇక అజిత్‌కు ఎంత క్రేజ్ ఉందో ఆయన కుమారుడికి కూడా అదే రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆరేళ్ల అజిత్ కుమారుడు ఆద్విక్ అజిత్ బయట కనిపిస్తే.. చాలు సోషల్ మీడియాలో కుట్టి థలా ఫోటోలు తెగ వైరలవుతాయి. తాజాగా బుధవారం ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. తల్లి షాలినితో కలిసి ఆద్విక్ ఓ పెళ్లికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (చదవండి: హ్యూమాకి భయమా?) ఈ ఫోటోల్లో షాలిని, ఆద్విక్తో పాటు షామిలి కూడా ఉన్నారు. బాల నటులుగా కోట్లాది మంది హృదాయాలను కొల్లగొట్టిన షాలిని సిస్టర్స్ ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. కుట్టి థలా వెరీ క్యూట్ అంటూ అజిత్ ఫ్యాన్స్ ఆద్విక్ని తెగ పొగుడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అజిత్ వలిమై చిత్రంలో నటిస్తున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నీరవ్ షా సినిమాటోగ్రఫి అందిస్తుండగా..హ్యుమా ఖురేషి, కార్తికేయ గుమ్మకొండ, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
అజిత్ వారసుడి పేరేంటో తెలుసా!
నటుడు అజిత్, షాలిని దంపతులకు ఇటీవల వారసుడు పుట్టిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న జంటలో అన్యోన్యంగా జీవిస్తున్న వారిలో అజిత్, షాలిని దంపతులున్నారు. 1999లో 'అమర్కాలం' అనే చిత్ర షూటింగ్లో పరిచయం అయిన అజిత్, షాలినీ అనంతరం ప్రేమలోపడి 2000లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే వీరికి 7 సంవత్సరాల పాప కూడా ఉంది. ఆమె పేరు అనౌష్క. కాగా మార్చి 2న షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ బిడ్డకు పేరేమి పెడతారన్న ఆసక్తి అజిత్ అభిమానుల్లో నెలకొంది. వారందరి కోసం అజిత్ దంపతులు తమ వారసుడికిప్పుడు అద్వేక్ అనే పేరును నిర్ణయించారు. ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మరోవైపు ఇటీవలే తాను నటించిన 'యెన్నై అరిందల్' అనే చిత్రం ఘన విజయం సాధించడంతో చాలా హుషారుగా ఉన్న అజిత్ ఇప్పుడు తనకు కుమారుడు జన్మించడంతో పుత్రోత్సహంలో మునిగి తేలుతున్నాడు.