breaking news
Ajijnagar
-
గ్రామీణ బ్యాంకులో గోల్మాల్
సాక్షి, రంగారెడ్డి: అజీజ్‌నగర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. తమ ఫిక్స్డ్ డిపాజిట్లలోని కోట్లాది రూపాయల డబ్బు ఖాతాదారులకు తెలియకుండానే మాయం అయింది. సమాచారం తెలిసిన ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. పరిసర గ్రామాల ప్రజలు బ్యాంకుకు తరలివస్తున్నారు. గ్రామస్తుల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని బ్యాంకు సిబ్బంది ఫిక్స్డ్ డిపాజట్లలోని డబ్బును మాయం చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఎఫ్డీలో డబ్బు మాయం అయిందన్న సమాచారంతో నాగిరెడ్డిగూడెం వాసి అయిన ఓ ఖాతాదారు కుప్పకూలిపోయాడు. దీంతో ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్సలందిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది. -
సమస్యల చీకట్లను తొలగించేందుకే ‘గ్రామజ్యోతి’
అజీజ్‌నగర్‌లో గ్రామజ్యోతి ప్రారంభ సభలో మంత్రి కేటీఆర్ మొయినాబాద్ రూరల్: సమస్యల చీకట్లను తొలగించి గ్రామాల్లో సర్వతోముఖాభివృద్ధి చేసేందుకే గ్రామజ్యోతి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో సోమవారం మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన గ్రామసభలో మాట్లాడుతూ గ్రామజ్యోతిలో ప్రజలే నిర్ణేతలని, సమస్యలను ప్రజలు గుర్తిస్తే వాటిని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించే బాధ్యతను పంచాయతీలు, ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. కొన్నిపార్టీలు గ్రామజ్యోతిపై రాద్ధాంతం చేస్తున్నాయని, ‘మన ఊరు- మన ప్రణాళిక’ను తీసేయలేదని, దానికి కొనసాగింపే గ్రామజ్యోతి అని స్పష్టం చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి బేసిన్‌నుంచి నీళ్లు రావడం కష్టమనే ఉద్దేశంతోనే ‘పాలమూరు- రంగారెడ్డి పథకంతో కృష్ణాబేసిన్ ద్వారా నీళ్లు తెచ్చి జిల్లా ప్రజల కాళ్లుకడుగుతామని కేటీఆర్ చెప్పారు. రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీ ఆమ్రపాలి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, అజీజ్‌నగర్ సర్పంచ్ మంగరాములు, అధికారులు పాల్గొన్నారు. ‘ప్రాణహిత’ డిజైన్ మార్చవద్దంటూ ఆందోళన గ్రామజ్యోతి కార్యక్రమ ప్రారంభోత్సవంలో కేటీఆర్ మాట్లాడుతుండగా.. ఎన్ఎస్యూఐ చెందిన యువకులు ‘ప్రాణహిత-చేవెళ్ల’ డిజైన్ మార్చవద్దని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో స్పందించిన మంత్రి ‘డిజైన్ ఎవరు మార్చారు.. ఆ విషయాన్ని ప్రభుత్వం చూసుకుటుంది.. మంచి కార్యక్రమాలలో ఇలాంటివి చేయవద్దు’ అని వారించే ప్రయత్నం చేశారు.